ETV Bharat / education-and-career

ఇంటర్​ అర్హతతో - CISFలో 1130 కానిస్టేబుల్/ ఫైర్ పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - CISF Constable Jobs 2024

CISF Constable Jobs 2024 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్​.​ 1130 సీఐఎస్​ఎఫ్ కానిస్టేబుల్​/ ఫైర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ చదివి ఉంటే చాలు. పూర్తి వివరాలు మీ కోసం.

CISF
CISF (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 10:01 AM IST

CISF Constable Jobs 2024 : కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెక్టార్లలోని పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తుంటుంది. తాజాగా ఈ యూనిట్లకు రక్షణ నిమిత్తం సీఐఎస్‌ఎఫ్‌ 1130 కానిస్టేబుల్/ ఫైర్ (మేల్‌) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్‌ (10+2)లో ఉత్తీర్ణులైన పురుషులు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి ఉన్న వాళ్లు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు :

  • కానిస్టేబుల్/ ఫైర్ (పురుషులు) : 1130 పోస్టులు (యూఆర్‌- 466, ఈడబ్ల్యూఎస్‌- 114, ఓబీసీ- 236, ఎస్టీ- 161, ఎస్సీ- 153)
  • ఆంధ్రప్రదేశ్‌లో 32, తెలంగాణాలో 26 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు : అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి 12వ తరగతి (సైన్స్ సబ్జెక్టుల)తో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి : 2024 సెప్టెంబర్​ 30 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అభ్యర్థులు 2001 అక్టోబర్​ 1 కంటే ముందు, 2006 సెప్టెంబర్​ 30 తర్వాత జన్మించి ఉండకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈఎస్‌ఎం/ ఓబీసీలకు మూడేళ్లు; ఎస్టీ, ఎస్సీలకు ఐదేళ్లపాటు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు : అభ్యర్థుల ఎత్తు కనీసం 170 సెం.మీ; ఛాతీ 80-85 సెం.మీ. ఉండాలి.

దరఖాస్తు రుసుము :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
  • ఈఎస్‌ఎం, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ : ఫిజికల్ స్టాండర్డ్​ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్​లు చేసి అర్హులైన అభ్యర్థులను సీఐఎస్​ఎఫ్ కానిస్టేబుల్​/ఫైర్​ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీత భత్యాలు : సీఐఎస్​ఎఫ్ కానిస్టేబుల్​/ఫైర్​ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 - రూ.69,100 జీతం ఉంటుంది.

రాత పరీక్ష విధానం : ఓఎంఆర్​ లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. 2 గంటల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్‌ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్‌ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లీష్/ హిందీ (25 ప్రశ్నలు- 25 మార్కులు) చొప్పున కేటాయించారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌/ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.

దరఖాస్తు విధానం

  • ముందుగా మీరు CISF అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేయండి.
  • 'న్యూ రిజిస్ట్రేషన్'​పై క్లిక్ చేసి వెబ్​సైట్​లో రిజిస్టర్ చేసుకోండి.
  • తరువాత అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయండి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించండి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్​ చేయండి.

ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 ఆగస్టు 31
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్​ 30
  • దరఖాస్తు సవరణ తేదీలు : 2024 అక్టోబర్ 10 నుంచి 12 వరకు

ముఖ్యాంశాలు :

  • సీఐఎస్‌ఎఫ్‌ 1130 కానిస్టేబుల్/ ఫైర్ (మేల్‌) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
  • ఇంటర్‌ (10+2) అర్హతతో పురుషులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.