ETV Bharat / business

మెటల్ క్రెడిట్ కార్డుతో లాభమేనా? ఈ భారీ డిస్కౌంట్స్​, రివార్డ్స్​ గురించి మీకు తెలుసా? - Top Metal Credit Cards In India - TOP METAL CREDIT CARDS IN INDIA

Top Metal Credit Cards In India August 2024 : మీరు మంచి క్రెడిట్ కార్డ్ తీసుకుందామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. సాధారణ క్రెడిట్ కార్డుల కంటే మెటల్ క్రెడిట్ కార్డుల వల్ల బోలెడు బెనిఫిట్స్ లభిస్తాయి. ముఖ్యంగా తక్కువ వడ్డీతో క్రెడిట్ లభిస్తుంది. పైగా సాధారణ క్రెడిట్ కార్డులతో పోల్చితే ఎక్కువ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి.

metal credit cards
metal credit cards (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 3:33 PM IST

Top Metal Credit Cards In India August 2024 : మన జీవితంలో అకస్మాత్తుగా అనేక ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే సాధారణ క్రెడిట్ కార్డులతో పోలిస్తే మెటల్ కార్డులు తక్కువ వడ్డీ రేటును విధిస్తాయి. అంతేకాదు హయ్యర్​ రివార్డులు, ప్రత్యేకమైన డీల్స్ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటి వార్షిక ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయి.

ప్రస్తుతం దేశంలోని ప్రముఖ బ్యాంకులు అన్నీ మెటల్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వాటిలోని టాప్​-7 మెటల్ క్రెడిట్ కార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. HDFC Infinia Metal Credit Card

  • ఈ కార్డు ఉన్నవారు ఐటీసీ హోటళ్లలో రాత్రి వేళ ఫ్రీగా బస చేయొచ్చు. అలాగే బుఫే (buffet) తినొచ్చు.
  • మొదటి సంవత్సరం కాంప్లిమెంటరీ క్లబ్ మారియట్ సభ్యత్వం లభిస్తుంది.
  • అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అన్​లిమిటెడ్​ లాంజ్ యాక్సెస్ ఉంటుంది.
  • ఖర్చు చేసిన ప్రతి రూ.150కి 5 రివార్డ్ పాయింట్లు వస్తాయి.
  • 24 X 7 గ్లోబల్ పర్సనల్ కాన్సియజ్​
  • హెచ్​డీఎఫ్​సీ ఇన్ఫియా మెటల్ కార్డ్​ కావాలనుకునేవారు రూ.12,500 జాయినింగ్ ఫీజును కట్టాల్సి ఉంటుంది. అలాగే అదనంగా పన్నులు కట్టాల్సి ఉంటుంది. కార్డు యాక్టివేషన్ తర్వాత వెల్​కమ్ ఆఫర్లు, కార్డు రెన్యూవల్ బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే హెచ్​డీఎఫ్​సీ ఇన్ఫియా మెటల్ క్రెడిట్​ కార్డ్​తో ఏడాది వ్యవధిలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే, వచ్చే ఏడాది ఫ్రీగా మెంబర్​షిప్ రెన్యూవల్​ అవుతుంది.

2. HDFC Biz Black Metal

  • ఈ కార్డు తీసుకున్నవారికి వ్యాపార ఖర్చులపై 5X రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1000+ ఎయిర్‌పోర్ట్ లాంజ్​లకు అపరిమిత యాక్సెస్
  • యాక్టివ్ కార్డ్ హోల్డర్లకు మాత్రమే అపరిమిత ఎయిర్​పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.
  • హెచ్​డీఎఫ్​సీ బిజ్ బ్లాక్ మెటల్ కార్డు సభ్యత్వ రుసుము రూ.10 వేల వరకు ఉంటుంది. అలాగే పన్నులు వర్తిస్తాయి. ఏడాదిలో ఈ కార్డుతో రూ.7.5 లక్షలు (12 బిల్లింగ్ సైకిల్స్) ఖర్చు చేస్తే, మరుసటి ఏడాది రెన్యువల్ ఫీజు ఉండదు. కార్డు తీసుకునేటప్పుడు కట్టిన ఫీజును తిరిగి రాబట్టేందుకు కార్డు జారీచేసిన 90 రోజుల్లో రూ.1.5 లక్షలు ఖర్చు చేసినా సరిపోతుంది.

3. IDFC First Private Credit Card

  • ఈ కార్డుతో నెలకు రూ.30,000 కంటే ఎక్కువ ఖర్చు చేసేవారికి 6X, అద్దె కట్టేవారికి 3X రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.
  • నెలకు రూ.30,000 కంటే ఎక్కువ ఖర్చు చేసేవారికి 10X రివార్డు పాయింట్లు లభిస్తాయి.
  • నెలకు రెండు సార్లు రూ.40,000 కంటే ఎక్కువ విలువైన కాంప్లిమెంటరీ గోల్ఫ్ రౌండ్లు లేదా లెస్సన్స్ లభిస్తాయి.
  • మీ పుట్టినరోజునాడు చేసే ఖర్చులపై 10X రివార్డు పొందవచ్చు. అలాగే విరాళంగా ఇచ్చే డబ్బులపై 25శాతం బోనస్ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.
  • దేశవిదేశాల్లోని విమానాశ్రయాల్లోని స్పాలు, లాంజ్​లకు ఉచిత అపరిమిత యాక్సెస్ ఉంటుంది.

4. Amex Platinum Charge Card (అమెరికన్ ఎక్స్‌ప్రెస్)

  • మీరు విదేశాల్లో గడిపిన ప్రతిసారీ అక్కడ చేసే ఖర్చుపై 3X మెంబర్​షిప్ రివార్డ్ పాయింట్స్.
  • మీ కార్డుతో విదేశాల్లో ఖర్చు చేసే ప్రతి రూ.407కి 1 మెంబర్​షిప్ రివార్డ్ పాయింట్‌ వస్తుంది.
  • 130+ దేశాలలో విస్తరించిన అమెరికన్ ఎక్స్​ప్రెస్ లాంజ్​ల్లో వైఫై, వంటకాలు ఉచితం.
  • ఈ కార్డు కావాలనుకునేవారు రూ.60వేలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. అలాగే పన్నులు వర్తిస్తాయి.

5. ICICI Emeralde Private Metal Credit Card

  • కాంప్లిమెంటరీ ఈజీడైనర్ ప్రైమ్ మెంబర్​షిప్‌ 12 నెలలు ఫ్రీ.
  • కార్డు యాక్టివేషన్ తర్వాత బోనస్​గా 12,500 ఐసీఐసీఐ రివార్డు పాయింట్లు.
  • తాజ్​హోటల్​లో ఒక రాత్రి బస చేయవచ్చు. అలాగే ఎపిక్యుర్ మెంబర్​షిప్‌ వస్తుంది (ఏడాది ఫ్రీ).
  • పన్ను, ఇంధనం, అద్దె చెల్లింపులు మినహా రిటైల్ లావాదేవీలపై ఖర్చు చేసే ప్రతి రూ.200కి 6 ఐసీఐసీఐ బ్యాంక్ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.
  • కిరాణా, విద్య, నిత్యావసరాలు, బీమా చెల్లింపులపై రివార్డు పాయింట్లు అందుతాయి. ప్రతి రివార్డ్ పాయింట్ విలువ రూ.1 వరకు ఉంటుంది.
  • కిరాణా, అవసరాలు, విద్యకు వేర్వేరుగా గరిష్ఠంగా 1,000; బీమా చెల్లింపులపై 5,000 రివార్డు పాయింట్లు లభిస్తాయి.
  • ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ.12,499. ఏడాదికి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఈ ఫీజును తిరిగి పొందొచ్చు.
  • మీ ప్రైమరీ కార్డుతో గరిష్ఠంగా 3 కాంప్లిమెంటరీ యాడ్​-ఆన్​ కార్డ్​లను ఆస్వాదించవచ్చు.

6. Axis Bank Burgundy Private Credit Card

  • ఈ క్రెడిట్ కార్డుతో విమాన బుకింగ్స్, టేబుల్ రిజర్వేషన్స్, గిఫ్ట్ డెలివరీలు నిర్వహించడానికి 24x7 వీలుంటుంది.
  • ఎంపిక చేసిన ఫైన్ డైన్ రెస్టారెంట్లలో 25శాతం వరకు డిస్కౌంట్ అందించే కాంప్లిమెంటరీ ఈజీడైనర్ ప్రైమ్ మెంబర్​షిప్.
  • అదనంగా యాక్సిస్ బ్యాంక్ డైనింగ్ డిలైట్స్ ప్రోగ్రామ్​తో 30శాతం వరకు డిస్కౌంట్.
  • బుక్ మై షోలో నెలకు 5 సినిమాలు, 5 నాన్ మూవీ టికెట్స్​పై ఒక కాంప్లిమెంటరీ టికెట్.
  • రూ.400 - రూ.4000 మధ్య లావాదేవీలకు 1 శాతం ఇంధన సర్​ఛార్జ్ మినహాయింపు.

7. SBI Aurum Credit Card

  • ఏడాదికి 16 కాంప్లిమెంటరీ గోల్ఫ్ రౌండ్స్.
  • 12 కాంప్లిమెంటరీ గోల్ఫ్ లెస్సన్స్ నేర్చుకోవచ్చు.
  • 1000+ అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్​లకు అపరిమిత కాంప్లిమెంటరీ యాక్సెస్‌
  • త్రైమాసికానికి 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్​పోర్ట్ లాంజ్ యాక్సెస్
  • యాడ్-ఆన్ కార్డ్ హోల్డర్లు ప్రతి త్రైమాసికంలో 2 డొమెస్టిక్ ఎయిర్​పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు.
  • వార్షిక రుసుము రూ.9999 + పన్నులు.
  • ఈ కార్డుతో రూ.10,000 విలువైన వెల్కమ్​ గిఫ్ట్స్​ను పొందవచ్చు. అలాగే రెన్యూవల్ ఫీజు రూ.9999+ పన్నులు.

మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు! - 5 Common Credit Card Mistakes

మీరు క్రెడిట్ కార్డ్ యూజర్లా? 'గ్రేస్​ పీరియడ్​'ను తెలివిగా వాడుకోండిలా! - Credit Card Grace Period

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.