ETV Bharat / business

అదరగొట్టిన స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 1200 ప్లస్​ - స్టాక్ మార్కెట్ల అప్డేట్

Stock Markets Close Today January 29th 2024 : ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా మార్కెట్ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్ వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపర్లు మొగ్గుచూపిన వేళ దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1240 పాయింట్లు లాభపడి 71,941 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 385 పాయింట్ల లాభంతో 21,737 పాయింట్ల వద్ద సెషన్​ స్థిరపడింది.

stock markets today
stock markets today
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 3:53 PM IST

Updated : Jan 29, 2024, 4:24 PM IST

Stock Markets Close Today January 29th 2024 : ఆసియా మార్కెట్లలో సానుకూల పరిస్థితులు, రిలయన్స్ ఇండస్ట్రీస్​ వాటాలు కొనుగోలుకు మదుపర్లు మొగ్గుచూపిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 1240 పాయింట్లు లాభపడి 71,941 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 385 పాయింట్ల లాభంతో 21,737 పాయింట్ల వద్ద సెషన్​ స్థిరపడింది. సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం దాదాపు 2 శాతం లాభపడ్డాయి.

లాభాల్లో ఉన్న కంపెనీలు
రిలయన్స్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎల్​అండ్​టీ, కొటాక్ బ్యాంక్, టైటాన్, అల్ట్రాసెమ్కో, యాక్సిస్ బ్యాంక్, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ, విప్రో, భారతీ ఎయిర్​టెల్, హిందూస్థాన్ యూనిలివర్​, ఏషియన్ పెయింట్, ఇండస్ఇండ్ బ్యాంక్

నష్టాల్లో ఉన్న షేర్లు
టీసీఎస్​, టెక్​మహీంద్రా, ఇన్ఫోసిస్​, ఐటీసీ

రిలయన్స్ లాభాల పంట
Reliance Share Price Today : రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయ మార్కెట్లో సోమవారం రాణించింది. దాదాపు 7 శాతం లాభపడింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ సైతం రూ.19.56 లక్షల కోట్లు దాటింది. మార్కెట్‌ ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్ షేరు 6.80 శాతం లాభంతో రూ.2,890.10 వద్ద ముగిసింది.

లాభాల్లో ఆసియా మార్కెట్లు
మార్కెట్‌కు ఊతమిచ్చేలా చైనా చేపట్టిన చర్యల కారణంగా షాంఘై మార్కెట్లు మినహా మిగతా ఆసియా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. మరోవైపు ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిన నేపథ్యంలో యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు కొనుగోళ్ల సెంటిమెంట్‌కు కారణమైంది.

రూపాయి విలువ
Rupee Open 29 January 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.14గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 29 January 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.18 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 83.40.74 డాలర్లుగా ఉంది.

Last Updated : Jan 29, 2024, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.