ETV Bharat / business

దలాల్ స్ట్రీట్ ఢమాల్​ - సెన్సెక్స్​ 820 పాయింట్స్ డౌన్​

23,000 దిగువకు పడిపోయిన నిఫ్టీ - భారీగా నష్టపోయిన ఆటో, బ్యాంక్​, FMCG స్టాక్స్​

Stock Market
Stock Market (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2024, 3:48 PM IST

Stock Market Today November 12, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం మంచి లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు తరువాత తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. కానీ చివరికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలివెళ్తుండడం సహా; ఏసియన్​, యూరోపియన్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 820 పాయింట్లు నష్టపోయి 78,675 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి 23,883 వద్ద ముగిసింది.

  • లాభపడిన షేర్లు : సన్​ఫార్మా, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్​, రిలయన్స్​
  • నష్టపోయిన షేర్లు : ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఏసియన్ పెయింట్స్​, ఎస్​బీఐ, టాటా మోటార్స్​, మారుతి సుజుకి, పవర్​గ్రిడ్​, అదానీ పోర్ట్స్​, బజాజ్​ ఫైనాన్స్​, నెస్లే ఇండియా

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2,306.88 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2,026.63 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

అంతర్జాతీయ మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లోలో సియోల్​, టోక్యో, షాంఘై, హాంకాంగ్ అన్నీ నష్టాలతో ముగిశాయి. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం యూఎస్​ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.56 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 72.23 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ ఒక్క పైసా తగ్గింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.39గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.