ETV Bharat / business

మీరు SBI ఖాతాదారులా? ఈ సర్వీసులు గురించి తెలుసుకోవడం మస్ట్​! - SBI BALANCE CHECK

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 9:36 AM IST

Ways To Check Your SBI Account Balance : మీరు ఎస్​బీఐ ఖాతాదారులా? అయితే ఇది మీ కోసమే. ఎస్​బీఐ తమ ఖాతాదారులకు అందిస్తున్న ఆన్​లైన్, ఆఫ్​లైన్​​ సేవల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

SBI Balance Check By Net Banking
Ways To Check Your SBI Account Balance (ANI)

Ways To Check Your SBI Account Balance : స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) తమ ఖాతాదారులకు కావాల్సిన సమాచారాన్ని, సేవల్ని వేగంగా అందించేందుకు పలు ఆన్​లైన్​ సేవలను అందిస్తోంది. వీటిని ఉపయోగించుకుంటే, క్యూలైన్లలో గంటల తరబటి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఒకప్పుడు మన అకౌంట్​లో ఎంత సొమ్ము ఉందో తెలుసుకోవడానికి కూడా క్యూలైన్లో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్​లైన్​లో క్షణాల్లోనే మనకు కావాల్సిన సమాచారం అంతా తెలుసుకోవచ్చు.

ఖాతాదారులు ప్రధానంగా అకౌంట్​ బ్యాలెన్స్​ గురించి చెక్ చేసుకుంటా ఉంటారు. అందుకే ఎస్​బీఐ తమ ఖాతాదారులు అకౌంట్​లోని బ్యాలెన్స్​ తెలుసుకునేందుకు పలు అవకాశాలు కల్పిస్తోంది. ఎస్​ఎంఎస్​, ఆన్‌లైన్‌, వాట్సప్‌ ఇలా వివిధ మాధ్యమాల ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్​ తెలుసుకోవచ్చు.

మిస్డ్‌ కాల్‌ బ్యాంకింగ్‌?
మిస్డ్‌ కాల్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌ ద్వారా ఎస్‌బీఐ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. అయితే, ఈ సర్వీస్​ పొందడానికి ముందే రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా మీ ఫోన్‌లోని మెసేజ్‌ యాప్‌ తెరవాలి.
  • REG ఖాతా నంబర్‌ టైప్‌ చేయాలి.
  • 09223488888కు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి సందేశం పంపాలి. అంతే సింపుల్​!
  • మీ ఎస్‌బీఐ మిస్డ్‌ కాల్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌ యాక్టివేట్‌ అయిపోతుంది.
  • ఇప్పుడు బ్యాంకు మీకు రెండు ఆప్షన్లను ఇస్తుంది.
  • బ్యాలెన్స్‌ చెక్ చేసుకునేందుకు, మినీ స్టేట్‌మెంట్‌ పొందేందుకు రెండు వేర్వేరు టోల్‌ఫ్రీ నంబర్లను అందిస్తుంది.

ఎస్‌బీఐ బ్యాలెన్స్‌ తెలుసుకోవడానికి - 9223766666
9223866666 నంబర్​కు కాల్​ చేస్తే ఎస్‌బీఐ ఖాతా ద్వారా చేసిన చివరి 5 లావాదేవీల సమాచారం తెలుస్తుంది.

వాట్సప్‌ ద్వారా
వాట్సాప్​ బ్యాంకింగ్​ కింద ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల సేవలను, వివరాలను అందిస్తోంది. ఈ మాధ్యమం ద్వారా మీ ఖాతాలోని బ్యాలెన్స్‌ కూడా తెలుసుకోవచ్చు.

  • +919022690226 నంబర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలి.
  • వాట్సప్‌లో పై నంబర్‌కు 'Hi' అని మెసేజ్‌ చేయాలి.
  • కనిపించే వివిధ రకాల ఆప్షన్లలో గెట్‌ బ్యాలెన్స్‌పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే మీకు కావాల్సిన సమాచారం అంతా మీ ముందుంటుంది.

ఎస్‌బీఐ వాట్సప్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ ద్వారా మినీ స్టేట్‌మెంట్స్‌, అకౌంట్‌ స్టేట్‌మెంట్స్‌, పెన్షన్‌ స్లిప్స్‌, లోన్లు, ఎన్‌ఆర్‌ఐ ఖాతాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా అనేక బ్యాంకింగ్ సేవలు కూడా పొందవచ్చు.

ఎస్​ఎంఎస్​తో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు!

  • ముందుగా మీ ఫోన్​లోని మెసేజ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
  • BAL అని టైప్‌ చేయాలి.
  • రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి +919223766666కు మెసేజ్‌ పంపాలి.
  • వెంటనే మీ ఎస్‌బీఐ ఖాతాలోని బ్యాలెన్స్‌ వివరాలు వస్తాయి.
  • MSTMT అని పంపి కూడా మినీ స్టేట్‌మెంట్‌ను పొందవచ్చు.

ఎస్​బీఐ యోనో యాప్‌
ఎస్‌బీఐ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి యోనో యాప్ వాడుకోవచ్చు. ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్లలో లభిస్తుంది. దీని ద్వారా చాలా రకాల బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. దీని ద్వారా బ్యాలెన్స్‌ ఎలా చూడాలో చూద్దాం.

  • ముందుగా మీ మొబైల్‌లో యోనో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేయాలి.
  • యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి.
  • పిన్‌ లేదా బయోమెట్రిక్‌ ద్వారా ధ్రువీకరణ చేసుకోవాలి.
  • తరువాత హోమ్‌ స్క్రీన్‌పై 'వ్యూ బ్యాలెన్స్‌' కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్‌ చేస్తే మీ అకౌంట్​లో ఎంత సొమ్ము ఉందో తెలుస్తుంది.

నెట్‌ బ్యాంకింగ్‌

  • డెస్క్‌టాప్‌ లేదా మొబైల్‌ బ్రౌజర్‌లో https://www.onlinesbi.sbi/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.
  • పర్సనల్‌ బ్యాంకింగ్‌లోకి వెళ్లి లాగిన్‌పై క్లిక్‌ చేయాలి.
  • మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి లాగిన్‌ కావాలి.
  • మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్‌ చేయాలి.
  • ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ విండో ఓపెన్‌ అవుతుంది.
  • ట్రాన్సాక్షన్స్‌ అకౌంట్స్‌ సెక్షన్​లోని అకౌంట్‌ సమ్మరీ సెక్షన్‌లోకి వెళ్లాలి. క్లిక్‌ హియర్‌పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే మీ ఎస్‌బీఐ ఖాతాలోని బ్యాలెన్స్‌ కనిపిస్తుంది.

పని ఒత్తిడి విపరీతంగా ఉందా? 8-8-8 రూల్​తో వర్క్​ లైఫ్​ను​ బ్యాలెన్స్​ చేసుకోండిలా! - How To Implement The 8 8 8 Rule

ప్రైవేట్​ జాబ్ చేస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే మీకు 'గ్రాట్యుటీ' ఎంత వస్తుందో తెలుసా? - Gratuity Rules

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.