Noel Tata Master Stroke To Reliance And Nykaa : రతన్ టాటా వారసుడు నోయల్ టాటా - నేరుగా రిలయన్స్, హిందూస్థాన్ యూనిలివర్, నైకాకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. 'జూడియో బ్యూటీ' పేరుతో బ్యూటీ మార్కెట్లోకి అడుగుపెట్టారు. నోయల్ టాటా నేతృత్వంలోని 'ట్రెంట్'కు ఇప్పటికే దేశవ్యాప్తంగా 550 వరకు జూడియో స్టోర్స్ ఉన్నాయి. ఇప్పుడు వ్యాపార విస్తరణలో భాగంగా రిటైల్ విభాగంలో జూడియో బ్యూటీని ప్రవేశపెట్టారు.
తక్కువ ధరకే బ్యూటీ ప్రొడక్ట్స్
సాధారణంగా బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. అందుకే వీటిని సరసమైన ధరలకు అందించాలని నోయల్ టాటా నిర్ణయించారు. జూడియో బ్యూటీ బ్రాండ్‌ను మార్కెట్లోకి తెచ్చారు. దీనితో ఇప్పటికే ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న హిందూస్థాన్ యూనిలివర్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. అంటే హిందూస్థాన్ యూనిలివర్‌కు చెందిన ఎల్18, సుగర్ కాస్మోటిక్స్, హెల్త్ & గ్లో, కలర్బార్తో - జూడియో బ్యూటీ పోటీపడనుంది.
రిలయన్స్, నైకాకు మాస్టర్ స్ట్రోక్
ఇండియాలో ప్రీమియం, లగ్జరీ బ్యూటీ ప్రొడక్ట్స్ సెగ్మెంట్లో రిలయన్స్, నైకా, షాపర్స్ స్టాప్ ఉన్నాయి. ఈ కంపెనీల బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. ఇవి సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం తక్కువ. అందుకే సామాన్యుల(మాస్-మార్కెట్)ను టార్గెట్ చేసుకుని నోయల్ టాటా జూడియో బ్యూటీని తీసుకువచ్చారు. ఇప్పటికే బెంగళూరులో మొదటి జూడియో బ్యూటీ స్టోర్ ఓపెన్ చేశారు. త్వరలోనే గురుగ్రామ్, పుణె, హైదరాబాద్‌కు కూడా ఈ బిజినెస్‌ను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే జరిగితే ఇండియన్ బ్యూటీ మార్కెట్లో దిగ్గజ కంపెనీల మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
టాటా - బ్యూటీ లెగసీ
ఇండియన్ బ్యూటీ ఇండస్ట్రీలో టాటా గ్రూప్‌ది విడదీయరాని బంధం. వాస్తవానికి భారతదేశంలో మొదటి బ్యూటీ బ్రాండ్ 'లాక్మే' (Lakme)ను ప్రారంభించింది టాటా గ్రూప్. అయితే తరువాత దీనిని హిందూస్థాన్ యూనిలివర్‌కు అమ్మేసింది. అయినప్పటికీ బ్యూటీ ఇండస్ట్రీ నుంచి మాత్రం తప్పుకోలేదు. 'క్లిక్ పాలెట్' (Cliq Palette) పేరుతో ప్రీమియం కాస్మోటిక్ ప్లాట్‌ఫామ్‌ను నడుపుతోంది. ఇప్పుడు కొత్తగా నోయల్ టాటా జూడియో బ్యూటీ పేరుతో మాస్-మార్కెట్‌ను టార్గెట్‌ను టార్గెట్ చేశారు.
జూడియో సక్సెస్ స్టోరీ
ట్రెంట్‌కు చెందిన ప్రసిద్ధ బ్రాండ్ జూడియో. 2017లో ప్రారంభమైనప్పటి నుంచే ఇది సూపర్ సక్సెస్ అయ్యింది. దీని ప్రత్యేకమైన డిజైన్లతో కస్టమర్లను గొప్పగా ఆకట్టుకుంది. ఫలితంగా దీని గ్రాస్ మార్జిన్ చాలా వేగంగా 35-40 శాతం వరకు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జూడియోకు 559 వరకు స్టోర్లు ఉన్నాయి.
బ్యూటీ బ్రాండ్స్ గ్రోత్
ఇండియాలో సౌందర్య ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది. అందుకే ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లైన L'oreal, Shiseido లాంటివి ఇండియాలో బాగా ఆదరణ పొందుతున్నాయి. L'Orealకు ఉన్న అతిపెద్ద మార్కెట్లలో ఇండియా ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. ఇక Shiseido షాపర్స్ స్టాప్‌తో కలిసి భారత్‌లో నార్స్ కాస్మోటిక్స్ అనే ప్రీమియం బ్రాండ్‌ను నడుపుతోంది. ఒక రిపోర్ట్ ప్రకారం, 'ప్రస్తుతం భారత్‌లో మామా ఎర్త్, నివియా, నైకా, L'Oreal లాంటి బ్రాండ్లు 33 శాతం మార్కెట్ షేర్‌ను కలిగి ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో వీటి మార్కెట్ షేర్ 42 శాతం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక భారతీయ కంపెనీలైన హిందూస్థాన్ యూనిలివర్, ప్రోక్టర్ & గాంబుల్ మార్కెట్ షేర్ 2027 నాటికి 58 శాతానికి తగ్గే ఛాన్స్ ఉంది.' మరి ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లోకి ఎంటరైన టాటా బ్యూటీ బ్రాండ్ ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా నియామకం
'మీరు జీవితంలో గొప్పగా ఎదిగేందుకు!' - రతన్ టాటా డాక్యుమెంటరీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?