ETV Bharat / business

పన్ను రేట్లు యథాతథం- మౌలికానికి పెద్దపీట- రూ.48 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ - budget 2024 highlights

Union Budget 2024 Live Updates : గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు ఫలితాలిస్తున్నాయని పేర్కొన్నారు. రూ.47.66 లక్షల కోట్ల బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.

union budget 2024 live updates
union budget 2024 live updates
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 9:47 AM IST

Updated : Feb 1, 2024, 1:06 PM IST

రాబోయే ఐదేళ్లలో భారత్‌ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన 'డెమొక్రసీ, డెమొగ్రఫీ, డైవర్సిటీ' త్రయానికి దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా ఉందన్నారు. గురువారం లోక్‌సభలో తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

మొత్తం రూ.47.66 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లతోపాటు ఎగుమతి, దిగుమతి సుంకాలలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించారు. ఆశావర్కర్లు, అంగన్వాడీలకు ఆయుష్మాన్‌ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం, కొత్తగా ఐదు సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. లక్షద్వీప్‌ సహా మిగిలిన దీవుల్లో పర్యటక వసతులు కల్పిస్తామన్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం అనంతరం ఉభయసభలు రేపటికి (శుక్రవారానికి) వాయిదాపడ్డాయి.

  • పథకాలకు కేటాయింపులు
  • బడ్జెట్‌లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు
  • రక్షణశాఖకు రూ 6.2 లక్షల కోట్లు కేటాయింపులు
  • రైల్వేశాఖకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయింపు
  • హోంశాఖకు రూ. 2.03 లక్షల కోట్లు కేటాయింపు
  • వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు
  • గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 1.77లక్షల కోట్లు కేటాయింపు
  • ఉపరితల రవాణా, జాతీయ రహదారులు- రూ.2.78 లక్షల కోట్లు
  • ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.2.13 లక్షల కోట్లు
  • రసాయనాలు, ఎరువుల కోసం రూ. 1.68 లక్షల కోట్లు
  • కమ్యూనికేషన్‌ రంగానికి రూ.1.37 లక్షల కోట్లు కేటాయింపు
  • 12.34AM
  • పథకాలకు కేటాయింపులు
  • గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేల కోట్లు కేటాయింపు
  • ఆయుష్మాన్‌ భారత్ పథకానికి రూ.7,500 కోట్లు కేటాయింపు
  • పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200 కోట్లు కేటాయింపు
  • సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకోవ్యవస్థల తయారీకి రూ.6,903 కోట్లు
  • సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు రూ.8,500 కోట్లు కేటాయింపు
  • గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు రూ.600 కోట్లు కేటాయింపు
  • 12.18PM
  • బడ్జెట్‌ పరిమాణం రూ. 47.66 లక్షల కోట్లు
  • వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు
  • 12.08PM
  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్​సభ రేపటికి (శుక్రవారానికి) వాయిదా పడింది.
  • 12.01PM
  • 2014కు ముందు ఆర్థికవ్యవస్థ, 2014 తర్వాత ఆర్థికవ్యవస్థ ఎలా ఉందో శ్వేతపత్రం సభ ముందు ఉంచుతాం
  • సుపరిపాలన వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయన్నదానికి ఈ పరిపాలనే నిదర్శనం
  • అభివృద్ధి చెందిన భారత్‌కు ఎలా ముందడుగు వేస్తుందో చెప్పడానికీ ఈ పదేళ్ల అభివృద్ధే తార్కాణం
  • 11.55AM
  • ఈ పదేళ్లలో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారులు మూడు రెట్లు పెరిగారు
  • పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయిని దేశాభివృద్ధికి ఖర్చు చేస్తున్నాం
  • కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షలలోపు ఆదాయం వరకు పన్ను రహితం
  • పన్ను రేట్ల హేతుబద్ధతతో పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించాం
  • ఫేస్‌లెస్‌ విధానంతో పన్ను అసెస్‌మెంట్‌లో పారదర్శకత, సత్వర రిటర్న్‌ల చెల్లింపులు
  • జీఎస్టీ విధానంతో పన్ను పరిధి రెట్టింపయింది
  • సరాసరి నెలవారీ జీఎస్టీ ఆదాయం రూ.1.66 కోట్లకు చేరింది. జీఎస్టీ ముందున్న విధానంకన్నా ఈ ఆదాయం రెట్టింపు
  • అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త సంస్కరణలతో జల, వాయు రవాణా మార్గాల్లో నూతన కంటెయినిరిటీ పోల్‌ ఏర్పాటు చేస్తున్నాం
  • 11.41AM
  • జైవిజ్ఞాన్‌, జైకిసాన్‌, జైఅనుసంధాన్‌ అన్నది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
  • నూతన పరిజ్ఞానం, మార్కెట్‌ వ్యవస్థ అనుసంధానంతో వ్యవసాయరంగాలకు కొత్త ఆదాయ మార్గాలు
  • సమీకృత సాంకేతిక అభివృద్ధి దిశగా రక్షణ రంగానికి ఊతం
  • రైలు మార్గాల్లో హైట్రాఫిక్‌, హైడెన్షిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు ఏర్పాటు
  • రైలు బోగీలన్నింటినీ వందేభారత్‌ ప్రమాణాలతో మార్పు
  • విమానయాన రంగంలో 2, 3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులు
  • మన విమానయాన సంస్థలు.. వెయ్యి విమానాలకు పైగా ఆర్డర్‌ చేశాయి
  • ఈ విమానాల ఆర్డర్లే మన విమానయాన అభివృద్ధిని తెలియజేస్తున్నాయి
  • రక్షణ రంగంలో స్వయంసమృద్ధి కోసం కొత్త మిషన్‌
  • 11.37AM
  • వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు, వృథాను అరికట్టి రైతులకు అధిక ఆదాయం సమకూర్చే పథకాలు
  • వ్యవసాయ ఉత్పత్తుల కోసం గిడ్డంగులు, ప్రాసెసింగ్‌ కోసం ఆర్థిక సాయం
  • నూనె గింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించేందుకు కొత్త పథకం
  • పాడి అభివృద్ధి కోసం రైతులకు ఆర్థికసాయం
  • రాష్ట్రీయ డెయిరీ ప్రాసెసింగ్‌, గోకుల్‌ మిషన్‌ ద్వారా డెయిరీ ప్రాసెసింగ్‌కు ఆర్థిక సాయం
  • దేశీయ మత్స్యసంపద అభివృద్ధికి పీఎం మత్స్య సంపద యోజన ద్వారా మరింత ఆర్థిక సాయం
  • 83 లక్షల ఎస్‌ఎస్‌జీల ద్వారా 9 కోట్లమంది మహిళలు ఆర్థికంగా ఉన్నతి సాధించారు. కోటిమంది లక్షాధికారులుగా తయారయ్యారు
  • 2 కోట్ల నుంచి 3 కోట్లమంది మహిళలు లక్షాధికారులు కావాలన్నదే లక్ష్యం
  • 11.31AM
  • మధ్యతరగతి నూతన గృహ నిర్మాణ విధానం అందుబాటులోకి తెస్తున్నాం
  • మురికివాడలు, అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇళ్లు కట్టుకోవడానికి, కొనుగోలుకు ప్రభుత్వం నుంచి మద్దతు
  • పిల్లల ఆరోగ్యం కోసం ఇంధ్రధనస్సు కార్యక్రమం
  • అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు
  • తూర్పు ప్రాంతాన్ని భారత నూతన అభివృద్ధి రథంగా మారుస్తున్నాం
  • తూర్పు ప్రాంతంలోని ప్రజలు, వనరులు భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి
  • విద్యుత్‌ బిల్లుల నుంచి విముక్తి కోసం కొత్త సోలార్‌ పథకం ఇప్పటికే ప్రకటించాం
  • 11.27AM
  • జనాభా, ప్రజాస్వామ్యం, భిన్నత్వం అన్నది మూడు మూలసూత్రాలుగా భారత్‌ ముందడుగు వేస్తోంది
  • నూతన ప్రపంచంలో అనేక అవకాశాలు భారత్‌ అందిపుచ్చుకుంటోంది
  • అభివృద్ధి చెందిన భారత్‌గా ఎదిగేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం
  • 2047 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ముందడుగు వేస్తున్నాం
  • అవకాశాలను సృష్టించుకోవడంలో ఆకాశమే హద్దుగా భారత్‌ ముందడుగు వేస్తోంది
  • కొత్త ప్రపంచంతో అనుసంధానమవుతూ కొత్త అవకాశాలను సృష్టిస్తూ దిక్సూచిగా భారత్‌ నిలిచింది
  • 11.25AM
  • ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది
  • ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని క్లిష్టతరం చేస్తున్నాయి
  • అనేక కొత్త సవాళ్ల మధ్య భారత్‌ నూతన మార్గాన్ని అన్వేషిస్తోంది
  • పశ్చిమాసియా, యూరప్‌లో ఉన్న యుద్ధ వాతావరణం కొత్త సవాళ్లను మన ముందుంచింది
  • సవాళ్లను ఎదుర్కొని ప్రపంచాన్ని కొత్త మార్గంలో వెళ్లే దిశగా సుదృఢమైన పాత్రను పోషిస్తోంది
  • 11.23AM
  • గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్‌ యోజన కింద ఇచ్చిన ఇళ్లలో 70 శాతం మందికి మహిళలు లేదా మహిళల జాయింట్‌ ఓనర్‌షిప్‌కు ఇచ్చాం
  • జీడీపీకి ఈ ప్రభుత్వం కొత్త అర్థం చెప్పింది
  • గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌, ఫెర్మార్మెన్స్‌ అన్నది ఈ ప్రభుత్వం జీడీపీకి ఇచ్చిన కొత్త అర్థం
  • ఈ పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతౌల్యంగా ఉంచాం
  • ప్రజల వాస్తవ ఆదాయం 50 శాతానికి పైగా పెరిగింది
  • వాస్తవ ఆదాయం పెరుగుదల సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది
  • 11.17AM
  • 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికసాయం అందించాం
  • 4.5 కోట్లమందికి బీమా సౌకర్యం కల్పించాం
  • వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికత తీసుకొచ్చి విలువ జోడింపు ద్వారా కొత్త విధానాలు
  • యువత కోసం స్కిల్‌ ఇండియా మిషన్‌ ద్వారా కోటి 40 లక్షలమందికి నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పించాం
  • 3 వేల ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు కొత్తగా ప్రారంభించాం
  • ముద్ర యోజన ద్వారా 25 లక్షల కోట్ల రుణాలను యువతకు అందించాం
  • స్టార్టప్‌ ఇండియా స్టార్టప్‌ సపోర్టు ద్వారా యువతను కొత్త పారిశ్రామికులుగా తయారుచేశాం
  • 30 కోట్లమంది మహిళలకు ముద్ర రుణాలు అందించాం
  • 11.11AM
  • మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నాలుగు కులాలకు ప్రాధాన్యమిచ్చింది
  • పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేసే ప్రయత్నం చేసింది
  • పేదరిక నిర్మూలనకు బహుముఖి అయిన విధానాలతో ఈ ప్రభుత్వం పనిచేసింది
  • రూ.34 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకంతో పేదలకు జన్‌ధన్‌ ఖాతాల ద్వారా అందించింది
  • 11.10AM
  • మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌
  • వరుసగా ఆరోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నిర్మలాసీతారామన్‌
  • డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి బడ్జెట్‌ కాపీ
  • వరుసగా ఆరోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టి మెురార్జీ రికార్డును సమం చేసిన నిర్మల
  • మన్మోహన్‌, జైట్లీ, చిదంబరం, యశ్వంత్‌ సిన్హా రికార్డును అధిగమించిన నిర్మల
  • ఎన్నికల దృష్ట్యా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మల
  • 11.03AM

పార్లమెంట్​లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

10.40AM

కేంద్ర బడ్జెట్​కు మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్​లో భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు బడ్జెట్​ను ఆమోదించింది. కాసేపట్లో పార్లమెంట్​లో నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

  • 10.35AM

పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు ఎక్స్​లో ట్వీట్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. అంతకుముందు తనను కలిసిన క్రమంలో నిర్మలకు మిఠాయి తినిపిస్తున్న ఫొటోలను పోస్ట్ చేశారు.

  • 10.03AM

రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకుని పార్లమెంట్​కు చేరుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. మరికాసేపట్లో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.

  • 9.56AM

మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ ప్రతులను పార్లమెంట్​కు తీసుకొచ్చారు అధికారులు. అలాగే రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు పార్లమెంట్​కు చేరుకున్నారు.

  • 9.45AM

Union Budget 2024 Live Updates : సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ సర్కారు తాత్కాలిక బడ్జెట్‌ను మరికాసేపట్లో ప్రవేశపెట్టనుంది. మూడోసారి అధికారం చేపట్టాలన్న ఆకాంక్షల మధ్య ఈ బడ్జెట్‌ తీసుకొస్తోంది. ఉదయం 11 గంటలకు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. వరుసగా ఆరోసారి బడ్జెట్​ను ప్రవేశపెట్టి అరుదైన ఘనత సాధించనున్నారు. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్​లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయనే విషయంపై ఆసక్తి నెలకొంది.

గురువారం ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు నిర్మలా సీతారామన్​. ఆ తర్వాత రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకోనున్నారు. ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకోనున్నారు. బడ్జెట్‌ సమర్పణకు ముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్‌.

Last Updated : Feb 1, 2024, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.