ETV Bharat / business

ఆటోమేటిక్ Vs మాన్యువల్ కారు - భారతీయులు ఏది ఎక్కువ కొంటున్నారు? - ఎందుకు? - Why Indians Prefer Manual Cars

Why Indians Prefer Manual Cars : కార్ల తయారీలో ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ కార్లను ఎంచుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయినప్పటికీ, ప్రస్తుతం ఇండియాలో కారు కొనే వినియోగదారులు మాన్యువల్ గేర్‌బాక్స్‌లు ఉన్న వాటిని తీసుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. అందుకు గల కారణాలను వివరించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Automatic Cars
Manual Cars
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 12:46 PM IST

Why Indians Prefer Manual Cars Over Automatic : ఇండియాలో కొవిడ్ మహమ్మారి తర్వాత ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్ కార్లను చాలా మంది కస్టమర్లు ఎంచుకుంటున్నారు. ఎందుకంటే డ్రైవింగ్​ చేయడానికి సులువుగా ఉంటుందని, ప్రత్యేకించి ట్రాఫిక్ ప్రాంతాలలో తరచుగా గేర్లు మార్చడం, క్లచింగ్ అవసరం ఉండదనే ఉద్దేశంతో వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వాహనాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, ఇండియాలో మెజార్టీ పీపుల్.. మాన్యువల్ ట్రాన్స్​మిషన్ కార్లను(Car) తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అందుకు గల కారణాలను కూడా వివరించాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ధర విషయంలో తేడాలు : ఇండియాలో ఎక్కువ మంది మాన్యువల్ కార్లపై మొగ్గు చూపడానికి ధర ప్రధాన కారణమని చెబుతున్నారు నిపుణులు. AMT కార్లతో పోల్చితే మాన్యువల్ కార్ల ధర చాలా తక్కువగా ఉంటుంది. స్పిన్నీ నివేదిక ప్రకారం.. మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్ కంటే ఎంట్రీ లెవల్ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్ వేరియంట్ కారు ధర సుమారు రూ. 80,000 ఎక్కువ. కొనుగోలుదారు మాన్యువల్ వేరియంట్ కంటే AMT వేరియంట్ కారు కోసం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంటోంది.

బీమా ఖర్చులు : ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సాంకేతికత కారణంగా కారు అధిక ధర.. కొనుగోలుదారు ఇన్సురెన్స్ ఖర్చులను పెంచుతుంది. దాంతో వాహనం మరింత ఖరీదైనదిగా మారుతుంది. ఈ వ్యత్యాసం ఎంట్రీ-లెవల్ వాహనాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా కొనుగోలుదారులకు గణనీయమైన కొనుగోలు ఖర్చులు ఏర్పడతాయి. ఈ కారణంగా చాలా మంది వినియోగదారులు స్టిక్కర్ ధర, బీమా ఖర్చులపై డబ్బు ఆదా చేసేందుకు మాన్యువల్ వేరియంట్‌లను ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

మెయింటెనెన్స్ ఖర్చులు : ఎక్కువ మంది మాన్యువల్ కార్ల వైపు ఇంట్రెస్ట్ చూపించడానికి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఒక కారణమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ కార్ల నిర్వహణ మాన్యువల్ గేర్‌ బాక్స్ వాహనాల కంటే ఖరీదైనది. అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ల కంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు చాలా క్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా యజమాని నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. అదే విధంగా ఏఎమ్​టీ కార్లతో పోల్చితే మాన్యువల్ కార్లలో రెగ్యులర్ ఆయిల్ మార్చడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే.

కారు గేర్లు ఎలా వేస్తున్నారు? - సరిగ్గా వేయకపోతే "బాక్స్‌ బద్ధలైపోద్ది"!

విశ్వసనీయత : మాన్యువల్ గేర్‌బాక్స్ కంటే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తక్కువ విశ్వసనీయత కలిగి ఉండడం. ఇది కూడా ఇండియాలో ఎక్కువ మంది మాన్యువల్ కార్లను తీసుకోవడాని మరొక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. అలాగే మాన్యువల్ గేర్ బాక్స్ సాంకేతికంగా అభివృద్ధి చెందింది. ఏఎమ్​టీ వేరియంట్ కంటే ఎక్కువ కాలం నుంచి అమలులో ఉంది.

గేర్ బాక్స్ ప్రాబ్లమ్స్​ : మాన్యువల్ కార్లలో గేర్ బాక్స్ సిస్టమ్ కంటే ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ కారులో గేర్ బాక్స్ సిస్టమ్ క్లిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఏఎమ్​టీ కారులో ఏదైనా గేర్‌బాక్స్ సమస్య ఏర్పడినప్పుడు సాంకేతిక నిపుణుడిని కనుగొనడం చాలా కష్టం. అదే మాన్యువల్ గేర్‌బాక్స్ కోసం మెకానిక్‌ని కనుగొనడం సులభం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి మాన్యువల్ కార్లు అందుబాటులో ఉండడం వల్ల దాదాపు ప్రతి మెకానిక్ ఈ కార్ల గేర్ బాక్స్ గురించి కనీసం పరిజ్ఞానం కలిగి ఉంటాడు. దాంతో ఏదైనా రిపేర్ వచ్చినా సులభంగా అయిపోతుంది.

వేడెక్కడం, జెర్కీ రైడ్‌లు : రద్దీగా ఉండే ట్రాఫిక్ పరిస్థితుల్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని నడిపినప్పుడు ట్రాన్స్‌మిషన్ వేడెక్కడం జరుగుతుంది. డ్రైవ్ మోడ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్ బ్రేక్‌పై తన పాదాలను ఉంచడం ద్వారా వేగాన్ని తగ్గించవలసి ఉంటుంది. అదే.. మాన్యువల్ గేర్‌బాక్స్​ సిస్టమ్​ ఈ సమస్యల ద్వారా ప్రభావితం కాదు. ఇక చివరగా చాలా మంది కారు యజమానులు మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఉన్న కార్లను ఇష్టపడడానికి మరొక కారణం ఏంటంటే.. వాహనంపై డ్రైవర్‌కు డ్రైవింగ్ అనుభవంపై ఎక్కువ నియంత్రణను అందిస్తాయి. ఇన్నీ కారణాల దృష్ట్యా ఇండియాలో కార్​ లవర్స్​ ఆటోమేటిక్స్ కంటే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్​ వాటిని ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

అలర్ట్‌ : కారు టైర్లు ఎందుకు పేలుతాయి? - ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.