ETV Bharat / business

నిఫ్టీ @ 25,000- సెన్సెక్స్​ నయా రికార్డ్​- చరిత్రలో తొలిసారి - Stock Market Today

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 11:50 AM IST

Updated : Aug 1, 2024, 3:47 PM IST

Stock Market Today: స్టాక్​ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్​ టైమ్​ హై వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Today
Stock Market Today (Source: Getty Images)

Stock Market Today: స్టాక్​ మార్కెట్లు సరికొత్త శిఖరాలను తాకాయి. సెన్సెక్స్, నిఫ్టీ గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి ఆల్​ టైమ్​ హై లెవల్​ వద్ద స్థిరపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 126 పాయింట్లు పెరిగి 81 వేల 868 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 60 పాయింట్లు వృద్ధి చెంది 25 వేల 11 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 వేల పాయింట్ల ఎగువన ముగియడం చరిత్రలో ఇదే తొలిసారి. సెన్సెక్స్ ఈ ఉదయం చరిత్రలో తొలిసారి 82 వేల మార్కును దాటినా- చివరకు కాస్త తగ్గి, 81 వేల 868 వద్ద స్థిరపడింది.

జీవితకాల గరిష్ఠాలకు సెన్సెక్స్, నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ట్రేడయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ఓ దశలో 82,130 మార్కును తాకి, ఆల్​టైమ్​ హై రికార్డును నెలకొల్పింది. అలాగే జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 25,078 పాయింట్ల మార్కును తొలిసారి తాకింది.

  • లాభపడిన స్టాక్స్: పవర్ గ్రిడ్, మారుతి, ఆదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఎస్ బీఐఎన్, టైటాన్, హైచ్ డీఎఫ్ సీ, ఏషియన్ పెయింట్, హెచ్ సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంకు, రిలయన్స్ భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్
  • నష్టపోయిన షేర్స్​: బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫిన్ జర్వ్, టాటా స్టీల్, అల్ట్రా సెమ్కో, ఐటీసీ, కొటక్ బ్యాంకు, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా
  • నష్టాల్లో ఆసియా మార్కెట్లు: ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్ నష్టాల్లో ట్రేడవుతుండగా, సియోల్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు బుధవారం నికరంగా రూ.3,462.36 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఆ వ్యాఖ్యల ప్రభావం
వడ్డీ రేట్లపై ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా కదిలాయి. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం నుంచి కోలుకుని సాధారణ స్థితికి చేరుతుందని ఫెడ్ చీఫ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌ మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు.

ఆరు నెలలుగా దూసుకెళ్తున్న మార్కెట్లు
గత ఆరు నెలల వ్యవధిలో నిఫ్టీ 15 శాతానికి పైగా పెరిగింది. అదే సమయంలో సెన్సెక్స్ 14 శాతానికి పైగా వృద్ధి చెందింది. జులై 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నుంచి దేశీయ స్కాక్ మార్కెట్లు మరింత ఊపందుకున్నాయి.

  • ముడి చమురు ధర: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.8 శాతం పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 81.51 డాలర్లుగా ఉంది.

గుడ్ న్యూస్​ - తగ్గిన గోల్డ్​ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today

రిస్క్​ లేకుండా ఆదాయం సంపాదించాలా? 'సిల్వర్​ ETFs'పై ఓ లుక్కేయండి! - What Is Silver ETF

Last Updated : Aug 1, 2024, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.