ETV Bharat / business

గుడ్ న్యూస్​ - తగ్గిన గ్యాస్​ సిలిండర్​ ధరలు - ఎంతంటే? - LPG Price July 1st 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 9:27 AM IST

Updated : Jul 1, 2024, 10:12 AM IST

LPG Price Cut News : చమురు మార్కెటింగ్ సంస్థలు కమర్షియల్​ గ్యాస్ సిలిండర్​ ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.30 వరకు ధర తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. పూర్తి వివరాలు మీ కోసం.

lpg price cut
LPG price cut news (ETV Bharat)

LPG Price Cut News : కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ వినియోగదారులకు గుడ్ న్యూస్​. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గిస్తూ ఆయిల్‌ మార్కెటింగ్​ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకు‌న్నాయి. హోటల్స్​, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.30 మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. జులై​ 1వ తేదీ నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన నేపథ్యంలో, దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.30 తగ్గి రూ.1646కు చేరుకుంది.

క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు!
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్​, మే, జూన్​ నెలల్లో కూడా వీటి ధరలు తగ్గించారు. తాజాగా మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడం గమనార్హం. కొత్త ధరల ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో గ్యాస్​ సిలిండర్​ ధరలు ఎలా ఉన్నాయంటే?

  • దిల్లీ - రూ.1646 (ఇంతకు ముందు రూ.1676)
  • ముంబయి - రూ.1599 (ఇంతకు ముందు రూ.1629)
  • కోల్​కతా - రూ.1757 (ఇంతకు ముందు రూ.1787)
  • చెన్నై - రూ.1810 (ఇంతకు ముందు రూ.1840)
  • హైదరాబాద్ - రూ.1873 (ఇంతకు ముందు రూ.1903)

డొమెస్టిక్ గ్యాస్​ సిలిండర్​ ధరల్లో మార్పు లేదు!
ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803గా ఉంది. అయితే ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం రూ.603కే ఇది లభిస్తుంది. ముంబయిలో ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50; చెన్నైలో రూ.818.50; హైదరాబాద్​లో రూ.855; విశాఖపట్నంలో రూ.812గా ఉంది.

ఎల్​పీజీ సిలిండర్​ ధరలను ఎలా, ఎక్కడ చెక్​ చేయవచ్చు?
How To Check LPG Gas Rate Online : ఎల్​పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే, ఇండియన్ ఆయిల్​ అధికారిక వెబ్​సైట్​​ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఇదే వెబ్​సైట్​లో ఎల్​పీజీ ధరలతోపాటు, జెట్​ ఫ్యూయెల్​, ఆటో గ్యాస్​, కిరోసిన్​ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.

Last Updated : Jul 1, 2024, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.