ETV Bharat / business

స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్​ చేయాలనుకుంటున్నారా? ఈ ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోవాల్సిందే! - stock market basics for beginners

Stock Market Key Terms : స్టాక్ ​మార్కెట్లో బేసిక్స్​ నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా? కానీ ఏవిధంగా తెలుసుకోవాలో అర్థం కావట్లేదా? ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఆర్టికల్​లో స్టాక్​మార్కెట్​ ఎలా పనిచేస్తుందనే వివరాలతో పాటు ముఖ్యమైన పదాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.

Stock Market Key Terms
Stock Market Key Terms
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 10:25 PM IST

Updated : Feb 4, 2024, 10:53 PM IST

Stock Market Key Terms : కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి స్టాక్‌ మార్కెట్‌ కొంచం తికమకగా ఉంటుంది. కాబట్టి స్టాక్‌ మార్కెట్‌లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ పెట్టుబడిదారు అయినా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అన్ని కంపెనీలకూ తమ వ్యాపార నిర్వహణకు డబ్బు అవసరం. కొన్నిసార్లు వస్తువులు లేదా సేవలను విక్రయించడం ద్వారా వచ్చే లాభాలు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు సరిపోదు. కనుక కంపెనీలు బయటి వ్యక్తులను తమ కంపెనీలో కొంత పెట్టుబడి పెట్టమని ఆహ్వానిస్తాయి. ఈ విధంగా వచ్చిన పెట్టుబడుల ద్వారా వారు కంపెనీని సమర్థంగా, సజావుగా నిర్వహించగలరు. పెట్టుబడి పెట్టినందుకు ప్రతిఫలంగా కంపెనీలు సంపాదించే లాభంలో ఇన్వెస్టర్లు వాటా పొందుతారు.

స్టాక్ మార్కెట్‌ ఎలా పనిచేస్తుంది?
స్టాక్‌ మార్కెట్‌ ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అతిముఖ్యమైన అంశాల్లో ఒకటి. మార్కెట్‌ దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తుంది. కంపెనీలు మదుపర్లు తమ డబ్బును పెట్టుబడిగా పెట్టి స్టాక్‌ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్లు పొంది ప్రయోజనం పొందుతారు. కంపెనీలు వృద్ధి చెందినప్పుడు ఇన్వెస్టర్లకు లాభాలు చేకూరుతాయి. కంపెనీలకు లాభాలు పెరిగేకొద్దీ షేర్‌ హోల్డర్లకు లాభాలను పంచుతాయి. స్టాక్ మార్కెట్లో తరచూ వాడే కొన్ని పదాల గురించి తెలుసుకుందాం.

  • సెబీ
    సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) భారతీయ స్టాక్‌ మార్కెట్‌ను పర్యవేక్షించే నియంత్రణ సంస్థ. కంపెనీలు, మదుపర్లు, వ్యాపారులు, బ్రోకర్లు చేసే లావాదేవీలు, కార్యకలాపాలను పర్వవేక్షించడానికి ఏర్పాటయిన మార్కెట్‌ రెగ్యులేటరే సెబీ.
  • డీమ్యాట్‌
    డీమ్యాట్‌ లేదా డీమెటీరియలైజ్డ్‌ ఖాతా అని పిలుస్తుంటారు. ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లో కస్టమర్‌ షేర్లు, ఇతర సెక్యూరిటీలను కలిగి ఉండే సాధనం. డీమ్యాట్‌ ఖాతా ద్వారా కంపెనీ షేర్లను కొనడం లేదా అమ్మడం లాంటివి చేయొచ్చు. భారత్‌లో షేర్ మార్కెట్ లావాదేవీలు చేయాలంటే డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి.
  • స్టాక్‌ స్ప్లిట్‌
    కంపెనీకి సంబంధించిన ప్రస్తుత షేర్లను బహుళ షేర్లుగా విభజించే ప్రక్రియనే స్టాక్​ స్ప్లిట్​ అంటారు. ఉదాహరణకు ఒక కంపెనీ 1:4 స్టాక్‌ స్ప్లిట్‌ను ప్రకటిస్తే ప్రతి 1 షేరుకు పెట్టుబడిదారులు 4 అదనపు షేర్లను పొందుతారు.
  • బుల్‌/బేర్‌ మార్కెట్‌
    సాధారణంగా బుల్‌ మార్కెట్‌లో కంపెనీలు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తుంటాయి. బుల్‌ మార్కెట్‌ అంటే ఎక్కువ కాలం పాటు స్టాక్స్‌ ధరలు పెరుగుతూ ఉండడం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పుడు వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాంటి సందర్భాల్లో మార్కెట్లు మరింత వృద్ధి చెందుతాయి. బేర్‌ మార్కెట్లు ఆర్థిక వ్యవస్థలో మందగమనానిక తెలియజేస్తాయి. స్టాక్‌ మార్కెట్‌లో దీర్ఘకాలం పాటు ధర క్షీణత ఉంటే బేర్‌ మార్కెట్‌ ఉంటుంది. ఈ బేర్​మార్కెట్​ ఇది షేర్ల ధరలు స్థిరంగా పడిపోయే కాలాన్ని సూచిస్తుంది. ఒకే స్టాక్‌, సెక్టార్‌ ఒక సమయంలో బుల్లిష్‌గా, మరొక సమయంలో బేరిష్‌గా ఉండవచ్చు. ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా ప్రతికూల కార్పొరేట్‌ ఫలితాలు లాంటి అనేక అంశాలు బేర్‌ మార్కెట్‌ను ప్రేరేపించగలవు.
  • స్టాక్‌ బ్రోకర్‌
    షేర్ మార్కెట్లో నేరుగా కంపెనీ వద్ద షేర్లు కొనుగోలు చేసే విధానం లేదు. కాబట్టి దీని కోసం స్టాక్‌ బ్రోకర్‌ నియమితులై ఉంటారు. వీరు తమ క్లయింట్స్‌ కోసం షేర్లను కొనుగోలు చేయడం, విక్రయించడం లాంటి లావాదేవీలను అమలు చేసే పెట్టుబడి సలహాదారుడు/ఫ్లాట్‌ఫాం.
  • డివిడెండ్‌
    కంపెనీ లాభాలను ఆర్జించినప్పుడు దానిలో కొంత భాగాన్ని షేర్‌ హోల్డర్స్‌కు పంచుతాయి దీనినే డివిడెండ్​ అని పిలుస్తారు. లాభాలు ప్రకటించిన కంపెనీలు మదుపర్లకు స్వల్ప మొత్తంలో డివిడెండ్‌ను పంపిణీ చేస్తాయి. ఇది దీర్ఘకాలిక వాటాదారులకు ముఖ్యమైన ఆదాయ వనరు అని చెప్పొచ్చు. డివిడెండ్‌, కంపెనీ తన వాటాదారులకు అందించే నగదు లేదా బహుమతిని సూచిస్తుంది. డివిడెంట్‌ చెల్లింపులు నగదుగా, స్టాక్స్‌ లేదా వివిధ రూపాల్లో జారీ చేయొచ్చు.
  • బీఎస్‌ఈ/సెన్సెక్స్‌
    బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌ భారత్‌లోని అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌ దీనినే బీఎస్​ఈ అని పిలుస్తుంటారు. ఇది 1875లో నేటివ్‌ షేర్‌, స్టాక్‌ బ్రోకర్ల సంఘంగా స్థాపించారు. ఇది భారత్‌లోని తొలి స్టాక్‌ ఎక్స్చేంజ్‌. చిన్న, మధ్యస్థ సంస్థలకు ఈక్విటీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. బీఎస్‌ఈలో లిస్ట్‌ అయిన టాప్‌ 30 కంపెనీల పనితీరును కొలిచే స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్స్​నే సెన్సెక్స్‌ అంటారు. ఇది 100 బేస్‌ విలువతో 1979, ఏప్రిల్‌ 1న ప్రారంభమైంది.
  • ఎన్‌ఎస్‌ఈ/నిఫ్టీ 50
    దేశంలోనే స్క్రీన్‌ ఆధారిత లేదా ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ను అమలు చేసిన మొదటి నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌. వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎక్స్చేంజ్‌ ప్రకారం ఈక్విటీ ట్రేడింగ్‌ వాల్యూమ్‌ పరంగా ఇది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్చేంజ్‌. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు స్టాక్‌ ట్రేడింగ్‌ జరిగే ప్రధాన ప్లాట్‌ఫామ్స్‌. ఇక్కడ కొనుగోలుదారులు, అమ్మకందారులు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ సేవలను అందించే బ్రోకర్ల ద్వారా ఆర్డర్‌లు చేస్తారు. నిఫ్టీ 50/నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) లిస్ట్‌ అయిన టాప్‌ 50 కంపెనీల స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్స్‌. దీన్ని 1,000 బేస్‌ విలువతో 1996 ఏప్రిల్‌ 22న ప్రారంభించారు.
  • ప్రైమరీమార్కెట్‌/ఐపీఓ
    నిధులను సేకరించాలనుకునే కంపెనీలకు ప్రైమరీ మార్కెట్‌ లాంచ్‌ ప్యాడ్‌ లాంటిది. ఒక కంపెనీ తన షేర్లను మొదటిసారిగా ప్రజలకు జారీ చేయాలని నిర్ణయించినప్పుడు, అది ప్రాథమిక మార్కెట్‌ ద్వారా చేస్తుంది. ఈ షేర్ల జారీని ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)గా వ్యవహరిస్తుంటారు. కంపెనీలకు ఇది ఒక కీలకమైన దశ. ఐపీఓ ద్వారా ఒక సంస్థకు సంబంధించిన షేర్లను కొనుగోలు చేయొచ్చు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా సేకరించిన నిధులు నేరుగా కంపెనీకి వెళ్తాయి. కంపెనీ పెరుగుదలకు, విస్తరణకు ఈ నిధులు ఉపయోగపడతాయి. కంపెనీలు రుణాలను ఆశ్రయించకుండా తమ వ్యాపారాలకు గణనీయమైన మూలధనాన్ని ఐపీఓల ద్వారా సేకరించొచ్చు.
  • సెకండరీ మార్కెట్‌
    ఇక్కడ పెట్టుబడిదారులు కంపెనీల ప్రమేయం లేకుండా, బ్రోకర్ల సహాయంతో సెక్యూరిటీలలో లావాదేవీలు జరపొచ్చు దీనినే సెకండరీ మార్కెట్​ అంటారు. ఈ మార్కెట్‌ పెట్టుబడిదారులకు లిక్విడిటీని అందిస్తుంది. వారి షేర్లను సులభంగా నగదుగా మార్చుకునేలా చేస్తుంది.
  • బ్లూచిప్‌ స్టాక్స్‌
    ఇవి ఆర్థికంగా స్థిరంగా ఉన్న కంపెనీల ఈక్విటీ షేర్లు. నమ్మకమైన డివిడెండ్‌ చెల్లింపులు, బలమైన బ్యాలెన్స్‌ షీట్‌ హిస్టరీని కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా అధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను కలిగి ఉంటాయి. ఉదా: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు మొదలైనవి.
  • సర్క్యూట్‌ లిమిట్
    స్టాక్‌ ధర ఒక రోజులో పైకి/కిందకి కదలగల గరిష్ఠ శాతంనే సర్క్యూట్​ లిమిట్​ అంటారు. ఈ సర్క్యూట్‌ లిమిట్ 2-20% మధ్య ఉంటుంది. కొన్ని స్టాక్స్‌లో ఈ పరిమితిని స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఉదా: భారత్‌లో చాలా స్టాక్స్‌కు లిమిట్​ 10%. అంటే స్టాక్‌ ధర 10% కంటే పెరిగినా లేదా తగ్గినా, ట్రేడింగ్‌ నిలిపివేస్తారు.
  • స్టాప్‌ లాస్‌
    కొనుగోలు చేసిన షేర్ ధర పడుతున్నప్పుడు నిర్దిష్ట ధర కంటే తక్కువగా ఉంటే దాన్ని అమ్మడానికి పెట్టుబడిదారుడు ప్లేస్ చేసిన ఆర్డర్‌. ఉదాహరణకు, రూ.100 ధరతో స్టాక్‌ను కొనుగోలు చేసి, స్టాప్‌ లాస్‌ ఆర్డర్‌ను రూ.95కి సెట్‌ చేస్తే ఆ ధర వద్ద రాగానే బ్రోకర్ దాన్ని ఆటోమేటిక్‌గా విక్రయిస్తారు. దీనివల్ల నష్టం పరిమితంగా ఉంటుంది.
  • మార్జిన్‌ ట్రేడింగ్‌
    మార్జిన్‌ ట్రేడింగ్‌ అంటే స్టాక్స్‌ను కొనుగోలు చేయడానికి బ్రోకర్‌ నుంచి డబ్బు అప్పుగా తీసుకోవడం. ఉదాహరణకు ఇన్వెస్టర్​ రూ. 1 లక్ష విలువ గల మార్జిన్‌ ట్రేడింగ్‌ను ఉపయోగించవచ్చు అనుకుందాం. తాను రూ.50 వేలు చెల్లించి మిగతా రూ.50 వేలు బ్రోకర్‌ నుంచి అప్పుగా తీసుకోవచ్చు.

కొన్ని షేర్లకే పరిమితం కావొద్దు.. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ కింగ్ మీరే!

మార్కెట్ ఒడుదొడుకుల్లోనూ లాభాలు రావాలా?.. ఈ టిప్స్​ పాటించండి!

Last Updated : Feb 4, 2024, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.