ETV Bharat / education-and-career

స్టేట్, CBSE, ICSE సిలబస్ - మీ పిల్లలకు ఏ స్కూల్ బెస్ట్? - మీకు తెలుసా?? - Best School Board For Child

Which Type Of School Is Best : పిల్లలు ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్న సమయంలో చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్న ప్రధాన అంశం.. సెకండరీ ఎడ్యుకేషన్​లో ఏ సిలబస్ లో జాయిన్ చేయాలా అని! స్టేట్ బోర్డు స్కూల్లో కంటిన్యూ చేయాలా? సెంట్రల్ బోర్డు స్కూల్లో వేయాలా? ఇందులోనూ CBSE పాఠశాలలో చేర్చాలా? ICSE స్కూల్లో వేయాలా? ఇలా.. అనేక తర్జనభర్జనలు పడుతుంటారు. మరి.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఏ సిలబస్ చదివితే ఫ్యూచర్ బాగుంటుందో మీకు తెలుసా?

CBSE vs ICSE vs State Board
CBSE vs ICSE vs State Board (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 10:24 AM IST

CBSE vs ICSE vs State Board : కొన్ని సంవత్సరాల క్రితం వరకు టెన్త్, ఇంటర్ అంటే రాష్ట్రాల గుర్తింపు పొందిన విద్యాసంస్థలు మాత్రమే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి గల్లీలో ఓ సెంట్రల్ బోర్డ్ గుర్తింపు పొందిన విద్యాసంస్థ కనిపిస్తోంది. అందులోనూ.. CBSE, ICSE అంటూ వేర్వేరు బోర్డులు ఉంటున్నాయి. దీంతో.. పిల్లలను ఎందులో చేర్చాలి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నలకు ప్రముఖ కెరియర్ కౌన్సెలర్ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

స్టేట్ Vs సెంట్రల్..
స్టేట్ బోర్డ్ తో పోలిస్తే.. CBSE, ICSE బోర్డులు విభిన్నంగా ఉంటాయని రాజశేఖర్ చెబుతున్నారు. రాష్ట్రాల బోర్డ్ పరిధిలో ఉండే అనేక పాఠశాలల్లో మార్కులు, పరీక్షా ఫలితాల శాతంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని చెప్పారు. అందుకే చాలా సందర్భాల్లో విద్యార్థులు పొందే మార్కులకూ, వారికి ఉన్న విజ్ఞానానికి ఎక్కడా పొలిక ఉండట్లేదని అన్నారు. టెన్త్, ఇంటర్ లో 30శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన చాలామంది.. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో కనీస మార్కులు పొందలేక పోతున్నారని చెబుతున్నారు.

అదే సమయంలో CBSE, ICSE బోర్డుల్లో ఎక్కువ మార్కులు పొందలేకపోయినప్పటికీ.. జాతీయ, అంతర్జాతీయ ప్రవేశ పరీక్షల్లో కొంతమేరకు మెరుగైన ప్రతిభను చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూసుకున్నప్పుడు.. సెంట్రల్ బోర్డుల్లో చదివినవారిలో చాలామందికి మార్కులకంటే.. నైపుణ్యాలు, అవగాహన సామర్థ్యాలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ విశ్లేషించారు.

ఈ బోర్డు ఇలా.. ఆ బోర్డు అలా..
CBSE, ICSE అనేవి సెంట్రల్ బోర్డులు అయినప్పటికీ.. వీటిలోనూ తేడాలు ఉన్నాయని రాజశేఖర్ చెబుతున్నారు. CBSE సిలబస్ కొంతమేర మ్యాథ్స్, సైన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. JEE, NEET లాంటి పోటీ పరీక్షల సన్నద్ధతకు ఉపయోగపడేలా ఉంటుందని అంటున్నారు. ICSE విషయానికి వస్తే.. మ్యాథ్స్, సైన్స్ తోపాటు ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇస్తారు. స్టేట్, CBSE బోర్డులతో పోల్చినప్పుడు ICSE బోర్డుకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో ఫీజు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

నమ్మాల్సింది బోర్డును కాదు..
స్టేట్ బోర్డుతో సహా అన్నిరకాల సెంట్రల్ బోర్డుల సిలబస్ కూడా విద్యార్థి విజ్ఞానాన్నీ, పరిజ్ఞానాన్ని పెంచే విధంగానే రూపొందిస్తారని రాజశేఖర్ చెబుతున్నారు. అయితే.. వాటిని ఆచరించే పాఠశాలను బట్టే.. విద్యా నాణ్యత ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి.. కేవలం బోర్డునే నమ్మకుండా మంచి పాఠశాలను కూడా ఎంచుకొంటేనే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ సూచిస్తున్నారు. అదేవిధంగా.. విషయ పరిజ్ఞానం పెంచుకొంటూ.. వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడే విద్య కావాలనుకుంటే CBSE, ICSE బోర్డులకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో చదివిస్తే మెరుగైన ఫలితాలు లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

స్టేజ్​ ఫియర్​ పోగొట్టుకోవాలనుకుంటున్నారా? ఈ టిప్స్​ పాటిస్తే సక్సెస్​ మీ వెంటే!

బుక్​ ముట్టగానే నిద్ర వస్తుందా? ఎక్కువసేపు చదవలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించి చూడండి!

అలర్ట్​: తరచూ ఇళ్లు మారుతున్నారా? - పిల్లల మానసిక ఆరోగ్యంపై కోలుకోలేని దెబ్బ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.