Stock Market Close : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డ్ లాభాలతో ప్రారంభమై, చివరికి నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా ఐటీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి 76,490 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 23,259 వద్ద ముగిసింది.
ఉదయం రికార్డ్ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు, ఆ తరువాత తీవ్రమైన ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరికి నష్టాలతో ముగిశాయి. దీనితో వరుస మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది.
- లాభపడిన షేర్లు : ఆల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్
- నష్టపోయిన షేర్లు : టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, టీసీఎస్
ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో టోక్యో లాభాలతో, సియోల్ నష్టాలతో ముగిశాయి. చైనా, హాంకాంగ్ మార్కెట్లకు ఇవాళ సెలవు. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.
ముడిచమురు ధర
Crude Oil Prices June 10, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.18 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 79.76 డాలర్లుగా ఉంది.
03.00 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 118 పాయింట్లు నష్టపోయి 76,579 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 13 పాయింట్లు కోల్పోయి 23,277 వద్ద కొనసాగుతోంది.
12.30 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2 పాయింట్లు నష్టపోయి 76,690 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 32 పాయింట్లు లాభపడి 23,322 వద్ద కొనసాగుతోంది.
11.00 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 87 పాయింట్లు నష్టపోయి 76,781 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 62 పాయింట్లు లాభపడి 23,351 వద్ద కొనసాగుతోంది.
10.45 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 101 పాయింట్లు లాభపడి 76,795 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 51 పాయింట్లు వృద్ధిచెంది 23,341 వద్ద కొనసాగుతోంది.
Stock Market Today June 10, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ మొదటిసారిగా 70,000 మార్క్ దాటింది. నిఫ్టీ ఎర్లీ ట్రేడింగ్‌లోనే రికార్డ్ హై లెవల్స్‌ను క్రాస్ చేసింది. అయితే తరువాత క్రమంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం తీవ్రమైన ఒడుదొడుకుల్లో షేర్ మార్కెట్లు కదలాడుతున్నాయి. ప్రధానంగా ఐటీ, మెటల్ షేర్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 107 పాయింట్లు నష్టపోయి 76,63 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 18 పాయింట్లు కోల్పోయి 23,272 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, టైటాన్, టాటా మోటార్స్, టీసీఎస్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హిందూస్థాన్ యూనిలివర్, పవర్‌గ్రిడ్
మోదీ 3.0 సర్కార్
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన కేబినెట్లో మొత్తం 72 మంది మంత్రులను నియమించుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఈ ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనుక ఇది కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో టోక్యో లాభాల్లో ట్రేడవుతుండగా, సియోల్ నష్టాల్లో కొనసాగుతోంది. శుక్రవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏకంగా రూ.4,391.02 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
రూపాయి విలువ
Rupee Open June 10, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 10 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.50గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices June 10, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.31 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 79.87 డాలర్లుగా ఉంది.
బంగారు నగలు కొనాలా? ఏపీ, తెలంగాణాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today
మీరు త్వరగా కోటీశ్వరులు కావాలా? 15x15x15 రూల్ ఫాలో అయిపోండి! - 15x15x15 Investing Rule