ETV Bharat / business

ఇంపార్టెంట్ : పెళ్లికి ముందే మీ పార్ట్​నర్​తో ఇలా చేయాలి - అప్పుడే "హ్యాపీ మ్యారీడ్ లైఫ్"! - Wife and Husband Understanding

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 5:21 PM IST

Wife and Husband Mutual Understanding : పెళ్లి చేసుకోబోయే ఇద్దరికీ ఒకరికొకరు నచ్చడమేకాదు.. అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం అవసరం. అన్ని అంశాల్లోనూ సాధ్యం కాకపోతే.. కొన్ని ప్రధానమైన విషయాల్లోనైనా ఇద్దరూ ఒకేమాట మీద ఉండాలి. అప్పుడే పెళ్లి తర్వాత అభిప్రాయభేదాలు రాకుండా సంతోషంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు. అవేంటో మీకు తెలుసా?

Wife and Husband Mutual Understanding
Wife and Husband Mutual Understanding (ETV Bharat)

Wife and Husband Financial Understanding : ఈ రోజుల్లో చాలా పెళ్లిళ్లు మధ్యలోనే పెటాకులు కావడానికి ప్రధాన కారణం.. ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉండడమే అంటున్నారు నిపుణులు. ఇందులోనూ ఆర్థిక విషయాలు ముందు వరసలో ఉంటున్నాయని చెబుతున్నారు. అందుకే.. పెళ్లికి ముందే భవిష్యత్​ ఆర్థిక ప్రణాళికలపై ఇద్దరూ మాట్లాడుకుంటే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

ఎంత సంపాదిస్తున్నా చాలట్లేదా? ఈ టిప్స్​తో మినిమమ్ ఉంటది!

దీర్ఘకాలిక ప్రణాళికలు ఏమిటి?: దీర్ఘకాలిక ప్రణాళికలు అంటే.. ఇల్లు కొనడం, పెట్టుబడులు పెట్టడం లాంటివే కాకుండా.. కుటుంబ ప్రణాళికల గురించి కూడా చర్చించుకోవాలి. అంటే.. పెళ్లి తర్వాత పిల్లలు వెంటనే కావాలా..? వద్దా..? వారి ఫ్యూచర్​ కోసం ఏమైనా ప్లాన్ చేస్తారా? భార్యాభర్తల ఉద్యోగాలు సంగతేంటి? పొదుపు ఎలా చేద్దాం? అనే విషయాలు ముందుగానే మాట్లాడుకొంటే ఓ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే.. పిల్లలు పుట్టిన తర్వాత పెంపకం నుంచి గ్రాడ్యుయేషన్​ అయ్యేవరకు చాలా డబ్బు అవసరమవుతుంది. లైఫ్​లో సెటిల్​ అవ్వకుండానే పిల్లలు కావాలనుకుంటే.. వారి భవిష్యత్తును అంధకారంలో పడేసినట్లే అవుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా ఆర్థిక విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? భార్యాభర్తలు పాటించాల్సిన టాప్​-9 ఫైనాన్సియల్​ టిప్స్ ఇవే!

బడ్జెట్​: చాలా మంది భార్యాభర్తలు ఎవరి సంపాదన వారిదే అన్నట్టుగా ఉంటారు. ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరి సంపాదన ఒక్కదగ్గర పెట్టి ఖర్చు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల మేము వేర్వేరు కాదు.. ఇద్దరమూ ఒకటే అన్న భావన మరింతగా బలపడుతుందని సూచిస్తున్నారు. ఇది లేకపోతే.. ఎవరి డబ్బులు వారివే అన్నట్టుగా ఉంటే.. అపార్థాలు, దాపరికాలు పెరిగిపోయి చిక్కులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే.. సంపాదనతో సహా ఏ విషయంలోనైనా భార్యాభర్తలు ఒక్కటిగానే ముందుకు సాగాలని, ఒకే మాట మీద ఉండాలని సూచిస్తున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడే ఈ అవగాహన ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసి ఎదుర్కొంటారని, తద్వారా.. వారిమధ్య ప్రేమ మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

ఈ కొత్త ఏడాదిలో మీ ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? ఈ టాప్​-25 టిప్స్​ మీ కోసమే!

అప్పులు: అప్పుల విషయం కూడా ఇద్దరికీ తెలిసే జరగాలని సూచిస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు అప్పులు చేయకూడదని సూచిస్తున్నారు. రహస్యంగా అప్పులు చేస్తే.. ఏదో ఒకరోజు భాగస్వామికి తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు తనను మోసం చేసినట్టుగా మీ పార్ట్​నర్​ భావించే ప్రమాదం ఉంటుంది. ఇదే జరిగితే ఏకంగా మీ సంసారమే సుడిగుండంలో చిక్కుకుపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే.. అప్పులు చేయాల్సి వస్తే, ఇద్దరూ ఒక ప్రణాళిక ప్రకారం అప్పు చేయాలని సూచిస్తున్నారు.

ఎమర్జెన్సీ ఫండ్స్​: అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిల్లోంచి బయటపడేందుకు కొంత ఎమర్జెన్సీ ఫండ్ మెయింటెయిన్ చేయాలని సూచిస్తున్నారు. ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు చాలా మంది సహనం కోల్పోయి.. ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటారు. ఈ పరిస్థితి కచ్చితంగా కాపురంలో కలతలు తెస్తుంది. అందుకే.. ఇలా జరగకుండా ఇద్దరూ కలిసి ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ విషయాలన్నిటి గురించి పెళ్లికి ముందుగానే ఇద్దరూ మాట్లాడుకుంటే.. భేదాభిప్రాయాలు ఏవైనా ఉన్నా ముందే క్లియర్​ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఒకవేళ ఇద్దరి ఆశలు, ఆలోచనలు, అభిప్రాయాలు పూర్తి భిన్నంగా ఉంటే పెళ్లి చేసుకోవాలా? లేదా? అనే విషయంపైనా క్లారిటీ వస్తుందని అంటున్నారు. లేకపోతే.. పెళ్లి తర్వాత ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అప్పు లేకుండా పిల్లల పెళ్లి చేయాలా? - ఈ సూపర్ ఫైనాన్షియల్ టిప్స్ మీకోసమే!

కొత్తగా పెళ్లైందా? మీరు తెలుసుకోవాల్సిన ఆర్థిక పాఠాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.