BSF Recruitment 2024 : బీఎస్‌ఎఫ్ 1526 ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, హవల్దార్ (క్లర్క్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ అయిన సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఏఆర్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోట్ : అసోం రైఫిల్ ఎగ్జామినేషన్-2024 ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న మహిళలు, పురుషులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
- హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్/ కంబాటెంట్ మినిస్టీరియల్), హవల్దార్ (క్లర్క్) : 1283 పోస్టులు
- అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI)- (స్టెనోగ్రాఫర్/ కంబాటెంట్ స్టెనోగ్రాఫర్), వారెంట్ ఆఫీసర్ (పర్సనల్ అసిస్టెంట్) : 243 పోస్టులు
- మొత్తం పోస్టులు : 1,526.
విద్యార్హతలు
పోస్టులను అనుసరించి అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టైపింగ్, స్టెనోగ్రఫీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు ఉండి తీరాలి.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 2024 ఆగస్టు 1 నాటికి 18 ఏళ్లు నుంచి 25 ఏళ్లు మధ్యలో ఉండాలి.
శారీరక ప్రమాణాలు
- ఏఎస్సై (పురుషులు) : ఎత్తు - 165 సెం.మీ; ఛాతీ - 77-82 సెం.మీ;
- ఏఎస్సై (మహిళలు) : ఎత్తు - 155 సెం.మీ;
- హెడ్ కానిస్టేబుల్ (పురుషులు) : ఎత్తు - 165 సెం.మీ; ఛాతీ - 77-82 సెం.మీ;
- హెడ్ కానిస్టేబుల్ (మహిళలు) : ఎత్తు - 155 సెం.మీ;
ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్,
- ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్
- ట్రేడ్ టెస్ట్
- మెడికల్ ఎగ్జామినేషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు విధానం
- ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ముందుగా rectt.bsf.gov.in ఓపెన్ చేయాలి.
- అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2024 జూన్ 09
- దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జులై 08
గూగుల్ బంపర్ ఆఫర్ - ఉచితంగా AI కోర్సులు - నేర్చుకుంటే జాబ్ గ్యారెంటీ! - Google AI Courses For Free