ETV Bharat / business

స్టార్టప్ ప్రారంభించాలా? ఆన్​లైన్​లోనే ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోండిలా! - Startup Registration Process - STARTUP REGISTRATION PROCESS

Startup Registration Process In India : మీరు స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. ఇండియాలో స్టార్టప్​లను ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఈ ఆర్టికల్​ ద్వారా తెలుసుకుందాం.

Want to register Startups in India
How to register Startups in India (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 12:46 PM IST

Startup Registration Process In India : భారతదేశంలో స్టార్టప్​లకు మంచి అనుకూల వాతావరణం ఉంది. అందుకే స్టార్టప్​లను నెలకొల్పే యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. మరి మీరు కూడా మంచి స్టార్టప్ ప్రారంభిద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. భారతదేశంలో స్టార్టప్​లను ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

స్టార్టప్​ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే!

  1. మీ బిజినెస్​ను ఇన్​కార్పొరేట్ చేయండి
    ముందుగా మీ స్టార్టప్​ను ఎలా మొదలు పెట్టాలో నిర్ణయించుకోవాలి. అంటే​ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ/ పార్ట్​నర్​షిప్​ ఫర్మ్‌ (భాగస్వామ్య సంస్థ)/ లిమిటెడ్‌ లయబులిటీ పార్ట్​నర్​షిప్​ ఆప్షన్​లలో ఒకదానిగా మీ స్టార్టప్​ను ప్రారంభించాల్సి ఉంటుంది. మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ కోసం మీ ప్రాంతంలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ)కి అప్లికేషన్​ను సమర్పించాలి. అందుకు అవసరమైన పత్రాలు, రుసుములను చెల్లించాలి.
  2. స్టార్టప్ ఇండియా వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్
    ఆ తర్వాత మీ బిజినెస్​ను స్టార్టప్​గా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ప్రక్రియను ఆన్​లైన్​లో ఈజీగా చేసుకోవచ్చు. స్టార్టప్ ఇండియా వెబ్​సైట్​ను ఓపెన్ చేసి, రిజిస్టర్ బటన్​పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, పాస్​వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్ బటన్​పై క్లిక్ చేయాలి. ఆపై మీ ఈ-మెయిల్​కు ఓ ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. తరువాత యూజర్ టైప్, పేరు, స్టేజ్ ఆఫ్ స్టార్టప్ వంటి వివరాలను నింపి సబ్మిట్ చేయాలి. ఈ వివరాలను నింపిన తర్వాత స్టార్టప్ ఇండియా వైబ్​సైట్​లో మీ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ఆపై ఇంక్యుబేటర్/మెంటార్​షిప్ ప్రోగ్రామ్​ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే లెర్నింగ్ రిసోర్సెస్, ఫండింగ్ ఆప్షన్లు, ప్రభుత్వ పథకాలు వంటివి తెలుసుకోవచ్చు.
  3. డీపీఐఐటీ రికగ్నిషన్​
    ఆ తర్వాత 'స్టార్టప్ డిపార్ట్​మెంట్​ ఫర్​ ప్రమోషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్'​ (డీపీఐఐటీ) గుర్తింపును పొందాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు వల్ల మీకు మేథో సంపత్తి సేవలు, వనరులు లభిస్తాయి. పబ్లిక్ ప్రొక్యూర్​మెంట్ నిబంధనల్లోనూ సడలింపులు వర్తిస్తాయి. కార్మిక, పర్యావరణ చట్టాల ప్రకారం, స్వీయ ధ్రువీకరణ చేసుకోవచ్చు. కంపెనీ వైండింగ్​కు, ఫండ్ ఆఫ్ ఫండ్స్​కు యాక్సెస్ లభిస్తుంది. అంతేకాదు అనేక రకాల పన్ను మినహాయింపులు లభిస్తాయి. డీపీఐఐటీ రికగ్నిషన్ పొందడానికి స్టార్టప్ ఇండియా వెబ్​సైట్​లో మీ రిజిస్టర్డ్ ప్రొఫైల్ వివరాలతో లాగిన్ కావాలి. రికగ్నిషన్ ట్యాబ్ కింద ఉన్న 'అప్లై ఫర్ డీపీఐఐటీ రికగ్నిషన్' ఆప్షన్​పై క్లిక్ చేయాలి. తర్వాత పేజీలో ఉన్న 'అప్లై నౌ'పై క్లిక్ చేయాలి. అప్పుడు 'నేషనల్ సింగిల్ విండో సిస్టమ్' (NSWS) వెబ్​సైట్‌ ఓపెన్ అవుతుంది. అందులో కంపెనీలు, ఎల్ఎల్​పీలు రిజిస్టర్ చేసుకోవాలి. డీపీఐఐటీ గుర్తింపు పొందడానికి 'రిజిస్ట్రేషన్ యాజ్ ఏ స్టార్టప్' ఫారమ్​ను యాడ్ చేయాలి. తర్వాత 'స్టార్టప్ రికగ్నిషన్ ఫారమ్' నింపాలి.
  4. రికగ్నిషన్ అప్లికేషన్​
    స్టార్టప్ రికగ్నిషన్ ఫారమ్​లో మీ స్టార్టప్​ వివరాలు, కార్యాలయం పూర్తి చిరునామా, అధీకృత ప్రతినిధి వివరాలు, డైరెక్టర్లు/భాగస్వాముల వివరాలు, మీ వ్యాపార కార్యక్రమాల​ వివరాలు నమోదు చేయాలి. అలాగే సెల్ఫ్ సర్టిఫికేషన్​ కూడా ఇవ్వాలి. ఫారమ్ కుడి వైపున ఉన్న ప్లస్ గుర్తుపై క్లిక్ చేసి అందులోని అన్ని సెక్షన్లను ఎంటర్ చేయాలి. టెర్మ్స్ అండ్ కండిషన్స్​ను అంగీకరించి, సబ్మిట్ బటన్​పై క్లిక్ చేయాలి.
  5. ఈ పత్రాలు ఉండాలి
    మీ స్టార్టప్​ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫండింగ్ ప్రూఫ్​, పేటెంట్, ట్రేడ్​మార్క్ వివరాలు, అవార్డుల జాబితా, గుర్తింపు సర్టిఫికెట్లు, పాన్ నంబర్ వంటివి స్టార్టప్ రిజిస్ట్రేషన్ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే మీ స్టార్టప్​నకు సంబంధించిన పిచ్​డెక్​, వీడియో, వెబ్​సైట్​ లింక్​లను కూడా ఇవ్వాలి. అంతే సింపుల్​!
  6. గుర్తింపు సంఖ్య జారీ
    స్టార్టప్ దరఖాస్తు పూర్తయిన తర్వాత మీకు ఒక గుర్తింపు సంఖ్య (రికగ్నిషన్​ నంబర్​) వస్తుంది. సాధారణంగా మీరు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్న 2 రోజులలోపు మీ అన్ని పత్రాల పరిశీలన జరుగుతుంది. ఆ తర్వాత మీకు గుర్తింపు (రికగ్నిషన్​) సర్టిఫికెట్ జారీ అవుతుంది.
  7. పేటెంట్, ట్రేడ్​మార్క్ కోసం
    మీ ఆవిష్కరణకు పేటెంట్ రావాలన్నా, లేదా మీ బిజినెస్​కు ట్రేడ్​మార్క్ కావాలన్నా, ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఫెసిలిటేటర్ల జాబితాలోని ఎవరినైనా సులభంగా సంప్రదించవచ్చు. అయితే ఇందుకోసం మీరు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.

మీ క్రెడిట్ స్కోర్ పెరగాలా? ఈ అపోహలు అస్సలు పెట్టుకోవద్దు! - Tips To Increase Credit Score

రూ.2 లక్షల బడ్జెట్​లో మంచి స్కూటీ కొనాలా? టాప్-10 మోడల్స్ ఇవే! - Best Scooters Under 2 Lakh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.