Upcoming Tata Cars In India 2024 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు సూపర్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ సహా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే కార్లను మార్కెట్లోకి తీసుకొస్తుంటుంది. అందులో భాగంగా 2024, 2025 సంవత్సరాల్లోనూ తమ సరికొత్త బ్రాండెడ్ కార్లను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఆ కార్లు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. Tata Curvv : టాటా కర్వ్ కారు ఆగస్టు 7న భారత మార్కెట్లో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండనున్నట్లు సమాచారం. డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు టాటా కర్వ్ కారులో ఉండనున్నాయి. పెట్రోల్, డీజిల్ ఫ్యూయల్ వేరియంట్లో ఈ కారు లభిస్తుంది.
2. Tata Curvv EV : టాటా కర్వ్ ఈవీ ధర రూ.18 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ కారు కూడా ఆగస్టు 7న భారత విపణిలో లాంఛ్ కానున్నట్లు సమాచారం. ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 600 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని తెలుస్తోంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఈ ఈవీ రానున్నట్లు సమాచారం. ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, యూవీ పనోరమిక్ సన్ రూఫ్, ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్, ఏడీఏఎస్ సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉంటాయని సమాచారం.
3. Tata Avinya : టాటా అవిన్యా కారు వచ్చే ఏడాది జూన్‌లో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ధర రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉండనున్నట్లు అంచనా. అలాగే ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని సమాచారం. 30 నిమిషాల్లోనే ఈ కారును ఫుల్ ఛార్జ్ చేయవచ్చని తెలుస్తోంది. పనోరమిక్ సన్ రూఫ్, సైడ్ వ్యూ కెమెరాలు ఈ కారుకు ఉండనున్నాయి.
4. Tata Nexon Fearless 1.2 iCNG : ఈ కారును టాటా కంపెనీ ఈ ఏడాది సెప్టెంబరులో మారెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ధర దాదాపు రూ.13.20 లక్షలు ఉంటుందని అంచనా. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంటుంది.
5. Tata Harrier EV : టాటా హారియర్ ఈవీ కారు 2025 మార్చిలో మార్కెట్లో లాంఛ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కారు ధర సుమారుగా రూ.24 లక్షల నుంచి రూ.28లక్షల వరకు ఉంటుందని అంచనా. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, న్యూ రియర్ బంపర్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో ఈ కారు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారులో 5 సీటింగ్ సామర్థ్యం ఉండనున్నట్లు సమాచారం.
6. Tata Punch facelift : బడ్జెట్లో కారు కొనాలనుకునేవారికి టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఈ కాంపాక్ట్ ఎస్యూవీ ధర రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంటుందని అంచనా. ట్విన్ స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉండనున్నాయి. అలాగే 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు రానుంది. ఇది 113 ఎన్ఎం టార్క్, 85 బీహెచ్పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును నవంబరులో మార్కెట్లోకి లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది టాటా మోటార్స్.
7. Tata Sierra EV : 2025 మార్చిలో ఈ కారు మార్కెట్లో రానుందని అంచనా. ఈ కారు ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లష్డోర్ హ్యాండిల్స్, వెంటిలేటెడ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, సరికొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఈ కారు లభించనుంది.
8. Tata Altroz EV : టాటా అల్ట్రోజ్ ఈవీ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 306 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. 26 kWh బ్యాటరీతో ఈ ఈవీ కారు అందుబాటులోకి రానుంది. ఈ కారును 8 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చని సమాచారం. టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారు ధర రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ కారు వచ్చే ఏడాది సెప్టెంబరులో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవ్ మోడ్ సెలెక్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో ఈ కారు రానుంది.
9. Tata Safari EV : టాటా సఫారీ ఈవీ వచ్చే ఏడాది మార్చిలో భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కారు ధర రూ.26 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. 6,7 సీటింగ్ కెపాసిటీ ఆప్షన్లతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉండనున్నాయి.
రూ.7 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Cars Under 7 Lakh