ETV Bharat / business

వాహనదారులకు గుడ్ న్యూస్​ - సార్వత్రిక ఎన్నికల తర్వాతే కొత్త టోల్‌ ఛార్జీలు! - Toll Tax Relief - TOLL TAX RELIEF

Toll Tax Relief : టోల్‌ ఛార్జీల పెంపును సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) జాతీయ రహదారుల ప్రాధికార సంస్థను (NHAI) ఆదేశించింది. దీనితో వాహనదారులకు కొంత మేర ఊరట లభించినట్లు అయ్యింది. పూర్తి వివరాలు మీ కోసం.

India puts on hold proposed hike in road toll charges
Toll Tax Relief
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 11:05 AM IST

Updated : Apr 2, 2024, 11:12 AM IST

Toll Tax Relief : వాహనదారులకు శుభవార్త. టోల్‌ ఛార్జీల పెంపును లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) జాతీయ రహదారుల ప్రాధికార సంస్థను (NHAI) ఆదేశించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విజ్ఞాపన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాత ఛార్జీలనే వసూలు చేయాలని టోల్‌ ఆపరేటర్లకు ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది.

క్లారిటీ కావాలి?
దేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 1న టోల్‌ ఛార్జీల పెంపు జరుగుతుంది. ఇలా పెంచిన టోల్ ట్యాక్స్​ సగటున 5 శాతం వరకు ఉంటుంది. అందుకే ఈ ఏడాది కూడా పెరిగిన ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ పెంపును వాయిదా వేయాలని ఈసీ సూచించింది. దీనితో ఏప్రిల్​ 1 నుంచి ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తాలను వాహనదారులకు వెనక్కి ఇచ్చేయనున్నట్లు NHAI వర్గాలు తెలిపాయి.

దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 26 నుంచి జూన్‌ 1 వరకు పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడతాయి. అయితే ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లో వెంటనే టోల్ ట్యాక్స్​ పెంపు అమల్లోకి వస్తుందా? లేదా సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తయ్యే వరకూ పాత ఛార్జీలే కొనసాగుతాయా అనే విషయంలో స్పష్టత లేదు.

వన్​ వెహికిల్​- వన్​ ఫాస్టాగ్​
One Vehicle One FASTag : వన్​ వెహికల్​- వన్​ ఫాస్టాగ్​ పాలసీ ప్రకారం, ఇకపై ఒక వాహనానికి ఒక ఫాస్టాగ్​ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్​లు ఉంటే, వాటిలోని లేటెస్ట్​ దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని మిగతా వాటన్నింటిన్నీ డీయాక్టివేట్​ చేస్తారు. ఇక దీని రీఛార్జ్​ విషయానికి వస్తే BBPS, UPI, నెట్​బ్యాంకింగ్​ ద్వారా ఫాస్టాగ్​ను రీఛార్జ్ చేసుకోవచ్చు. మీకు జారీ చేసే ఫాస్టాగ్​​ 5 ఏళ్ల వ్యాలిడిటీతో వస్తుంది. ఆ తర్వాత దాని వ్యాలిడిటీని పొడిగించుకోవచ్చు.

FASTag Without KYC Deactivate : జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మార్చి 31లోగా వాహనదారులు అందరూ తమ ఫాస్టాగ్ కేవైసీని అప్​డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఒక వేళ ఎవరైనా కేవైసీ అప్​డేట్​ చేయకపోతే ఫాస్టాగ్​ 2024 ఏప్రిల్​ 1 నుంచి వారి ఫాస్టాగ్​లు డీయాక్టివేట్ అయిపోయి ఉంటాయి. ఇలాంటి వారు వెంటనే కేవైసీ అప్​డేట్ చేసుకోవాలి. ​లేకుంటే వారి ఫాస్టాగ్​​ ఖాతాలో బ్యాలెన్స్​ ఉన్నప్పటికీ, దానితో పేమెంట్స్ చేయలేరు.

నకిలీ జీఎస్టీ బిల్లులను ఎలా గుర్తించాలి? ఎలా రిపోర్ట్ చేయాలి? - How To Identify A Fake GST Bill

బెస్ట్​ మైలేజ్ ఇచ్చే కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్​-5 మోడల్స్ ఇవే! - Best Mileage Cars In India 2024

Last Updated : Apr 2, 2024, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.