ETV Bharat / business

వరుస లాభాలకు బ్రేక్​ - నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Stock Market Today - STOCK MARKET TODAY

Stock Market Today September 4, 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దీనితో నిఫ్టీ 50 పద్నాలుగు రోజుల రికార్డ్ ర్యాలీకి బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, మదుపరులు లాభాలు స్వీకరిస్తుండడమే ఇందుకు కారణం.

Share Market Today
Stock Market Today (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 9:49 AM IST

Updated : Sep 4, 2024, 3:44 PM IST

Stock Market Close : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దీనితో నిఫ్టీ 50 పద్నాలుగు రోజుల రికార్డ్ ర్యాలీకి బ్రేక్ పడింది.

చివరికి బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి 82,352 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 81 పాయింట్లు కోల్పోయి 25,198 వద్ద ముగిసింది.

  • లాభపడిన స్టాక్స్​ : ఏసియన్ పెయింట్స్​, హిందూస్థాన్ యూనిలివర్​, ఆల్ట్రాటెక్ సిమెంట్​, సన్​ఫార్మా, రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, నెస్లే ఇండియా
  • నష్టపోయిన షేర్స్​ : ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్​, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్​, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్​, టీసీఎస్​, బజాజ్ ఫైనాన్స్​

Stock Market Today September 4, 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీనితో నిఫ్టీ 50 సాధించిన 14 రోజుల రికార్డ్ లాభాలకు బ్రేక్​ పడినట్లు అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తీవ్ర ప్రతికూల సంకేతాలు వస్తుండడం, మదుపరులు లాభాలు స్వీకరిస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 377 పాయింట్లు నష్టపోయి 82,178 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయి 25,157 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఏసియన్ పెయింట్స్​, హిందూస్థాన్ యూనిలివర్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, బజాజ్ ఫైనాన్స్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఇన్ఫోసిస్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఎం అండ ఎం, ఎల్ అండ్ టీ, ఎస్​బీఐ, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్​, టీసీఎస్​, టాటా స్టీల్​

రికార్డ్ ర్యాలీకి బ్రేక్​
సెన్సెక్స్‌ రికార్డు లాభాల ర్యాలీకి మంగళవారం బ్రేక్​ పడింది. నిఫ్టీ మాత్రం వరుసగా 14వ రోజు కూడా లాభపడింది. కానీ మదుపరులు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్న నేపథ్యంలో దీనికి కూడా బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్​ అన్నీ భారీ నష్టాల్లో ​కొనసాగుతున్నాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు కూడా నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.1,029 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు.

రూపాయి విలువ
Rupee Open September 4, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.96గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices September 4, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.61 శాతం మేర తగ్గాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్​ క్రూడ్ ఆయిల్ ధర 73.30 డాలర్లకు చేరింది.

Last Updated : Sep 4, 2024, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.