ETV Bharat / business

సెకండ్ హ్యాండ్​ బైక్​ కొంటున్నారా? ఈ 6 డాక్యుమెంట్స్ తప్పనిసరి! - pre owned bike documents required

Second Hand Bike Documents Required : మీరు సెకండ్​ హ్యాండ్ బైక్​ కొంటున్నారా? అయితే ఇది మీ కోసమే. సెకండ్ హ్యాండ్​ బైక్​ చక్కగా పనిచేస్తుందా? లేదా? అని చూస్తే సరిపోదు. దీనితోపాటు ఆ బైక్​కు సంబంధించిన పత్రాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేదో చూసుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్​లో సెకండ్ హ్యాండ్ బైక్​ కొనేముందు చెక్​ చేసుకోవాల్సిన 6 కీలకమైన పత్రాలు గురించి తెలుసుకుందాం.

Second Hand Bike Documents Required
Second Hand Bike Documents Required
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 11:46 AM IST

Second Hand Bike Documents Required : సాధారణంగా కొంత మంది పాత బైక్​లను కొనుగోలు చేస్తుంటారు. బైక్​ కొనుగోలు చేసేటప్పుడు ఇంజిన్​, బ్రేకులు, టైర్లు ఇలా అన్ని సరిగా ఉన్నాయా? లేదా? అని చూస్తుంటారు. ఇది మంచిదే. అయితే వీటితో పాటు ఆ బైక్​కు సంబంధించిన యాజమాన్య బదిలీ కూడా అత్యంత కీలకమైనదని దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే బైక్​ అధికారికంగా మీకు సొంతం అవుతుంది. మరి బైక్​ ఓనర్​షిప్ బదిలీ కోసం ఏయే డాక్యుమెంట్లు అవసరమవుతాయి?. రిజిస్ట్రేషన్​ కోసం ఏయే పత్రాలు మీ వద్ద ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్​సీ) తప్పనిసరి
RC Book (Registration Certificate) : సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా చెక్​ చేయాల్సింది ఆ బైక్​కు ఆర్​సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్​) ఉందా? లేదా? అని. ఆర్​సీ ఉంటే ఆ బైక్​కు రిజిస్ట్రేషన్ అయిందని అర్థం. బైక్ యాజమాన్య హక్కుల్ని మరొకరి పేరుమీద మార్చాలంటే ఆర్టీవో ఆఫీసులో ఈ డాక్యుమెంట్​ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అందువల్ల మీరు పాత బైక్​ను వేరొకరి నుంచి కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆర్​సీని ఇవ్వమని అడగండి.

ఆర్​సీ బుక్​లో అమ్మకందారు పేరు, బైక్​ నంబరు, ఇంజిన్ నంబరు, ఛాసిస్ నంబర్​ సహా కీలక వివరాలు ఉంటాయి. ఒక వేళ అమ్మిన వ్యక్తి బ్యాంక్ లోన్ తీసుకుని బైక్​ను కొన్నట్లు అయితే, ఆర్​సీ బుక్​పై బ్యాంక్ స్టాంప్ ఉంటుంది. అలాంటప్పుడు బ్యాంకు నుంచి ఫారమ్​ 35తో పాటు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్​ను పొందాలి. అప్పుడే లోన్​ మొత్తం చెల్లించనట్లు మీకు ఆధారం లభిస్తుంది.

ఇన్సూరెన్స్​ సర్టిఫికెట్
Insurance Certificate : మోటారు వెహికల్ రూల్స్ ప్రకారం, అన్ని వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఉండాలి. ఒక వేళ మీరు కొన్న వాహనానికి ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ లేకపోయినట్లయితే ఆర్టీఓ ఆఫీస్​లో ఆ బైక్​ రిజిస్ట్రేషన్ అవ్వలేదని అర్థం. అందువల్ల మీరు పాతబైక్​ను ఇతరుల నుంచి కొనుగోలు చేసేటప్పుడే ఇన్సూరెన్స్​ సర్టిఫికెట్​ ఇవ్వమని వారిని అడగండి. తరువాత బీమా కంపెనీలతో సంప్రదించి, మీ పేరు మీద ఇన్సూరెన్స్​ను మార్చుకోండి. నేడు ఆన్​లైన్​లో కూడా సులభంగా బైక్​ ఇన్సూరెన్స్​కు అప్లై చేసుకోవచ్చు.

పొల్యూషన్ సర్టిఫికెట్
PUC Certificate : సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా పరిశీలించవలసిన మరో ముఖ్యమైన డాక్యుమెంట్ పొల్యూషన్ సర్టిఫికెట్. దీనినే పీయూసీ(పొల్యూషన్ అండర్​ కంట్రోల్ సర్టిఫికెట్ ఫర్ బైక్)గా వ్యవహరిస్తుంటారు. బైక్​ నుంచి కాలుష్య కారకాలు ఎంత వరకు విడుదల అవుతున్నాయి? ఇవి కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు లోబడి ఉన్నాయా? లేదా? అని చెక్ చేసి పొల్యుషన్(పీయూసీ) సర్టిఫికెట్ ఇస్తారు. పొల్యుషన్ చెక్​ చేసి సర్టిఫికెట్​లను జారీ చేసేందుకు దేశవ్యాప్తంగా పలుచోట్ల సెంటర్లు ఉన్నాయి.

పొల్యుషన్ సర్టిఫికెట్​లో ఈ కింది వివరాలు ఉంటాయి

  • లైసెన్స్​ ప్లేట్ నంబర్
  • సర్టిఫికెట్ క్రమ సంఖ్య
  • టెస్ట్​ చేసిన తేదీ
  • పొల్యుషన్ టెస్ట్​కు గడువు తేదీ
  • టెస్ట్ రీడింగ్​లు

సేల్స్ రిసిప్ట్
ఒక వేళ మీరు సెకండ్ హ్యాండ్ బైక్​ను​ డీలర్​ వద్ద కొనుగోలు చేస్తున్నట్లయితే సేల్స్ రశీదును తీసుకోవడం మర్చిపోవద్దు. అమ్మకందారు, కొనుగోలుదారుల సంతకాలు ఆ సేల్స్​ రిసిప్ట్​పై ఉంటాయి. దీనిలో సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్​ ట్యాక్స్​, యాడ్​-ఆన్ వివరాలు కూడా పొందుపరిచి ఉంటాయి.

రోడ్ ట్యాక్స్ సర్టిఫికెట్
సెకండ్ హ్యాండ్ బైక్​లను కొనుగోలు చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం రోడ్​ ట్యాక్స్ సర్టిఫికెట్. మీరు బైక్​ కొనుగోలు చేస్తున్నప్పుడే ఈ రోడ్​ ట్యాక్స్ సర్టిఫికెట్​ను ఇవ్వమని కోరాలి. ఈ సర్టిఫికెట్​లో రోడ్​ ట్యాక్స్​కు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ సర్టిఫికెట్​ను రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధిత ఆర్టీవోకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రోడ్​ ట్యాక్స్ సర్టిఫికెట్ ఉంటే, సదరు బైక్​పై ఎలాంటి బకాయిలు లేవు అని అర్థం అవుతుంది.

ట్రాన్స్​ఫర్​ డీడ్​
ఇతరుల నుంచి పాత బైక్​ను కొనుగోలు చేసినప్పుడు ట్రాన్స్​ఫర్ డీడ్​ను పొందడం తప్పనిసరి. ఎందుకంటే ఆ వాహన అమ్మకందారు నుంచి యాజమాన్య హక్కు బదిలీ జరిగినప్పుడు మాత్రమే అది మీ స్వంతం అవుతుంది. ఈ ట్రాన్స్​ఫర్​ డీడ్​లో బైక్​ రిజిస్ట్రేషన్ నంబర్, ఇంజిన్ నంబర్​, ఛాసిస్ నంబర్​, ఇరుపార్టీల ఐడీ ప్రూఫ్స్​, చిరునామాలు ఉంటాయి. ఈ డీడ్​పై రెవెన్యూ స్టాంప్​​ అంటించి ఇరు పార్టీలు సంతకం చేయాల్సి ఉంటుంది. దీనిని రెండు కాపీలు తీసి, ఒకటి బయ్యర్ దగ్గర, మరొకటి సెల్లర్ దగ్గర ఉంచుకోవాలి. అప్పుడే భవిష్యత్​లో ఎలాంటి న్యాయవివాదాలు తలెత్తినా, మనం సేఫ్​గా ఉండవచ్చు.

కాలేజ్​ స్టూడెంట్స్ స్పెషల్​ - రూ.1.5 లక్షల బడ్జెట్లోని టాప్-10 బైక్స్ ఇవే!

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ బెనిఫిట్ల గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.