Top Range Electric Cars In India In 2024 : ఇంధనాల ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కార్లను మెయింటైన్ చేయడం బాగా కష్టమైపోతోంది. మరోవైపు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది.
మొదట్లో ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ చాలా తక్కువగా ఉండేది. అందువల్ల దూర ప్రయాణాలు చేయడానికి చాలా మంది ఇబ్బందిపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. లాంగెస్ట్ రేంజ్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయి. అందుకే క్రమంగా ఈవీల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అందుకే ఈ ఆర్టికల్లో లాంగ్ రేంజ్ కలిగిన టాప్- 5 కార్ల గురించి తెలుసుకుందాం.
1. Kia EV6 : కియా ఈవీ6 అనేది ఒక క్రాసోవర్ ఎస్యూవీ. ఈ కారులో 77.4 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తేతో హాయిగా 708 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. మార్కెట్లో ఈ కియా ఎలక్ట్రిక్ కారు ధర సుమారుగా రూ.60.95 లక్షల నుంచి రూ.65.95 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
2. Hyundai Ioniq 5 : ఈ హ్యుందాయ్ అయోనిక్ 5 కూడా ఒక ఎస్యూవీ కార్. ఈ ఎలక్ట్రిక్ కారులో 72.6 కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని అమర్చారు. దీనిని సింగిల్ టైమ్ రీఛార్జ్ చేస్తే 631 కి.మీ రేంజ్ వరకు హాయిగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఈ హ్యుందాయ్ అయోనిక్ 5 కారు ధర సుమారుగా రూ.46.05 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంది.
3. BMW i4 : బీఎండబ్ల్యూ ఐ4 అనేది ఒక ఎలక్ట్రిక్ సెడాన్. దీనిలో 83.9 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ కార్ డ్రైవింగ్ రేంజ్ 590 కి.మీ. ఇండియన్ మార్కెట్లో ఈ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు ధర సుమారుగా రూ.72.50 లక్షల నుంచి రూ.77.50 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
4. BYD Atto 3 : హయ్యెస్ట్ డ్రైవింగ్ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో బీవైడీ అట్టో 3 ఒకటి. దీని డ్రైవింగ్ రేంజ్ 521 కి.మీ. ఈ కారులో 60.48 కిలోవాట్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ప్యాక్ ఉంది. దానిని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు హాయిగా 521 కి.మీ రేంజ్ వరకు డ్రైవ్ చేసేయవచ్చు. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ధర సుమారుగా రూ.33.99 లక్షల నుంచి రూ.34.49 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
5. MG ZS EV : ఎంజీ కంపెనీ విడుదల చేసిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లలో ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఒకటి. దీని డ్రైవింగ్ రేంజ్ 461 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ కారులో 50.3 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. మార్కెట్లో ఈ ఎంజీ ఈవీ ధర సుమారుగా రూ.18.98 లక్షల నుంచి రూ.25.20 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
బంగారు నగలు కొనాలా? ఆభరణాల ధరలను ఎలా లెక్కించాలో తెలుసుకోండిలా! - Gold Jewellery Cost Calculation