Stock Market Close Today 10th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, మెటల్, ఎనర్జీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు సహా, దేశీయ ఆర్థిక వ్యవస్థపై మదుపరుల విశ్వాసం పెరుగుతుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడి మొదటిసారిగా 75,000 మార్క్ ఎగువన ముగిసింది; జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు వృద్ధి చెంది 22,753 వద్ద జీవన కాల గరిష్ఠాల వద్ద స్థిరపడింది.
- లాభపడిన స్టాక్స్ : ఐటీసీ, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్
- నష్టపోయిన షేర్స్ : మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సెర్వ్
విదేశీ పెట్టుబడులు
FIIs Investments : స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.593.20 కోట్ల విలువైన ఈక్విటీలు కొనుగోలు చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లు
Global Markets : ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై నష్టాలతో ముగియగా, హాంకాంగ్ మార్కెట్ లాభాలతో స్థిరపడింది. ఎన్నికల సందర్భంగా దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు ఇవాళ పనిచేయలేదు. ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్లు మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
రూపాయి విలువ
Rupee Open March April 10th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 12 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.19గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices April 10th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices April 10th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.18 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 89.58 డాలర్లుగా ఉంది.
మొదటిసారి కారు కొంటున్నారా? ఈ టాప్-10 సేఫ్టీ ఫీచర్స్ మస్ట్! - Top 10 Car Safety Features
అర్జెంట్‌గా మనీ కావాలా? ఆధార్ ఏటీఎంతో ఇంటి వద్దకే డబ్బులు - ఎలా అంటే? - Aadhaar ATM