ETV Bharat / education-and-career

డిప్లొమా, ఐటీఐ అర్హతతో BELలో జాబ్స్​- దరఖాస్తుకు లాస్ట్​ డేట్​ ఇదే! - BEL Recruitment 2024 - BEL RECRUITMENT 2024

BEL Recruitment 2024 : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్​. హైదరాబాద్​లో ప్రభుత్వ రంగ సంస్థ భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​(బెల్​)లో ఇంజినీరింగ్ అసిస్టెంట్​ ట్రెయినీ, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికికేష్​ విడుదలైంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం.

BEL Recruitment 2024
BEL Recruitment 2024 (GettyImages)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 1:09 PM IST

BEL Recruitment 2024 : ప్రభుత్వ రంగ సంస్థ భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​(బెల్​) హైదరాబాద్​లో శాశ్వత ప్రాతిపదికన ఇంజినీరింగ్ అసిస్టెంట్​ ట్రెయినీ, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ల గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • మొత్తం పోస్టులు : 32
  • ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ-12
  • టెక్నీషియన్‌ సీ-17
  • జూనియర్‌ అసిస్టెంట్‌-3

విద్యార్హతలు
ఇంజినీరింగ్​ అసెస్టెంట్​ ట్రెయినీ పోస్టు కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ట్రేడ్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్-సీ పోస్టు కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌/ ఎలక్ట్రికల్‌)తోపాటు ఏడాది అప్రెంటిస్‌షిప్‌ పూర్తిచేయాలి. లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసై, మూడేళ్ల నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ కోర్సు చేసి ఉండాలి. ఇక జూనియర్ అసిస్టెంట్​ కోసం బీకాం/ బీబీఎం అర్హత సరిపోతుంది.

వయోపరిమితి
మూడు పోస్టులకూ 2024 జూన్ 1 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది. అయితే అభ్యర్థులు తెలంగాణ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలి. గడువు తేదీ ముగిసిన/ పనిచేయని ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కార్డులను పరిగణనలోకి తీసుకోరు.

దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.250(18శాతం జీఎస్​టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఎక్స్​-సర్వీస్​మెన్, ఎస్టీ, ఎస్సీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

పే స్కేల్​
ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ పోస్టుకు రూ.24,500- రూ.90,000 వేతనం ఉంటుంది. టెక్నీషియన్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.21,500- రూ.82,000 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక విధానం
అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. మొదట విద్యార్హతల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రంలో 150 మార్కులకు రెండు పార్టులు ఉంటాయి.

  • పార్ట్‌-1 జనరల్‌ అవేర్‌నెస్‌కు 50 మార్కులు. జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, ఆప్టిట్యూడ్, లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్, కాంప్రహెన్షన్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ స్కిల్స్, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • పార్ట్‌-2 టెక్నికల్‌/ ట్రేడ్‌ ఆప్టిట్యూడ్‌కు 100 మార్కులు. సంబంధిత బ్రాంచ్‌ నుంచి టెక్నికల్‌/ ట్రేడ్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన 100 ప్రశ్నలు ఇస్తారు.
  • అయితే జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌లు పార్ట్‌-1, పార్ట్‌-2లో వేర్వేరుగా 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
  • ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పార్ట్‌-1, పార్ట్‌-2లో వేర్వేరుగా 30 శాతం మార్కులు తెచ్చుకోవాలి.
  • ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరులో ఆరు నెలల శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.24 వేలు స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణానంతరం గ్రెడేషన్‌ టెస్ట్‌ పాసైన తర్వాత రెగ్యులర్‌ పే స్కేల్‌కు ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జూన్ 27

వెబ్​సైట్​

https://bel-india.in/

నిరుద్యోగులకు తీపి కబురు​ - రైల్వేలో 18,799 అసిస్టెంట్​ లోకో పైలట్​ పోస్టుల భర్తీ!

పేరెంటింగ్​ టిప్స్​: మొదటిరోజు మీ పిల్లలతో కలిసి స్కూల్​కు వెళ్తున్నారా? టీచర్స్​ను ఈ విషయాలు అడగడం మర్చిపోవద్దు! - Parenting Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.