ETV Bharat / business

టాటా కార్​ లవర్స్​కు గుడ్ న్యూస్​ - త్వరలో లాంఛ్​ కానున్న టాప్​-9 మోడల్స్ ఇవే! - Upcoming Tata Cars In 2024

Upcoming Tata Cars In India 2024 : కార్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ త్వరలో 9 లేటెస్ట్ మోడల్​ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు 2025లోనూ పలు సూపర్ మోడల్ కార్లను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Tata Cars Coming in India 2024
Upcoming Tata Cars in India 2024 (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 1:29 PM IST

Upcoming Tata Cars In India 2024 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు సూపర్ ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​​తో​, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే కార్లను మార్కెట్లోకి తెస్తుంటుంది. అందులో భాగంగా 2024, 2025 సంవత్సరాల్లోనూ తమ సరికొత్త బ్రాండెడ్​ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరి ఆ మోడల్ కార్లు ఏంటి? వాటి ధర ఎంత ఉంటుంది? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. Tata Nexon Fearless 1.2 CNG : టాటా కంపెనీ ఈ నెక్సాన్ ఫియర్​లెస్ 1.2 సీఎన్​జీ కారును ఈ ఏడాది సెప్టెంబరులో లాంఛ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ కలిగి ఉంటుంది. ఈ కారు 5 సీటింగ్ సామర్థ్యంతో వస్తున్నట్లు తెలుస్తోంది. 44 లీటర్ల సామర్థ్యం కలిగి ఉన్న ఫ్యూయల్​ ట్యాంక్ ఇందులో ఉంటుంది. సేఫ్టీపరంగా చూస్తే, ఈ కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఈ కారు ధర దాదాపు రూ.13.20 లక్షలు ఉంటుందని అంచనా.

2. Tata Curvv EV : టాటా కర్వ్ ఈవీని ఈ ఏడాది అక్టోబరు నెలలో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఫుల్ ఛార్జ్​ చేస్తే 500 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చని సమాచారం. ఈ కారు ధర వేరియంట్లను బట్టి రూ.16 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ కారు 4 సీటింగ్ కెపాసిటీతో వస్తున్నట్లు తెలుస్తోంది.

3. Tata Punch Facelift : టాటా పంచ్ ఫేస్​లిఫ్ట్​ను ఈ ఏడాది నవంబరులో భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 4 వేరియంట్లలో ఈ వాహనం అందుబాటులో ఉండనుంది. న్యూ రేడియేటర్ గ్రిల్, రియర్ బంపర్లు, రీడిజైన్ చేసిన ఎల్ఈడీ హెడ్‌ ల్యాంప్స్, టెయిల్‌ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్‌తో టాటా పంచ్ ఫేస్​లిఫ్ట్ మార్కెట్లోకి రానుంది. 10.25 అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్​లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్ పేన్​ సన్​రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి ఫీచర్లు దీనిలో ఉంటాయని సమాచారం. 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్​తో ఈ కారు రానుంది. ఈ కారు ధర రూ.6 లక్షలు - రూ.11 లక్షలు ఉంటుందని అంచనా.

4. Tata Curvv : టాటా కర్వ్ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ కారు ఈ ఏడాది డిసెంబరులో మార్కెట్లో లాంఛ్ కానున్నట్లు సమాచారం. 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్​ప్లేతో కూడిన పెద్ద టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఈ కారులో ఉండనున్నాయి.

5. Tata Harrier EV : టాటా హారియర్ ఈవీ కారు 2025 మార్చిలో మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. దీని ధర మార్కెట్లో రూ.24 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఎల్ఈడీ హెడ్​ల్యాంప్స్​, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, న్యూ రియర్ బంపర్స్​, ఎల్ఈడీ టెయిల్​ లైట్లు ఈ కారులో ఉండనున్నాయి. ఈ కారు లోపలి భాగంలో 10.25 అంగుళాల స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్మార్ట్​ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, పనోరమిక్ సన్​రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.

6. Tata Safari EV : టాటా సఫారీ ఈవీ ధర రూ.26 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ కారు వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు కొత్త స్ప్లిట్ హెడ్‌ ల్యాంప్ డిజైన్, న్యూ అల్లాయ్ వీల్స్​తో మార్కెట్లోకి రానుంది. 10.25 అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు వంటివి ఈ టాటా సఫారీ ఈవీలో ఉండనున్నాయి.

7. Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ వచ్చే ఏడాది మే నెలలో మార్కెట్లోకి రానుంది. ఈ కారు ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. సరికొత్త టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వెంటిలేటెడ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లుతో, ఆధునాతన ఫీచర్లతో ఈ కారు రానుంది.

8. Tata Avinya : టాటా అవిన్యా కారు వచ్చే ఏడాది జూన్​లో లాంఛ్ కానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ కారు ధర సుమారుగా రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని సమాచారం. ఈ కారులో సైడ్​వ్యూ కెమెరాలు ఉండనున్నాయి. ఈ కారు పొడవు 4.3 మీటర్లు.

9. Tata Altroz EV : టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారు ధర రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కారు వచ్చే ఏడాది సెప్టెంబరులో మార్కెట్లోకి రానుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 306 కి.మీ ప్రయాణించవచ్చు. 26 kWh బ్యాటరీతో ఈ ఈవీ కారు రానుంది. ఈ కారును ఇంటి వద్ద 8 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చని తెలుస్తోంది.

మీరు తరచూ రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారా? మరి CC, EC, 3E, EA క్లాస్​ల గురించి తెలుసా? - Indian Train Classes

ప్రీమియం ఎకానమీ సీట్లతో Air India కొత్త విమానం - త్వరలోనే A320neo సర్వీస్ ప్రారంభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.