Safety Driving Tips for AMT Cars : ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్లను ఎంచుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీని ప్రత్యేకత ఏమంటే.. అవసరాన్ని బట్టి మాన్యువల్‌గా గేర్లు మార్చుకుంటూ డ్రైవ్ చేయవచ్చు. అవసరం లేనపుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగిస్తూ వెళ్లొచ్చు. అయితే.. ఆటోమేటిక్ విధానాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు ఆటోమొబైల్ రంగ నిపుణులు. లేదంటే తీవ్ర నష్టాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఇంతకీ.. ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
AMT గేర్ బాక్స్ పనితీరు : AMT కార్లలో గేర్లు మనం వేయకుండానే వాటంతట అవే పడతాయి కాబట్టి.. వాటి గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది భావిస్తారు. కానీ.. ఏఎమ్‌టీ గేర్ బాక్స్ పనితీరు గురించి తెలుసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. మాన్యువల్, ఏఎమ్‌టీ రెండు ఒకేలా పనిచేస్తాయి. సాధారణంగా మాన్యువల్ పద్ధతిలో గేరు మార్చేటప్పుడు యాక్సిలరేషన్ తగ్గించి, క్లచ్ నొక్కి గేర్ ఛేంజ్ చేశాక యాక్సిలరేషన్ పెంచుతాం. అదే.. ఏఎమ్టీలో దానంతట అదే గేరు మార్చాలనుకుంటే.. యాక్సిలరేషన్ పై కాలు తీసి మళ్లీ పెడితే గేర్ ఛేంజ్ అవుతుంది. తగ్గించాలనుకుంటే పూర్తిగా యాక్సిలరేషన్ తీసేస్తే చాలు.
ఇంజిన్ ఆఫ్ చేయడంపై అవగాహన : చాలా మందికి మాన్యువల్ గేర్ బాక్స్ కార్ల మీద అవగాహన ఉంటుంది. కానీ.. ఏఎమ్‌టీ కార్లలో విషయంలో ఉండదు. ముఖ్యంగా.. క్లచ్, ఇంజిన్ ఆఫ్ చేసే విషయంలో సరైన అవగాహన లేక పొరపాట్లు చేస్తుంటారు. ఏఎమ్‌టీ కార్లలో ఇంజిన్ ఆఫ్ చేసే ముందు ట్రాన్స్‌మిషన్‌ను న్యూట్రల్‌లో ఉంచడం చాలా ముఖ్యం. ఇది ట్రాన్స్‌మిషన్‌ను దెబ్బతినకుండా కాపాడుతుంది.
అలర్ట్ : ఎండలు మండుతున్నాయ్ - మీ సీఎన్జీ కారును ఇలా కాపాడుకోండి! - CNG CAR SUMMER PRECAUTIONS
ట్రాఫిక్‌లో యాక్సిలరేషన్ యూజ్ చేయొద్దు : మీరు AMT కారు యూజ్ చేస్తున్నట్లయితే గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమిటంటే.. ట్రాఫిక్‌లో యాక్సిలరేషన్ వాడకపోవడం మంచిది. సాధారణంగా మ్యాన్యువల్ కారులో వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు పదే పదే గేర్లు మారుస్తూ యాక్సిలరేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ, అదే ఏఎమ్‌టీ కారులో వెళుతున్నప్పుడు అలా చేయొద్దంటున్నారు.
హ్యాండ్ బ్రేక్: సాధారణంగా బడ్జెట్ ధరలో లభించే ఆటోమేటెడ్ కార్లలో.. హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు క్లచ్ ఉండదు. దీంతో డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు కంట్రోల్ అవుతున్న ఫీల్ కలగకపోవచ్చు. ఆ టైమ్‌లో అవసరాన్ని బట్టి హ్యాండ్ బ్రేక్ వాడాల్సి ఉంటుందని మరిచిపోవద్దని సూచిస్తున్నారు.
ఓవర్‌టేక్ చేయొద్దు : ఆటోమేటిక్ కార్లను యూజ్ చేసే వారు.. ఓవర్‌టేక్ చేయడంపై అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే.. నార్మల్ కార్ల గేర్ బాక్స్‌తో పోల్చితే.. ఏఎమ్‌టీ గేర్ బాక్స్ అంత పవర్ఫుల్ కాదు. అంతేకాదు.. ఏఎమ్‌టీ కార్లు గేర్ ఛేంజ్ చేసుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. కాబట్టి.. ఇలాంటి టైమ్‌లో ఓవర్ టేక్ చేయడం ఇబ్బంది కావొచ్చు. ఎదురుగా వాహనాలు వస్తున్నట్టయితే మరింత సమస్య కావొచ్చు. కాబట్టి.. ఎదురుగా వెహికల్స్ రావట్లేదని నిర్ధారించుకున్న తర్వాతనే ఓవర్ టేక్ నిర్ణయం తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.
కారు రివర్స్ చేస్తున్నప్పుడు - ఈ విషయాలు మర్చిపోవద్దు - లేదంటే అంతే!