ETV Bharat / business

ఫస్ట్ టైమ్‌ ఇల్లు కొంటున్నారా? ఈ 8 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

మీరు ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ 'హోమ్ బయ్యింగ్' టిప్స్ మీ కోసమే!

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Home
House (ETV Bharat)

Tips For First Time Home Buyers : సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం జీవితాంతం సంపాదించిన డబ్బును ఇందుకోసం ఖర్చు చేస్తాం. లేదా బ్యాంకు నుంచి వడ్డీకి రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తాం. అందుకే ప్రాపర్టీ కొనుగోలు సమయంలో అడుగడుగునా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం. కనుక ఇంటిని కొనుగోలు చేసే ముందే దానికి సంబంధించిన అన్ని విషయాలను కచ్చితంగా వివరంగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. పక్కా ప్రణాళిక : మీ కలల ఇంటిని కొనుగోలు చేసే ముందు దానికి కావాల్సిన బడ్జెట్​ గురించి ఒక ప్రణాళిక వేసుకోవాలి. మీ బడ్జెట్‌ పరిమితిలోపు, మీ స్థోమతకు తగ్గ ఇంటిని వెతుక్కోవడం మంచిది. ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకున్నప్పుడు అనవసరపు ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవాలి. తద్వారా మీరు అనుకున్న బడ్జెట్​లోనే ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు వీలవుతుంది.
  2. అనువైన ప్రదేశం : చదువు, ఉపాధి కోసం మనం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి వస్తుంటాం. కనుక మనం వేగంగా బయటకు వెళ్లి, తిరిగి వేగంగా వచ్చేంత సమీపంలో ఇల్లు ఉండేలా చూసుకోవాలి. రోడ్డు సుదుపాయం, అన్ని రకాల రవాణా సౌకర్యాలు, పాఠశాలలు, బజారు అన్నీ మీ ఇంటికి దగ్గర్లోనే ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల భవిష్యత్‌లో ఇంటి విలువ బాగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేయడానికి ముందు, భవిష్యత్​లో బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అక్కడే మీ కలల ఇంటిని కొనుగోలు చేయాలి. లేదా కట్టుకోవాలి.
  3. కనీస వసతలు : మీ ఇంటికి త్రాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులు కీలకం. అవి సరిగ్గా లేనప్పుడు విశాలంగా ఉన్న ఇల్లు కూడా సౌకర్యాన్ని ఇవ్వదు. సమృద్ధిగా నీటి వసతి, పవర్‌ బ్యాకప్‌ సౌకర్యాలు ఉన్న ఇంటిని మాత్రమే కొనుగోలు చేయాలి. ప్రస్తుతం ప్రతి కుటుంబం వారి ఆర్థిక స్థితి మేరకు తగిన మోటారు వాహనాలను కలిగి ఉంటోంది. కనుక, ఇంటిని ఎంచుకునే సమయంలో తగినంత పార్కింగ్‌ ప్రదేశం​ ఉండేలా చూసుకోవాలి. రెసిడెన్షియల్‌ సొసైటీలో ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తే పార్కింగ్‌ సౌకర్యం డీల్‌లో భాగంగా వస్తుంది. మీ అవసరం, బడ్జెట్‌ ఆధారంగా అదనపు పార్కింగ్‌ స్థలాన్ని కొనుగోలు చేయొచ్చు. కొన్ని ఇండిపెండెంట్‌ ఇళ్లకు పార్కింగ్‌ సమస్య ఉంటుంది. కనుక ఇల్లు కొనుగోలు చేసే ముందు పార్కింగ్‌ గురించి కచ్చితంగా అడిగి తెలిసుకోవాలి.
  4. ముందే నిర్ణయించుకోవాలి : ఇంటిని కొనుగోలు చేయకముందే, నిర్మాణంలో ఉన్న ఇంటిని తీసుకోవాలా? లేదా సిద్ధంగా ఉన్న ఇంటిని తీసుకోవాలా? అనేది నిర్ణయించుకోవాలి. ఈ రెండింటి విషయంలో ఉన్న లాభనష్టాలను ముందే అంచనా వేసుకోవాలి. ఇంకా నిర్మాణం జరుగుతున్న ఇంటిని కొనుగోలు చేస్తే, మనకు నచ్చినట్లుగా డిజైన్ మార్పులు చేసుకోవచ్చు. అదే నిర్మాణం అయిన ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంటే ఇంటికి ఉండే అదనపు ఆకర్షణలు, లోటుపాట్లు వెంటనే తెలిసిపోతాయి. దీంతో ఆ ఇంటిని కొనుగోలు చేయాలా? వద్దా? అనే నిర్ణయం ముందే తీసుకోవడానికి వీలవుతుంది. అంతేకాదు పూర్తిగా నిర్మాణం అయిన ఇంటికి జీఎస్​టీ కూడా ఉండదు. ఇది ఆర్థికంగా కలిసి వచ్చే అంశం.
  5. బిల్డర్ల గత ప్రాజెక్టులను పరిశీలించాలి : ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనాలని నిర్ణయం తీసుకున్న తరువాత, డెవలపర్‌ విశ్వసనీయతను కూడా పరిశీలించాలి. ముఖ్యంగా వేర్వేరు బిల్డర్లు చేపట్టిన గత ప్రాజెక్టులను పరిశీలించాలి. వాటి నాణ్యత బాగుందా? లేదా? అనేది చెక్​ చేసుకోవాలి. సదరు బిల్డర్ల వద్ద ఇంతకు ముందు ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తులను సంప్రదించాలి. అప్పుడే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. సాధారణంగా బిల్డర్లు ప్రాజెక్ట్‌ పనుల్లో జాప్యం చేస్తుంటారు. కనుక మీ బిల్డర్​ గతంలో అలాంటి జాప్యాలు చేశాడా? జాప్యం జరిగిన దానికి ఫైన్ కట్టాడా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. కాస్త ఖర్చు ఎక్కువైనా మార్కెట్‌లో 'గుడ్‌విల్‌' ఉన్న బిల్డర్‌నే ఎంచుకోవాలి.
  6. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అప్రూవల్ : మీరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రాజెక్ట్‌కు 'రియల్​ ఎస్టేట్​ రెగ్యులేటరీ అథారిటీ' (రెరా) రిజిస్ట్రేషన్‌ ఉండాలి. అందుకే మీరు కొనాలని అనుకుంటున్న ఇల్లు లేదా ఫ్లాట్‌కు రెరా అప్రూవల్​ ఉందో లేదో పరిశీలించాలి. నిర్మాణ అడ్వర్టయిజ్​మెంట్లలో కూడా రియల్​ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నంబర్‌ ఉండాలి. రెరా తన వెబ్‌సైట్‌లో చాలా సమాచారాన్ని అందిస్తుంది. కనుక డెవలపర్​కు సంబంధించిన సమాచారం, ప్రాజెక్ట్‌ స్థితితో సహా ముఖ్యమైన వివరాలను మీరు యాక్సెస్‌ చేయవచ్చు. ఇందులో రిజిష్టర్‌ అయిన డెవలపర్లు ప్రతి 3 నెలలకు ఓసారి నిర్మాణ పురోగతిని అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌ రిపోర్ట్​లను అప్‌లోడ్‌ చేయకపోతే డెవలపర్లకు పెనాల్టీ తప్పదు. దీనివల్ల పారదర్శకతతో పాటు, కొనుగోలుదారులకు భద్రత లభిస్తుంది.
  7. అదనపు ఖర్చులు : ఇల్లు లేదా ఫ్లాట్​​ విలువ మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, స్టాంప్‌ డ్యూటీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఆయా ప్రదేశాలను అనుసరించి మారుతూ ఉంటాయి. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న లొకేషన్‌ ఆధారంగా ఎంత చెల్లించాలో తెలుసుకోవాలి. ఆస్తి కొనుగోలు విషయంలో నిపుణుల సూచనలు పాటించడం చాలా మంచిది. ఇది చాలా నష్టాలు, అవాంతరాలను నివారించడానికి, సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకుగాను రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీలకు, ల్యాండ్‌ సర్వేయర్‌, హోమ్‌ ఇన్‌స్పెక్టర్‌లకు కొద్ది మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆస్తి కొనుగోలులో అనేక లీగల్​ సంబంధిత అంశాలు ఉంటాయి. ప్రాపర్టీ కొనుగోలుకు అవసరమైన అన్ని చట్టాల గురించి అవగాహన ఏర్పరుచుకోవాలి. ఇందుకుగాను నోటరీలకు, లాయర్లకు, రియల్ ఎస్టేట్ నిపుణులకు కూడా డబ్బు చెల్లించాలి. నిర్మాణంలో ఉన్న ఇంటికి లేదా ఫ్లాట్‌కు జీఎస్‌టీని చెల్లించాలి. యూనిట్‌ ధర రూ.45 లక్షలు లోపు ఉంటే 1%, రూ.45 లక్షలు దాటితే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి యాజమానిగా, హక్కుదారుడిగా ప్రతి ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్‌ చెల్లించాలి.
  8. సేల్‌ డీడ్ : మీరు కొనుగోలు చేసిన ఆస్తికి ముఖ్యమైన ఆధారం సేల్​డీడ్​. ఇది ఆస్తి యాజమాన్య బదిలీని స్పష్టంగా పేర్కొంటూ విక్రేత ద్వారా కొనుగోలుదారుడికి బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొనుగోలుదారుడు ఆస్తికి చట్టబద్ధమైన యజమాని అవుతారు. ఈ పత్రం సబ్‌-రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ వద్ద నమోదవుతుంది. హోమ్‌లోన్‌ తీసుకునేటప్పుడు, రీ-సేల్‌ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. కనుక దాన్ని సురక్షితంగా భద్రపరచాలి. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు ఆర్థికపరమైన అంశాలే కాకుండా, అనేక న్యాయపరమైన అంశాలు కూడా ఉంటాయి. కొనుగోలుకు సంబంధించి రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణుల నుంచి, ఇలాంటి ఆస్తులను కొనుగోలు చేసినవారి నుంచి సలహాలు, సూచనలు పొందడం చాలా మంచిది.

హోమ్ లోన్ కోసం మంచి బ్యాంక్‌ను ఎంచుకోవాలా? ఈ టాప్‌-6 టిప్స్ మీ కోసమే!

హైదరాబాద్​లో ఇల్లు లేదా స్థలం కొనాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Property Buying Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.