CMSS Recruitment 2024 in Telugu : డిగ్రీలు, పీజీలు, ఐసీడబ్ల్యూఏ, సీఏ చదివి ప్రభుత్వ రంగ ఉద్యోగాల(Job) కోసం చదువుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన దిల్లీలో సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ(CMSS).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారిగా విద్యార్హతలు నిర్ణయించింది. ఇంట్రెస్ట్, తగిన అర్హతలు ఉన్నవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంతకీ, ఎన్ని పోస్టులు ఉన్నాయి? విద్యార్హతలు ఏంటి? వయోపరిమితి? ఏ పోస్టుకి ఎంత జీతం? దరఖాస్తు విధానం వంటి తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సీఎంఎస్ఎస్ దరఖాస్తులు కోరుతున్న మొత్తం పోస్టుల సంఖ్య - 15
విభాగాల వారిగా పోస్టుల వివరాలు :
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) - 02
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్(క్వాలిటీ అస్యూరెన్స్) - 01
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్(లాజిస్టిక్స్ & సప్లై చైన్ విభాగం) - 01
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఫైనాన్స్) - 01
- మేనేజర్(ప్రొక్యూర్‌మెంట్) - 02
- మేనేజర్(లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్) - 02
- మేనేజర్ (ఫైనాన్స్) - 02
- మేనేజర్(క్వాలిటీ అస్యూరెన్స్) - 02
- వేర్ హౌస్ మేనేజర్(ఫార్మాసిస్ట్)- 01
- ఆఫీస్ అసిస్టెంట్ - 01
ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - How To Success In Interview
విద్యార్హతలు(Educational Qualifications) : కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రకటించిన సీఎంఎస్ఎస్ 2024 నోటిఫికేషన్లో ఖాళీలు ఉన్న పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి(Age Limit) : సీఎంఎస్ఎస్ 2024 కాంట్రాక్ట్ బేసిక్ నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తులు కోరుతున్న అన్ని విభాగాల అసిస్టెంట్ జనరల్ మేనేజర్, వేర్‌హౌస్ మేనేజర్ పోస్టులకు 45 ఏళ్లు ఉండాలి. అదే.. అన్ని విభాగాల మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 40ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం(Salary) : సీఎంఎస్ఎస్ 2024 కాంట్రాక్ట్ బేసిక్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం.. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు నెలకు జీతం రూ. 1,00,000 ఉండగా, మేనేజర్‌తో వేర్‌హౌస్ మేనేజర్ పోస్టులకు నెల వేతనం రూ. 50,000గా ఉంది. ఇక ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు నెలవారీ జీతం 30వేల రూపాయలుగా ఉంది.
దరఖాస్తు విధానం(Application Process) : సీఎంఎస్ఎస్ 2024 నోటిఫికేషన్ ప్రకారం తగిన అర్హతలు ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానం ద్వారా ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ ద్వారా కింది అడ్రస్‌కు తమ వివరాలను పంపాల్సి ఉంటుంది.
అడ్రస్ : ది జనరల్ మేనేజర్(అడ్మినిస్ట్రేషన్), సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సోసైటీ, సెకండ్ ఫ్లోర్, విశ్వ యువక్ కేంద్ర, Teen Murthy మార్గ్, ఛాణక్యపురి, న్యూదిల్లీ - 110021.
దరఖాస్తుకు చివరి తేదీ : 20-05-2024, సాయంత్రం 5.30 నిమిషాల వరకు.
మీకు నోటిఫికేషన్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సీఎంఎస్ఎస్ అధికారిక వెబ్సైట్ https://www.cmss.gov.in/ని సంప్రదించండి.