ETV Bharat / business

పతనమైన స్టాక్ మార్కెట్లు - భారీగా నష్టపోయిన మెటల్​ షేర్లు! - Stock Market Today

Stock Market Today May 3, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 732 & నిఫ్టీ 172 పాయింట్స్ నష్టపోయాయి.

bull market
Stock market today (Etv Bharat Telugu Team)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 9:48 AM IST

Updated : May 3, 2024, 10:15 AM IST

Stock Market Close Today May 3, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 732 పాయింట్లు నష్టపోయి 73,878 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 172 పాయింట్లు కోల్పోయి 22,475 వద్ద ముగిసింది.

వాస్తవానికి ఉదయం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలను తాకింది. కానీ తరువాత క్రమంగా భారీ నష్టాల్లోకి జారిపోయింది. టెలికాం, క్యాపిటల్​ గూడ్స్​, టెక్, మెటల్​ స్టాక్స్​ భారీ పతనం కావడమే ఇందుకు కారణం.

  • లాభపడిన షేర్లు : బజాజ్ ఫైనాన్స్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఎం అండ్ ఎం, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇన్ఫోసిస్​
  • నష్టపోయిన షేర్లు : ఎల్​ అండ్ టీ, మారుతి సుజుకి, నెస్లే ఇండియా, రిలయన్స్​, భారతీ ఎయిర్​టెల్​, ఆల్ట్రాటెక్ సిమెంట్​

అంతర్జాతీయ మార్కెట్లు
హాంకాంగ్​ లాభాలతో, సియోల్ నష్టాలతో ముగిశాయి. టోక్యో, షాంఘై మార్కెట్లకు ఈ రోజు సెలవు. ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

ముడిచమురు ధర
Crude Oil Prices May 3, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.06 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 83.62 డాలర్లుగా ఉంది.

2.00 PM : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 1027 పాయింట్లు నష్టపోయి 73,587 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 260 పాయింట్లు కోల్పోయి 22,387 వద్ద కొనసాగుతోంది.

12.00 PM : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకుంటున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 638 పాయింట్లు నష్టపోయి 73,969 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 147 పాయింట్లు కోల్పోయి 22,501 వద్ద కొనసాగుతోంది.

11.00 AM : ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 280 పాయింట్లు నష్టపోయి 74,327 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 50 పాయింట్లు కోల్పోయి 22,597 వద్ద కొనసాగుతోంది.

Stock Market Today May 3, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే నిఫ్టీ 139 పాయింట్లు లాభపడి 22,787 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 429 పాయింట్లు లాభపడి 75,036 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 132 పాయింట్లు వృద్ధి చెంది 22,708 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : బజాజ్ ఫైనాన్స్​, బజాజ్ ఫిన్​సెర్వ్​, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​, టాటా స్టీల్​, విప్రో, యాక్సిస్ బ్యాంక్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​భారతీ ఎయిర్​టెల్​, మారుతి సుజుకి, ఎల్​ అండ్​ టీ, ఏసియన్ పెయింట్స్​, టెక్ మహీంద్రా

రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) బజాజ్​ ఫైనాన్స్​ కంపెనీపై విధించిన ఆంక్షలను ఇటీవలే ఎత్తివేసింది. దీనితో సదరు కంపెనీ షేర్లు 6 శాతం మేర లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ కంపెనీ తమ​ ఈకామ్​, ఇన్​స్టా ఈఎంఐ కార్డుల ద్వారా రుణాలు మంజూరు చేయడం, పంపిణీ చేయడంపై గతేడాది నవంబర్​లో ఆర్​బీఐ ఆంక్షలు విధించింది. ఇటీవలే ఆ ఆంక్షలను, పరిమితులను ఎత్తివేసింది. దీనితో సదరు కంపెనీ షేర్లు భారీగా లాభపడుతున్నాయి.

విదేశీ పెట్టుబడులు
FIIs In India : ఎక్స్ఛేంజ్​ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం రూ.964.47 కోట్ల విలువైన అమ్మేశారు.

ఆసియా మార్కెట్లు
Asian Markets Today May 3, 2024 : ఏసియన్ మార్కెట్లలో సియోల్​, హాంకాంగ్​ లాభాల్లో ట్రేడవుతున్నాయి. షాంఘై మాత్రం నష్టాల్లో కొనసాగుతోంది. గురువారం వాల్​ స్ట్రీట్​ లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

రూపాయి విలువ
Rupee Open May 3, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 9 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.37గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices May 3, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.33 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 83.95 డాలర్లుగా ఉంది.

పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today

బాగా డబ్బులు సంపాదించాలా? ఈ 'చక్రవడ్డీ' లెక్కలు తెలుసుకోండి! - POWER OF COMPOUNDING

Last Updated : May 3, 2024, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.