ETV Bharat / business

ఆల్​-టైమ్ హై రికార్డ్​ల వద్ద ముగిసిన సెన్సెక్స్ & నిఫ్టీ!

Stock Market Close Today March 6th 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిశాయి.

share Market Close Today March 6th 2024
Stock Market Close Today March 6th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 3:56 PM IST

Updated : Mar 6, 2024, 4:28 PM IST

Stock Market Close March 6th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమై, భారీ లాభాలతో ముగిశాయి. స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్​ టైమ్​ హై రికార్డుల వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్​, ఐటీ రంగాలు రాణించడం సహా, యూరోపియన్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 408 పాయింట్లు లాభపడి 74,085 వద్ద ఆల్​-టైమ్ హైరికార్డుతో స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 177 పాయింట్లు వృద్ధి చెంది 22,474 జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిసింది.

  • లాభాల్లో కొనసాగున్న షేర్లు : కోటక్​ బ్యాంక్​, యాక్సిస్ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, సన్​ఫార్మా, టైటాన్​, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, ఐటీసీ, రిలయన్స్​
  • నష్టాల్లో కొనసాగుతున్న షేర్లు : ఎన్​టీపీసీ, మారుతి సుజుకి, పవర్​గ్రిడ్, టాటా మోటార్స్​, టాటా స్టీల్​, టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్​ ఫైనాన్స్​

ఆసియా మార్కెట్లు
Asian Markets Today March 6th 2024 : ఏసియన్ మార్కెట్లలో సియోల్​, టోక్యో, షాంఘై భారీ నష్టాలతో ముగిశాయి. హాంకాంగ్ మార్కెట్లు మాత్రమే లాభపడ్డాయి. యూఎస్​ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్లు మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి. ఈ ప్రభావం ఇండియన్ మార్కెట్లపైన పడింది.

విదేశీ పెట్టుబడులు
FIIs Investments In India : స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.574.28 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

రూపాయి విలువ
Rupee Value Today March 6th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 7 పైసలు పెరిగింది. అమెరికన్ డాలర్​తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.82.83గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Prices March 6th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.80 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్ ముడిచమురు ధర 82.59 డాలర్లుగా ఉంది.

అలర్ట్ - త్వరలో బంగారం ధర రూ.70వేలకు పెరిగే ఛాన్స్​ ​- కారణం ఏమిటంటే?

క్రెడిట్​ కార్డ్ యూజర్లకు గుడ్ న్యూస్​ - ఇకపై మీకు నచ్చిన కార్డ్​ను ఎంచుకోవచ్చు!

Last Updated : Mar 6, 2024, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.