Stock Market Close Today February 28th 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని సెక్టార్లు కూడా నష్టాలు మూటగట్టుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం సహా, విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 790 పాయింట్లు నష్టపోయి 72,304 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 247 పాయింట్లు కోల్పోయి 21,951 వద్ద స్థిరపడింది.
- లాభపడిన స్టాక్స్ : హిందూస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, టీసీఎస్
- నష్టపోయిన షేర్స్ : పవర్‌గ్రిడ్, మారుతి సుజుకి, విప్రో, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ
Paytm Shares Fall : బుధవారం పేటీఎం (వన్97 కమ్యునికేషన్స్ లిమిటెడ్) షేర్స్ 5 శాతం మేర నష్టపోయాయి. ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన తరువాత ఈ సంస్థ తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది.
Asian Stock Markets Today February 28th 2024 :
బుధవారం ఆసియా మార్కెట్లు అయిన టోక్యో, షాంఘై, హాంకాంగ్ నష్టాలతో ముగిశాయి. ఒక్క సియోల్ మాత్రమే స్వల్ప లాభాలతో స్థిరపడింది. మరోవైపు యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇవన్నీ ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
విదేశీ పెట్టుబడులు
FII Investments In India : స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,509 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.
ముడిచమురు ధరలు
Crude Oil Prices February 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.90 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82.90 డాలర్లుగా ఉంది.
రూపాయి విలువ
Rupee Open February 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.92గా ఉంది.
ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ - డీఏ పెంపునకు ముహూర్తం ఫిక్స్!
భారతీయ టూరిస్టులకు దుబాయి స్పెషల్ ఆఫర్ - ఒక్క వీసాతో 5 ఏళ్లు ఎంజాయ్ చేయొచ్చు!