ETV Bharat / business

తరచుగా సిమ్ కార్డ్​లు మారుస్తుంటారా? ఇకపై ఆ లిమిట్ దాటితే కొత్త SIM ఇవ్వరు తెలుసా? - SIM Card Limit On Aadhaar Card - SIM CARD LIMIT ON AADHAAR CARD

How Many SIM Cards Can Register On One Aadhaar Card : మీరు తరచూ కొత్త సిమ్ కార్డులు మారుస్తూ ఉంటారా? అయితే ఇది మీ కోసమే. మీ ఆధార్ కార్డ్​తో ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయవచ్చో మీకు తెలుసా?

How to check how many SIMs on Aadhar card
How Many SIM Cards are Issued on Your Aadhaar Card (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 2:58 PM IST

How Many SIM Cards Can Register On One Aadhaar Card : కొందరు వ్యక్తులు ఎప్పటికప్పుడు తమ ఫోన్​ నంబర్లు మార్చేస్తుంటారు. పాత నంబర్‌ పక్కన పడేసి, కొత్తది తీసుకుంటూ ఉంటారు. కానీ పాతవాటిని బ్లాక్‌ చేయకుండా అలానే ఉంచుతారు. మరి మీరు కూడా ఇలానే చేస్తుంటారా? అయితే జర జాగ్రత్త! ఇకపై కొత్త సిమ్ కార్డ్ కోసం అప్లై చేస్తే, మీ అభ్యర్థనను తిరస్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే సిమ్​ కార్డ్​ల జారీపై పరిమితి ఉంది.

ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చు?
భారత్​లో సిమ్​ కార్డుల జారీపై పరిమితి ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ పేరు మీద ఎన్ని సిమ్​ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలి. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఉచితంగా లభిస్తుండడం వల్ల చాలా మంది సిమ్ కార్డులను వాడేసి, వాటిని బ్లాక్​ చేయకుండా అలానే పక్కన పడేస్తుంటారు. ఒక్కోసారి ఇలాంటివి సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంటాయి.

మరికొన్ని సార్లు మనకు తెలియకుండానే మన పేరుపై ఇతరులు సిమ్​ కార్డులు తీసుకుంటూ ఉంటారు. మీ ఆధార్​ను దుర్వినియోగం చేసి ఈ తరహా మోసాలకు తెగబడుతుంటారు. సిమ్ స్వాప్​, మోసపూరిత సిమ్​ కార్డుల జారీ వల్ల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిమ్ కార్డుల జారీ నిబంధనల్ని డిపార్ట్​మెంట్ ఆఫ్​ టెలికమ్యునికేషన్స్​ (డాట్​) కఠినతరం చేసింది. దీని ప్రకారం, సామాన్యులు తమ ఆధార్ కార్డుపై గరిష్ఠంగా 9 సిమ్​ కార్డులు వరకు తీసుకోవచ్చు. ఇండియాలో సామాన్యులు బల్క్​గా సిమ్ కార్డులు తీసుకోవడంపై నిషేధం కూడా ఉంది.

మీ పేరుపై ఎన్ని సిమ్​ కార్డులు ఉన్నాయో తెలుసుకోండిలా!
డిపార్ట్​మెంట్​ ఆఫ్ టెలికమ్యునికేషన్స్​ (డాట్​) ఒక ఆధార్​ కార్డు పేరిట ఎన్ని సిమ్​ కార్డులు ఉన్నాయో తెలుసుకునేందుకు TAF-COP (టెలికాం అనలిటిక్స్ ఫర్స్​ ఫ్రాడ్​ మేనేజ్​మెంట్​ అండ్ కన్జూమర్ ప్రొటక్షన్​) అనే ప్లాట్​ఫామ్​ను తీసుకువచ్చింది. దీని సాయంతో మీ ఆధార్ కార్డ్​పై ఎన్ని సిమ్​ కార్డులు జారీ అయ్యాయో తెలుసుకోవచ్చు. అంతేకాదు మీ ఫోన్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా దాన్ని బ్లాక్​ చేసుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే?

  • ముందుగా మీరు Sanchar Saathi వెబ్​సైట్​లోకి లాగిన్ కావాలి.
  • Citizen Centric Services లోకి వెళ్లాలి.
  • Know your mobile connections పై క్లిక్ చేయాలి.
  • తరువాత మీ ఫోన్ నంబర్​, క్యాప్చా ఎంటర్ చేయాలి.
  • వెంటనే మీ మొబైల్​కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
  • వెంటనే యూజర్ పేరిట ఉన్న మొబైల్ నంబర్ల జాబితా మొత్తం కనిపిస్తుంది.
  • ఆ జాబితాలో ఉన్న ఫోన్ నంబర్లు మీవేనా? కాదా? అని చెక్ చేసుకోవాలి.
  • ఒక వేళ వాటిలో ఏదైనా మీది కాకపోతే, వెంటనే బ్లాక్ చేసేయాలి.
  • ఈ విధంగా మీవి కాని, మీరు ఇకపై వాడని నంబర్లను పూర్తి బ్లాక్ చేసుకోవాలి.

‘కాలర్‌ ఐడీ’పై ట్రయల్స్‌ మొదలు పెట్టిన టెలికాం కంపెనీలు
టెలికాం కంపెనీలు కాలర్‌ ఐడీకి (Caller ID) సంబంధించి ట్రయల్స్‌ను ప్రారంభించాయి. ఏదైనా నంబర్‌ నుంచి ఇన్‌కమింగ్‌ కాల్‌ వచ్చినప్పుడు, ఆ వ్యక్తి పేరు కనిపించేలా చేయడమే దీని ఉద్దేశం. వాస్తవానికి ఈ విషయంలో టెలికాం కంపెనీలు మొదటి నుంచి సుముఖంగా లేనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్​ల ఒత్తిడితో పరిమిత స్థాయిలో ప్రయోగాలకు సిద్ధమయ్యాయి.

ఇటీవల కాలంలో స్పామ్‌, మోసపూరిత కాల్స్‌ పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కాలింగ్‌ నేమ్‌ ప్రజంటేషన్‌ తీసుకురావాలని ట్రాయ్‌ ప్రతిపాదించింది. మొదట్లో దీనిని టెలికాం కంపెనీలు అన్నీ వ్యతిరేకించాయి. సాంకేతిక అంశాలను కారణంగా చూపే ప్రయత్నం చేశాయి. అయితే ప్రభుత్వం, ట్రాయ్‌ ఒత్తిడిల కారణంగా కాలర్‌ ఐడీ పనితీరుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సిద్ధమయ్యాయి. ప్రతిపాదిత సేవలు ఆచరణ సాధ్యమా, లేదా అనేది టెలికాం విభాగానికి ఆయా సంస్థలు తెలియజేయనున్నాయి. ప్రస్తుతానికి ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్​లు ఇదే తరహా సేవలు అందిస్తున్నప్పటికీ, పూర్తి స్థాయిలో టెలికాం కంపెనీలే తమ మొబైల్‌ డేటాలోని నంబర్లను చూపించడం ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్‌ భావిస్తున్నాయి.

రూ.5 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-6 మోడల్స్ ఇవే! - Best Cars Under 5 Lakh

ఇంకా ITR ఫైల్ చేయలేదా? టెన్షన్ పడొద్దు - మీరు చేయవలసింది ఏమిటంటే? - How to File Income Tax Returns

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.