Stock Market Close : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 51 పాయింట్లు లాభపడి, జీవన కాల గరిష్ఠం 80,716 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 23 పాయింట్లు వృద్ధి చెంది, లైఫ్ టైమ్ హైలెవల్ 24,613 వద్ద ముగిసింది.
విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగడం; ఎఫ్ఎంసీజీ, టెలికాం సహా, కొన్ని ఐటీ షేర్లు రాణించిన నేపథ్యంలో వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు మూటగట్టుకున్నాయి.
లాభపడిన స్టాక్స్ : హిందూస్థాన్ యూనిలివర్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ
నష్టపోయిన షేర్స్ : కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, సన్‌ఫార్మా, టాటా మోటార్స్
నోట్ : మొహర్రం సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది.
ఆసియా మార్కెట్లు
Asian Markets July 16, 2024 : ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై లాభాలతో స్థిరపడగా, హాంకాంగ్ నష్టాలతో ముగిసింది. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
సోమవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే. వడ్డీ రేట్ల కోత కోసం, ద్రవ్యోల్బణం దిగివచ్చేంత వరకు వేచి చూడమని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించిన నేపథ్యంలోనే యూఎస్ మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి.
విదేశీ పెట్టుబడులు
FIIs Investment : స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏకంగా రూ.2,684.78 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
ముడి చమురు ధర
Crude Oil Prices July 16, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.80 శాతం మేర తగ్గాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 84.13 డాలర్లుగా ఉంది.
*******************
11.00 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 178 పాయింట్లు లాభపడి 80,840 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ 65 పాయింట్లు వృద్ధి చెంది 24,652 వద్ద ట్రేడవుతోంది.
Stock Market Today July 16, 2024 : వరుసగా మూడో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి. ఎర్లీ ట్రేడింగ్‌లో నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 24,650 వద్ద న్యూ ఆల్-టైమ్ రికార్డ్‌ను టచ్ చేసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరుగుతుండడం, యూఎస్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 175 పాయింట్లు లాభపడి 80,838 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ 59 పాయింట్లు వృద్ధి చెంది 24,645 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, హిందూస్థాన్ యూనిలివర్, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్, టైటాన్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్
రూపాయి విలువ
Rupee Open July 16, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.59గా ఉంది.
ఆసియా మార్కెట్లు
Asian Markets July 16, 2024 : ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో లాభాల్లో కొనసాగుతుండగా, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే. వడ్డీ రేట్ల కోత కోసం, ద్రవ్యోల్బణం దిగివచ్చేంత వరకు వేచి చూడమని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించిన నేపథ్యంలోనే యూఎస్ మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి.
విదేశీ పెట్టుబడులు
FIIs Investment : స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏకంగా రూ.2,684.78 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
ముడి చమురు ధర
Crude Oil Prices July 16, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.27 శాతం తగ్గాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 84.67 డాలర్లుగా ఉంది.
పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today
ఈ కాలేజ్ డ్రాపౌట్స్ 'కోటీశ్వరులు' అయ్యారు - ఎలాగో తెలుసా? - College Dropouts Billionaires