ETV Bharat / business

వాహన బీమా తీసుకోవాలా? Add-onలతో అదనపు రక్షణ పొందండిలా! - standard automobile policy

Vehicle Insurance Add on Benefits : వెహికల్ ఇన్సూరెన్స్ అనేది ఓనర్​కు కాకుండా, నష్టపోయిన థర్డ్ పార్టీ వారికి పరిహారం అందిస్తుంది. అందుకే వాహన యజమానులు యాడ్​-ఆన్​లు కచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే వాహన ప్రమాదాలు జరిగినప్పుడు, మీకు కూడా పరిహారం లభిస్తుంది. అందుకే వెహికల్ ఇన్సూరెన్స్ యాడ్​-ఆన్​ ఉపయోగాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

vehicle insurance add on cover benefits
Vehicle Insurance Importance
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 4:49 PM IST

Vehicle Insurance Add on Benefits : వెహికల్ రోడ్డు మీదకు రావాలంటే బీమా తప్పనిసరి. ప్రమాదం లేదా ఏవైనా ఇతర కారణాలతో వాహనం దెబ్బతిన్నప్పుడు యజమానికి ఆర్థిక భారం కాకుండా ఇది కాపాడుతుంది. అంటే థర్డ్‌ పార్టీ వారికి జరిగిన నష్టానికి పరిహారాన్ని ఇస్తుంది. కారు బీమా నుంచి మరింత అదనపు రక్షణ పొందేందుకు వీలుగా పలు అనుబంధ పాలసీలనూ ఇప్పుడు బీమా సంస్థలు అందిస్తున్నాయి. వీటిని యాడ్‌-ఆన్‌లుగా పిలుస్తుంటారు. వీటిని తీసుకోవాలా? వద్దా? అనేది పూర్తిగా పాలసీదారుల ఇష్టమే. ఈ వెహికిల్ పాలసీల గురించి మరిన్ని వివరాలు మీ కోసం.

ప్రామాణిక పాలసీలో వాహనం డ్యామేజ్​ అయినప్పుడు, థర్డ్‌పార్టీకి నష్టం వాటిల్లినప్పుడు బీమా సంస్థలు పరిహారాన్ని ఇస్తాయి. ఆనుబంధ పాలసీలు ఈ ప్రామాణిక పాలసీని మరింత బలోపేతం చేస్తాయి. ఇవి సాధారణ పాలసీ పరిధిలో ఉండే అంశాలకు మాత్రమే కాకుండా, ఇతర నష్టాలకూ బీమా రక్షణను అందిస్తాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం.

జీరో డిప్రిసియేషన్
ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పుడు రిపేర్ చేయించడానికిి అయ్యే ఖర్చును ఎలాంటి తగ్గింపు లేకుండా అందించేది 'జీరో డిప్రిసియేషన్‌'. ఇది క్లెయిం మొత్తాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. సాధారణ వాహన బీమా పాలసీ ఉంటే తరుగుదల విలువను అంచనా వేసి, ఆ మేరకు మాత్రమే పరిహారం అందిస్తారు. అదే మీరు యాడ్-ఆన్​ పాలసీలను తీసుకోవడం వల్ల పూర్తి మొత్తాన్ని పొందేందుకు వీలవుతుంది. సాధారణంగా ఈ పాలసీని కారు కొన్న అయిదేళ్లపాటు తీసుకునేందుకు అవకాశముంటుంది.

ఇంజిన్‌కు రక్షణగా
కారు ఇంజిన్‌, దాని విడి భాగాలు వరదలు లేదా ఆయిల్‌ లీక్‌ లాంటి ఏవైనా కారణాల వల్ల పాడయ్యే అవకాశం ఉంది. దీనికి సాధారణ పాలసీలో ఎలాంటి రక్షణా ఉండదు. 'ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ కవర్‌' తీసుకోవడం వల్ల ఇంజిన్‌కు జరిగిన నష్టానికి పరిహారం పొందవచ్చు. ముఖ్యంగా ఖరీదైన కార్లకు ఈ అనుబంధ పాలసీని తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే వరదల వల్ల ప్రభావితం అయ్యే ప్రాంతాల్లో ఉండేవారు కూడా దీన్ని తీసుకోవడం మంచిది. దీన్ని ప్రాథమిక పాలసీకి జోడించుకోవడం ద్వారా ఇంజిన్‌లో ముఖ్యమైన విడి భాగాలకూ బీమా రక్షణ లభిస్తుంది.

'రిటర్న్​-టు-ఇన్వాయిస్'​
ప్రమాదం వల్ల వాహనం పనికిరాకుండా పోవడం, చోరీ జరిగిన సందర్భాల్లో ప్రామాణిక పాలసీ వాహన బీమా విలువ (ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్‌ వాల్యూ)ను మాత్రమే యజమానికి చెల్లిస్తుంది. దీనివల్ల వాహన యజమానికి అధిక నష్టం వస్తుంది. 'రిటర్న్‌-టు-ఇన్వాయిస్‌' యాడ్​-ఆన్​ ఎంచుకున్నప్పుడు పైన తెలిపిన పరిస్థితుల్లో వాహనం ఇన్వాయిస్‌ ధరను యజమానికి చెల్లిస్తుంది. ఇందులో రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజులు కూడా కలిసి ఉంటాయి. అంటే, కొత్త వెహికిల్ తీసుకునేందుకు అవసరమైన మొత్తాన్ని ప్రాథమిక పాలసీకి జోడించిన ఈ యాడ్​-ఆన్​ ద్వారా పొందవచ్చన్నమాట.

'నో క్లెయిం బోనస్'
సాధారణంగా ఒక పాలసీకి ఏడాదిలో ఎలాంటి క్లెయింలూ చేయనప్పుడు 'నో క్లెయిం బోనస్‌' (ఎన్‌సీబీ) లభిస్తుంది. దీని ద్వారా పాలసీ రెన్యువల్ సమయంలో ప్రీమియంలో 20 -30 శాతం వరకు డిస్కౌంట్​ లభిస్తుంది. ఒక వేళ క్లెయిం చేసుకున్నా, ఎన్‌సీబీ వర్తించాలంటే 'నో క్లెయిం బోనస్‌ ప్రొటెక్షన్‌' అనుబంధ పాలసీని తీసుకోవాలి. అప్పుడు ఇన్సూరెన్స్​ పాలసీని ఏడాదిలో క్లెయిం చేసుకున్నప్పటికీ, ఎన్‌సీబీని పొందేందుకు వీలుంటుంది. ఒకటి కంటే ఎక్కువ క్లెయింలు ఉన్నట్లయితే ఇది వర్తించకపోవచ్చు. కొత్త వెహికిల్ తీసుకున్నప్పుడు మాత్రమే దీన్ని తీసుకునేందుకు వీలుంటుంది. మూడేళ్లకు మించిన వాహనాలకు ఈ యాడ్‌-ఆన్‌ అందుబాటులో ఉండదు.

అత్యవసర పరిస్థితుల్లో సహాయం
ప్రయాణాల్లో అనుకోని అవరోధాలు ఏర్పడినప్పుడు సహాయం అందించేలా 'రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌' యాడ్‌-ఆన్‌ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాహనం సడన్​గా మొరాయించినప్పుడు, ఆయిల్​ లేక నిలిచిపోయినా, ఇతర ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఈ కవర్‌ కింద ఎప్పుడైనా, ఎక్కడైనా బీమా సంస్థ నుంచి సహాయం పొందవచ్చు. వాహనాన్ని దగ్గరలో ఉన్న మరమ్మతు కేంద్రానికి తరలించి, వాహనంలో ఉన్న ప్రయాణికులకు తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేయడం లాంటి బెనిఫిట్స్ దీని వల్ల కలుగుతాయి.

కీ రిప్లేస్​మెంట్ యాడ్​-ఆన్​
కారు తాళం చెవి కనిపించకుండా పోయినప్పుడు దాన్ని తిరిగి తీసుకునేందుకు అయ్యే ఖర్చు కోసం 'కీ రిప్లేస్‌మెంట్‌' యాడ్‌-ఆన్‌ ఉపయోగపడుతుంది. కారు ప్రమాదం తర్వాత, మరమ్మతు చేస్తున్నప్పుడు, మీ రోజువారీ ప్రయాణానికి క్యాబ్‌ను అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకోసం కూడా బీమా సంస్థ తగిన పరిహారాన్ని అందిస్తుంది. ఇది కారు మోడల్‌ ఆధారంగా రూ.100-రూ.500 వరకూ ఉంటుంది. దీనికోసం 'డైలీ అలవెన్స్‌ బెనిఫిట్‌' తీసుకోవాలి. వాహనంలో ఉన్న వ్యక్తిగత వస్తువులు పోగొట్టుకున్న సందర్భంలో రూ.50వేల వరకు పరిహారం లభించే అనుబంధ పాలసీనీ మీరు తీసుకోవచ్చు. కారు మరమ్మతు సందర్భంలో వినియోగించే చిన్న చిన్న విడిభాగాల ఖర్చునూ చెల్లించేలా అనుబంధ పాలసీని తీసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కనుకనే, మీరు కొత్త వాహనం కొనుగోలు చేసి, బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఈ యాడ్​-ఆన్​లను కూడా తీసుకోవడం మంచిది.

కార్ ఇన్సూరెన్స్​ ప్రొవైడర్​ను మార్చాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

కారు ఇన్సూరెన్స్ డీలర్ దగ్గరే​ తీసుకోవాలా? వేరే బెటర్​ ఆప్షన్స్​ ఉన్నాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.