ETV Bharat / business

మీ కారు ఇంజన్ ఏంటి? - టర్బో ఛార్జర్ Vs సూపర్ ఛార్జర్​ - ఏది బెస్ట్?

Turbocharger Vs Supercharger: కారు కొనుగోలు చేస్తున్నప్పుడు.. చాలా మంది కంపెనీ, మోడల్, కారు డిజైన్, ఇంటీరియర్ వంటి వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ.. లోపల ఎలాంటి ఇంజన్ వాడారు? అనేదాని గురించి పెద్దగా పట్టించుకోరు. మరి.. మీ కారులో ఏ ఇంజిన్ ఉందో తెలుసా?

Turbocharger Vs Supercharger
Turbocharger Vs Supercharger
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 10:21 AM IST

Turbocharger Vs Supercharger: వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా.. కార్ల తయారీదారులు పాతకాలపు ఇంజన్లను పక్కనపెట్టారు. కొత్తగా టర్బోఛార్జర్, సూపర్​ఛార్జర్ టెక్నాలజీతో తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా ఇంజన్​లో తయారు చేస్తున్నారు. మరి టర్బోఛార్జర్​, సూపర్​​ఛార్జర్ ఇంజన్ల​ మధ్య తేడాలేంటి? మీ కారులో ఉన్నదేంటి? ఏది బెస్ట్? అన్నది ఇప్పుడు చూద్దాం.

టర్బోఛార్జర్ ఎలా పని చేస్తుంది?: టర్బోఛార్జర్ అనేది ఇంజన్‌లో దహన ప్రక్రియకు అవసరమైన గాలి శాతాన్ని పెంచడానికి ఉపయోగించే ఓ మెషిన్​. ఇది ఇంజన్‌లోకి వెళ్లే గాలి మొత్తాన్ని పెంచడానికి ఒక టర్బైన్‌తో అమర్చుతారు. ఈ టర్బైన్ తిరిగినప్పుడు ఎక్కువ గాలి ఇంజన్‌లోకి వెళ్లి, దహన ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇంజన్ ఎగ్జాస్ట్ పాయింట్ వద్ద టర్బైన్ నుంచి వెళ్లిపోయే పొగ వల్ల కలిగే ఒత్తిడి కారణంగా ఈ టర్బైన్ తిరుగుతుంది.

టర్బోఛార్జర్​ ప్రయోజనాలు:

  • టర్బోఛార్జర్​లో టర్బైన్ లేదా షాఫ్ట్‌కు కనెక్షన్ లేదు. కాబట్టి మెకానికల్ ట్రాక్ ఉండదు. ఈ సాంకేతికత పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్ ఇంజన్లకు అనుకూలంగా ఉంటుంది.
  • సాధారణంగా సూపర్‌ఛార్జర్ల కంటే తక్కువ ఖర్చుతో ఉంటుంది.
  • తక్కువ ఇంజిన్ లోడ్‌ల వద్ద మంచి పనితీరును అందిస్తుంది.
  • ఇంజిన్ వేగం పెరిగేకొద్దీ ఎక్కువ పవర్‌ను అందిస్తుంది.

మీ కారులో ఈ సేఫ్టీ ఫీచర్ ఉందా? - లేదంటే ఇబ్బందే!

సూపర్​​ఛార్జర్ ఎలా పని చేస్తుంది?: సూపర్​​ఛార్జర్ పనితీరు కూడా ఇంచు మించు టర్బోఛార్జర్ మాదిరిగానే ఉంటుంది. సూపర్​ఛార్జర్ అనేది ఇంజన్​​లోకి ఎక్కువ గాలిని ఆకర్షించే పరికరం. కానీ గాలి తీసుకోవడానికి, తిప్పడానికి ఇది ఎగ్జాస్ట్‌ను ఉపయోగించదు. దానికి బదులుగా క్రాంక్ షాఫ్ట్ వెంటనే తిరిగే, ఇంజన్ సామర్థ్యాన్ని పెంచే సాధనాన్ని మౌంట్ చేస్తుంది. ఈ రెండింటి ఉపయోగం ఒక్కటే అయినప్పటికీ, ఇవి పనిచేసే విధానాలు మాత్రం వేరుగా ఉంటాయి.

సూపర్​​ఛార్జర్ ప్రయోజనాలు:

  • ఇది ఇంజన్‌కు త్వరగా శక్తిని ఇస్తుంది.
  • ఈ సాంకేతికతను ఇంజన్​లలో ఇన్‌స్టాల్ చేయడం సులభం.
  • ఈ సాంకేతికత చిన్న డిస్‌ప్లేస్‌మెంట్ ఇంజన్లకు కూడా అనుకూలంగా ఉంటుంది.
  • తక్కువ టర్బో ల్యాగ్ ఉంటుంది.
  • ఎందుకంటే ఇంజిన్ వేగం నుంచి నేరుగా శక్తి తీసుకుంటుంది.

ఈ రెండింటిలో ఏది బెస్ట్?: టర్బోఛార్జర్, సూపర్​ఛార్జర్ రెండూ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రెండూ ఇంజన్ శక్తిని పెంచడానికి ఉపయోగపడుతాయి. ఈ రెండింటి శక్తి ఒకే విధంగా పెరుగుతుంది. కానీ, ఇంధన వినియోగం విషయానికి వస్తే సూపర్​ఛార్జర్ కంటే టర్బోఛార్జర్ తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. అందుకే వాహన తయారీదారులు, కస్టమర్లు ఎక్కువగా టర్బోఛార్జర్ ఇంజన్​లను ఇష్టపడతారు.

ట్విన్ ఛార్జర్: ఒకే ఇంజన్‌లో టర్బోఛార్జర్, సూపర్‌ఛార్జర్ రెండింటినీ ఒకేసారి ఉపయోగించడం కూడా సాధ్యమవుతుంది. సాధారణంగా రేస్ కార్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనినే ట్విన్ ఛార్జర్‌ అని కూడా పిలుస్తారు. ఈ ట్విన్ ఛార్జర్​ను పెట్రోల్ కార్లలో ఉపయోగించడం సులభం కానీ.. డీజిల్ ఇంజిన్‌లో ఉపయోగించలేరు. ఎందుకంటే ఇది ఆర్‌పిఎమ్ కంటే తక్కువ టార్క్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా - ఈ విషయాలు తెలుసా?

శక్తి ఎంత పెరుగుతుంది? : సూపర్​​ఛార్జర్ ఇంజన్​ హార్స్‌పవర్​, టార్క్‌ను పెంచుతుంది. దీంతో.. ఇంజన్ పవర్ 70-80 శాతం పెరుగుతుంది. ఈ శక్తి త్వరగా, సజావుగా లభిస్తుంది. కానీ.. సూపర్​ఛార్జర్ నేరుగా ఆర్‌పిఎమ్​కి కనెక్ట్ చేయడం వల్ల ఇది ఇంధన వినియోగాన్ని కూడా పెంచుతుంది. తద్వారా కారు మైలేజీ తగ్గుతుంది. టర్బోఛార్జర్ ఇంజన్ శక్తిని 20-30 శాతం పెంచుతుంది (కొన్నిసార్లు 50 శాతం కూడా పెరిగే అవకాశం ఉంది) కాబట్టి.. ఇది తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది.

మైలేజ్ మైలేజ్ పరంగా చూస్తే..: టర్బోఛార్జర్ ఇంజన్లు అత్యుత్తమ మైలేజీని అందిస్తాయి. కానీ.. ఇంజన్‌కు గరిష్టంగా 50 శాతం శక్తిని మాత్రమే అందిస్తాయి. సగటున 25-30 శాతం శక్తిని మాత్రమే అందిస్తుంది. అదే సమయంలో సూపర్​​ఛార్జర్ ఏకంగా 80 శాతం శక్తిని అందిస్తుంది. కానీ.. ఇది ఆర్‌పిఎమ్​కి కనెక్ట్ చేసినందు వల్ల 20 శాతం మెకానికల్ లాగ్‌కు కారణమవుతుంది. కాబట్టి.. మీకు మంచి పవర్ అవసరమని అనుకుంటే మీకు సూపర్​​ఛార్జర్ ఉత్తమమైనది. మీకు పవర్‌తో పాటుగా మైలేజీ కూడా అవసరమని భావిస్తే.. టర్బోఛార్జర్​ను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

క్లచ్​ లైఫ్​ టైమ్​ పెరగాలా? కారు డ్రైవింగ్​ సమయంలో ఈ తప్పులు చేయకండి!

కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? - ఇక్కడ రూ. 5.13 లక్షలకే మారుతి స్విఫ్ట్ కారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.