ETV Bharat / business

మీ పెట్టుబడులకు 'భరోసా+ బీమా' రెండూ కావాలా? 'యులిప్‌' పాలసీలే బెస్ట్ ఛాయిస్​! - ULIP Plan Benefits

What Are ULIP Plans : బీమా, పెట్టుబడి కలిసి ఉండే యూనిట్‌ లింక్డ్​ బీమా పాలసీ(యులిప్‌)లు కాస్త భిన్నమైన పథకాలనే చెప్పాలి. ఇప్పటి వరకూ వీటిని పెట్టుబడి పథకాలుగానే ఇన్సూరెన్స్ కంపెనీలు చెబుతూ వచ్చాయి. కానీ ఇకపై అలా ప్రచారం చేయకూడదని ఐఆర్​డీఏఐ స్పష్టం చేసింది. ఇంతకీ ఈ యులిప్ పథకాలు ఎంచుకోవడం మంచిదేనా? పూర్తి వివరాలు మీ కోసం.

ULIP Plan benefits
What Are ULIP Plans? (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 1:02 PM IST

What Are ULIP Plans : పెట్టుబడులకు భరోసా ఉంటూ, దీర్ఘకాలంలో మంచి ఆర్థిక నిధిని సమకూర్చుకునేందుకు యూలిప్ పథకాలు అనువుగా ఉంటాయి. అయితే బీమా, పెట్టుబడి కలిసి ఉండే యూనిట్‌ లింక్డ్​ బీమా పాలసీ(యులిప్‌)లు కాస్త భిన్నమైన పథకాలనే చెప్పాలి. ఇప్పటి వరకూ వీటిని ఇన్సూరెన్స్​ కంపెనీలు పెట్టుబడి పథకాలుగానే చెబుతూ వచ్చాయి. అయితే భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) వీటిని పెట్టుబడి పథకాలుగా ప్రచారం చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఇప్పుడు ఇవి మళ్లీ చర్చల్లోకి వచ్చాయి. ఇంతకీ ఈ యూలిప్​ పథకాలు ఎంచుకోవడం మంచిదేనా?

ఇవి బీమా పథకాలు మాత్రమే!
చాలా మంది యులిప్‌ ప్లాన్​లు అంటే మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలే అని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ పాలసీలకు చెల్లించిన ప్రీమియంలో మోర్టాలిటీ ఛార్జీలను మినహాయించి, మిగతా మొత్తాన్ని ఫండ్లలో మదుపు చేస్తుంటాయి. అందుకే వీటిని ఫండ్లతో పోలుస్తుంటారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం, బీమా సంస్థలు ఈ యులిప్‌లను బీమా పాలసీలుగానే ప్రచారం చేయాలి. దీని వల్ల పాలసీదారులకు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్​గా చెప్పాలంటే, పాలసీదారులు యులిప్​లను పెట్టుబడిగా కాకుండా, బీమా పథకాలుగా మాత్రమే చూడాలని ఐఆర్​డీఏఐ సూచించింది.

లాకిన్‌ పీరియడ్​!
యులిప్‌లు తీసుకున్నప్పుడు వాటిల్లో కనీసం 5 ఏళ్లపాటు కొనసాగాలి. కనుక, దీర్ఘకాలిక లక్ష్యాలున్నవారు వీటిని ఎంచుకోవడం మంచిదే. వీటికి చెల్లించిన ప్రీమియం ఏడాదికి రూ.2.5 లక్షల లోపు ఉంటే, వ్యవధి తీరిన తర్వాత వచ్చిన మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. పిల్లల చదువులు, వారి వివాహం లాంటి ఖర్చులకు ఉపయోగపడేలా ఈ యులిప్​లను ఎంచుకోవచ్చు. ఇందులో ప్రీమియం వైవర్‌ రైడర్‌ కూడా ఉంటుంది. పాలసీదారుడికి ఏదైనా జరిగితే, పాలసీ వ్యవధి తీరే వరకూ అది కొనసాగేందుకు ఇది కచ్చితంగా తోడ్పడుతుంది. కనుక, ఆర్థిక రక్షణ, లక్ష్యాల సాధన కోసం యులిప్​లను ఎంచుకోవచ్చు.

వెంటనే నగదుగా మార్చలేం!
యులిప్‌లను దీర్ఘకాలిక ఆర్థిక అవసరాల కోసమే ఎంచుకోవాలి. ఎందుకంటే, అత్యవసరాల్లో యులిప్​లో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. అంతేకాదు యులిప్‌లు విధించే మోర్టాలిటీ ఛార్జీలు, టర్మ్‌ బీమా ప్రీమియం కన్నా అధికంగానే ఉండే అవకాశం ఉంది.

రెండు రకాలుగా
మదుపరులు యులిప్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. పాలసీదారుడికి ఏదైనా జరిగితే, నామినీకి పరిహారం ఎలా ఇస్తారన్నది చూసుకోవాలి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు - పాలసీ విలువ, పెట్టుబడి విలువల్లో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని మాత్రమే అందిస్తాయి. కొన్ని రకాల యులిప్​లు - పాలసీ మొత్తంతోపాటు, యూనిట్ల విలువనూ కలిపి చెల్లిస్తాయి. మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాలను బట్టి, ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలన్నది మీరే నిర్ణయించుకోవాలి.

యులిప్​ పాలసీలను ఎవరు తీసుకోవచ్చు?

  • ఆర్థిక క్రమశిక్షణ కావాలని కోరుకునేవారు
  • క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించేవారు
  • మ్యూచువల్‌ ఫండ్లలో వచ్చే హెచ్చుతగ్గులకు ఆందోళన చెందేవారు
  • 10 ఏళ్లకు మించి పెట్టుబడులు కొనసాగించాలని అనుకునేవారు
  • ప్రీమియం వైవర్‌ ప్రయోజనం పొందాలనుకునేవారు.

అయితే అవసరమైనప్పుడు వెంటనే పెట్టుబడులు ఉపసంహరించుకోవాలనే ఆలోచన ఉన్నవారు, క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించడం సాధ్యం కాని వారు యులిప్​ పాలసీలను తీసుకోకపోవడమే మంచిది.

అంబానీ మాస్టర్ ప్లాన్​ - త్వరలోనే రూ.55వేల కోట్ల జియో ఐపీఓ! - Reliance Jio IPO

మనవళ్లతో ముకేశ్‌-నీతా అంబానీ కారు షికారు - వీడియో చూశారా? - Anant Ambani Radhika Wedding

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.