ETV Bharat / business

ఐటీ స్టాక్స్​ ర్యాలీతో - రికార్డ్ లాభాలతో ముగిసిన సెన్సెక్స్ & నిఫ్టీ! - Stock Market Today

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 12:40 PM IST

Updated : Jul 12, 2024, 4:28 PM IST

Sensex, Nifty Hit Record High : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నూతన జీవన కాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. టీసీఎస్​ జూన్ త్రైమాసిక ఫలితాల్లో భారీ లాభాలను చూపడం, ఐటీ స్టాక్స్​ బాగా రాణించడమే ఇందుకు కారణం.

share market today
stock market today (Getty Images)

Sensex, Nifty Hit Record High : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నూతన జీవన కాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. ముఖ్యంగా బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 622 పాయింట్లు లాభపడి, జీవన కాల గరిష్ఠం 80,519 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 186 పాయింట్లు వృద్ధి చెంది, లైఫ్​ టైమ్ హైలెవల్​ 24,502 వద్ద ముగిసింది.

ఐటీ స్టాక్స్​ ర్యాలీ కొనసాగడం, టీసీఎస్​ జూన్ త్రైమాసిక ఫలితాల్లో భారీ లాభాలు చూపించడమే ఇందుకు కారణం. దీనికి తోడు ఇన్ఫోసిస్​, రిలయన్స్ షేర్లు రాణించడం కూడా మదుపరుల సెంటిమెంట్​ను మరింత బలపరిచింది.

  • లాభపడిన స్టాక్స్​ : టీసీఎస్​, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్ టెక్​, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్​, రిలయన్స్, బజాజ్​ ఫైనాన్స్​, ఎస్​బీఐ
  • నష్టపోయిన షేర్స్​ : మారుతి సుజుకి, ఏసియన్​ పెయింట్స్​, కోటక్ బ్యాంక్​, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, సన్​ఫార్మా,

ఇంట్రాడేలో బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 996 పాయింట్లు లాభపడి 80,893 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 276 పాయింట్లు వృద్ధి చెంది 24,592 వద్ద లైఫ్​ టైమ్​ పీక్స్​ను టచ్​ చేసింది.

అంతర్జాతీయ మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్ లాభాలతో ముగిశాయి. సియోల్​, టోక్యో మార్కెట్లు నష్టపోయాయి. గురువారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.

విదేశీ పెట్టుబడులు
FIIs Investments : స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,137.01 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు.

ముడి చమురు ధర
Crude Oil Prices : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.78 శాతం పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 86.13 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ
Rupee Open July 12, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 1 పైసా పెరిగింది. దీనితో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.52గా ఉంది.

క్రమంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today

ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కావాలా? ఆ 'బీమా పాలసీ' తీసుకోవడం మస్ట్​! - Critical Illness Insurance Benefits

Last Updated : Jul 12, 2024, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.