ETV Bharat / business

మీ హెల్త్ ఇన్సూరెన్స్​ 'క్లెయిమ్' రిజెక్ట్​ అయ్యిందా? సింపుల్​గా కంప్లైంట్​ చేయండిలా! - health insurance claim rules

what to do if Health Insurance Claim is Rejected : మీరు హెల్త్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా? ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

reasons for Health Insurance Claim Rejection
what to do if Health Insurance Claim is Rejected
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 1:56 PM IST

what to do if Health Insurance Claim is Rejected : ప్రస్తుత కాలంలో వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. కనుక పెరిగిన వైద్య ఖర్చులను ఎదుర్కోవాలంటే హెల్త్​ ఇన్సూరెన్స్ తీసుకోవడం​ తప్పనిసరి. అందుకే చాలా మంది ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటున్నారు. అయినప్పటికీ వాటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల బీమాను క్లెయిమ్​ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా కొన్నిసార్లు బీమా తిరస్కరణకు కూడా గురవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం బీమా పాలసీలను అర్థం చేసుకోవడం కాస్త సులభతరమైంది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్​డీఏఐ) కాలనుగుణంగా పాలసీల నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేస్తూనే ఉంది. పాలసీదారులకు బీమా సమాచారం అర్థమయ్యేలా పత్రాలు ఇవ్వాలని సంస్థలకు సూచించింది. ఐఆర్​డీఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగానే బీమా కంపెనీలు ఆరోగ్య బీమాను జారీ చేస్తున్నాయి. అయితే చాలా మంది ఆంగ్లంలో ఉన్న బీమా పాలసీ నిబంధనలు చదివి, అర్థం చేసుకోలేరు. అందుకే ఇప్పుడు కొన్ని కీలకమైన ఆరోగ్య బీమా పాలసీ నిబంధనలు గురించి తెలుసుకుందాం.

సరైన ఆరోగ్య సమాచారాన్ని ఇవ్వకపోవడం
ఆరోగ్య సమాచారం సరిగా లేకపోవడం వల్ల కూడా క్లెయిమ్​ రిజక్ట్​ అయ్యే అవకాశం ఉంటుంది. పాలసీని కొనుగోలు చేసే సమయంలో వ్యక్తులు తమ ఆరోగ్యం గురించి సరైన వివరాలను అందించాలి. ఇప్పటికే ఉన్న వ్యాధుల వివరాలు పూర్తిగా తెలియజేయాలి. తద్వారా బీమా సంస్థ దీన్ని అర్థం చేసుకొని, సరైన పాలసీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ముందస్తు వ్యాధుల గురించిన సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా బీమా సంస్థ ఇచ్చే సూచనలు చాలామంది పట్టించుకోరు. క్లెయిమ్​ సందర్భంలో ఇలాంటివి బయటపడినప్పుడు, పాలసీ రిజెక్ట్​ అయ్యేందుకు అవకాశం ఉంది. కొన్నిసార్లు బీమా సంస్థలు పాలసీని పూర్తిగా రద్దు చేసే అవకాశాలూ ఉంటాయి.

శాశ్వత మినహాయింపులు, నిరీక్షణ వ్యవధి
కొన్ని రకాల వ్యాధులకు బీమా పరిహారం ఇచ్చేందుకు నిర్ణీత కాలంపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఈ గడువులోగా క్లెయిమ్​ చేస్తే బీమా సంస్థ దాన్ని చెల్లించకపోవచ్చు. ఈ వేచి ఉండే వ్యవధి ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఉండొచ్చు. ఈ వ్యవధి ముగిసిన తర్వాతే వీటికి బీమా రక్షణ ప్రారంభమవుతుంది. కొన్ని వ్యాధులకు శాశ్వతంగా మినహాయింపు వర్తిస్తుందని పాలసీ ఇచ్చేటప్పుడే ఆయా బీమా సంస్థలు చెబుతాయి. అలాంటప్పుడు ఆ వ్యాధుల చికిత్సకు అయిన మొత్తానికి బీమా సంస్థల నుంచి పరిహారం రాదు.

సరైనా డాక్యుమెంట్లు సమర్పించకపోయినా
బీమా క్లెయిం చేసుకోవాలంటే సరైన డాక్యుమెంట్లు తప్పనిసరి. సరైన పత్రాలు లేకపోయినట్లయితే బీమా క్లెయిమ్​ తిరస్కరణకు గురవుతుంది. చాలా వరకు చెల్లించిన బిల్లులను రీయింబర్స్​మెంట్ చేయమని అడిగినప్పుడు ఇలా క్లెయిమ్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల పూర్తి పరిహారం పొందాలంటే, పాలసీదారులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సబ్​మిట్ చేయాలి. ఆసుపత్రి నుంచి బిల్లులు, పత్రాలు, మెడికల్ రిపోర్ట్​లు తదితర అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తీసుకోవాలి. మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ డాక్యుమెంట్లు అన్నీ తప్పనిసరి. అదనపు సమాచారం అవసరమైనప్పుడు బీమా సంస్థలు పాలసీదారులకు ఆ మేరకు సమాచారాన్ని ఇస్తాయి.

మోసపూరిత క్లెయిమ్స్​ విషయంలో
పాలసీదారులు లేదా ఆసుపత్రులు కొన్నిసార్లు అవాస్తవ సమాచారంతో క్లెయిమ్​లను దాఖలు చేయడం జరుగుతుంది. వాస్తవ ఖర్చులు గురించి చెప్పకుండా, ఉన్నవాటి కంటే కాస్త అధికంగా బిల్లులు వేయడం, ఔట్‌ పేషెంట్‌ చికిత్సలకు బదులు ఆసుపత్రిలో అడ్మిట్​ అవ్వడం, ముందస్తు వ్యాధులను దాచి పెట్టి, చికిత్స చేయించుకోవడం లాంటివి ఉంటాయి. వీటిని బీమా సంస్థ గుర్తిస్తే, పరిహారంలో కోత విధించడం లేదా పూర్తిగా రిజెక్ట్​ చేయొచ్చు. కొన్నిసార్లు ఆసుపత్రిలో చేరకుండానే నకిలీ బిల్లులు సృష్టించి, క్లెయిమ్​ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి వాటిని తీవ్ర మోసాలుగా పరిగణిస్తారు. ఇలాంటప్పుడు బీమా సంస్థ పాలసీని రద్దు చేయడంలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్​ను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో కచ్చితంగా పాలసీదారులకు తెలియజేయాలి. ఈ విషయంలో నియంత్రణ సంస్థ ఇచ్చిన ఆదేశాలను బీమా సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు

  1. ముందుగా బీమా పాలసీలో ఉన్న అన్ని షరతులను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. భవిష్యత్తులో క్లెయిమ్​ రిజెక్షన్​కు దారితీసే సందర్భాల గురించి తెలుసుకోవాలి. పాలసీ కొనుగోలు చేసేటప్పుడే అన్ని వివరాలను స్పష్టంగా తెలిసుకోవడం ఎంతో అవసరం.
  2. పాలసీదారులు తప్పనిసరిగా బీమా సంస్థ మార్గదర్శకాలను పాటించాలి. పాలసీ పత్రంలో పేర్కొన్న శాశ్వత మినహాయింపులు, ఉప-పరిమితులను ప్రత్యేకంగా తెలుసుకోవడం ఉత్తమం. బీమా పరిధిలోకి వచ్చే నిర్ణీత వ్యాధులకు ఉన్న తప్పనిసరి నిరీక్షణ వ్యవధిని చూసుకోవాలి. వీలైనంత వరకూ తక్కువ నిరీక్షణ వ్యవధి ఉన్న పాలసీలను ఎంచుకునేందుకు ప్రయత్నించడం మంచిది.
  3. సాధ్యమైనంత వరకూ మీరు పాలసీ తీసుకున్న బీమా సంస్థతో ఒప్పందం ఉన్న ఆసుపత్రిలోనే చేరి, చికిత్స చేయించుకోవాలి. దీనివల్ల మీరు నగదు రహిత చికిత్సను అందుకునే వీలుంటుంది. బీమా సంస్థలు సాధారణంగా అన్ని ప్రముఖ ఆసుపత్రులతో కలిసి పనిచేస్తుంటాయి. కనుక, మీకు ఇబ్బందేమీ ఉండదు. కొన్నిసందర్భాల్లో మీరు చికిత్స కోసం వెళ్లిన ఆసుపత్రిని బీమా సంస్థ బ్లాక్​లిస్ట్​లో పెట్టవచ్చు. ఇలాంటప్పుడు మీకు పరిహారం అందించదు. కనుక, ముందుగానే ఈ వివరాలను తెలుసుకోవాలి. దీని కోసం బీమా సంస్థల వెబ్‌సైట్లను అప్పుడప్పుడు పరిశీలిస్తుండాలి.
  4. ఎలాంటి సందేహాలున్నా బీమా సంస్థ హెల్ప్​లైన్ సెంటర్​ను సంప్రదించి, నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం బీమా సంస్థలు పాలసీదారులకు ఆసుపత్రులను ఎంపికలో, ఇతర అంశాల్లో సహాయం చేస్తున్నాయి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు.
  5. ఆరోగ్య బీమాను క్లెయిమ్​ చేసేటప్పుడు వాస్తవమైన చెల్లింపులనే బీమా సంస్థకు చూపించాలి. అధిక మొత్తానికి బిల్లులు వేసినట్లయితే బీమా సంస్థ వాటిని చెల్లించకపోవచ్చు. అలాంటప్పుడు పాలసీదారులే ఆ మొత్తాన్ని భరించాల్సి వస్తుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఫిర్యాదు చేయవచ్చు!
ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్​లను తిరస్కరించి, పరిహారం అందించడానికి నిరాకరించినప్పుడు, పాలసీదారులు వివిధ మార్గాల్లో ఫిర్యాదులు చేయవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీమా భరోసా వ్యవస్థ
బీమా క్లెయిమ్​లకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి రెగ్యులేటరీ అండ్​ డెవలప్​మెంట్​ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఉంది. దీనినే 'బీమా భరోసా సిస్టమ్' అని కూడా అంటారు. దీంట్లో మీరు ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలా అంటే..

  1. Complaints@irdai.gov.in అనే మెయిల్ అడ్రస్​కు మీ ఫిర్యాదును పంపించవచ్చు.
  2. టోల్​ ఫ్రీ నంబర్స్ :​ 155255 లేదా 1800 4254 732 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

ఒక్క సంవత్సరంలోపు మాత్రమే!
ఇన్సూరెన్స్ కంపెనీ మీ బీమా క్లెయిమ్​ను తిరస్కరించిన తేదీ నుంచి ఒక సంవత్సరంలోపు మాత్రమే 'ఇన్సూరెన్స్ అంబుడ్స్​మెన్'​ వద్ద ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలా అంటే?

  1. ఆన్​లైన్​లో https://www.cioins.co.in/ వెబ్​సైట్ ఓపెన్ చేసి, అందులో మీ కంప్లైంట్​ను నమోదు చేయవచ్చు. లేదా
  2. మీకు దగ్గర్లో ఉన్న అంబుడ్స్​మెన్​ కార్యాలయానికి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.

కన్జూమర్​ కోర్టులోనూ ఫిర్యాదు చేయవచ్చు!
బీమా కంపెనీలు మీకు పరిహారం అందించడానికి నిరాకరిస్తే, కన్జూమర్ కోర్టులో కూడా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం మీరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్​లో కంప్లైంట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి మీరు ఆన్​లైన్​, ఆఫ్​లైన్ రెండు విధానాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేటప్పుడు కంప్లైంట్​ లెటర్​తోపాటు, అవసరమైన అన్ని డాక్యుమెంట్స్​ను అందించాల్సి ఉంటుంది. అయితే కన్జూమర్ ఫోరమ్​ మీ నుంచి రూ.100 నుంచి రూ.5000 వరకు ఫీజు వసూలు చేసే అవకాశం ఉంటుంది.

సేవింగ్స్​ అకౌంట్​ ఉంటే రోజుకు రూ.500- ఎందుకోసమో తెలుసా?

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గుడ్​న్యూస్- ఇకపై అన్ని ఆస్పత్రుల్లో క్యాష్​లెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.