Top 5 Most Affordable Bikes With ABS In India : దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే ఈ ప్రమాదాలను నివారించడానికి, ప్రభుత్వం 125సీసీ లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ సామర్థ్యం ఉన్న బైక్‌లకు యాంటీ-క్లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)ను తప్పనిసరి చేసింది. దీని వల్ల సడెన్‌గా బ్రేక్ వేసినప్పటికీ వీల్స్ లాక్ కాకుండా ఉంటాయి. ఫలితంగా వాహనదారులకు, ఎదురుగా వచ్చినవారికి కూడా ముప్పు తప్పుతుంది. పైగా నేడు వాహనదారులు అందరూ మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న బైక్స్‌నే కొనేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ఈ ఆర్టికల్‌లో ఏబీఎస్ ఫెసిలిటీ ఉన్న టాప్-5 బైక్స్‌పై ఓ లుక్కేద్దాం.
1. Bajaj Platina 110 ABS Features : ఈ బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ బైక్‌లో 115.45 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7000 rpm వద్ద 8.60 PS పవర్, 5000 rpm వద్ద 9.81 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్‌లో సింగిల్ ఛానల్ యాంటీ-క్లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ఉంది.
Bajaj Platina 110 ABS Price : మార్కెట్లో ఈ బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ బైక్ ధర సుమారుగా రూ.79,821 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Hero Xtreme 125R Features : ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ బైక్‌లో 124.7.45 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8250 rpm వద్ద 11.55 PS పవర్, 6000 rpm వద్ద 10.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్‌లో సింగిల్ ఛానల్ యాంటీ-క్లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ఉంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో 7 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ మోనో-షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి.
Hero Xtreme 125R Price : మార్కెట్లో ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ బైక్ ధర రూ.95,000 నుంచి రూ.99,500 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Honda Unicorn Features : ఈ హోండా యూనికార్న్ బైక్‌లో 162.7 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 12.91 PS పవర్, 5500 rpm వద్ద 14 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్‌లో సింగిల్ ఛానల్ యాంటీ-క్లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ఉంది.
Honda Unicorn Price : జపాన్ కంపెనీకి చెందిన ఈ హోండా యూనికార్న్ బైక్ ధర సుమారుగా రూ.1.10 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Bajaj Pulsar 150 Features : ఈ బజాబ్ పల్సర్ 150 బైక్‌లో 149.5 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ DTS-i ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ మోటార్ ఉంటుంది. ఇది 8500 rpm వద్ద 14 PS పవర్, 6500 rpm వద్ద 13.25 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌కు 47.5 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్‌లో సింగిల్ ఛానల్ యాంటీ-క్లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ఉంది. అలాగే ముందు వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.
Bajaj Pulsar 150 Price : మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్ 150 బైక్ ధర సుమారుగా రూ.1.10 లక్షల నుంచి రూ.1.15 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Bajaj Pulsar N150 Features : ఈ బజాబ్ పల్సర్ ఎన్150 బైక్‌లో 149.68 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8500 rpm వద్ద 14.5 PS పవర్, 6000 rpm వద్ద 13.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌కు 48 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్‌లో సింగిల్ ఛానల్ యాంటీ-క్లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ఉంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో 7 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ మోనో-షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి.
Bajaj Pulsar N150 Price : మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్ ఎన్150 బైక్ ధర సుమారుగా రూ.1.18 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మారుతి కార్ కొనాలా? ఆ మోడల్ కోసం 4 నెలలు వేచిచూడాల్సిందే!
రూ.70,000 బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా? టాప్-9 ఆప్షన్స్ ఇవే!