SEBI Free Investor Certification Programme : స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (NISM)తో కలిసి పెట్టుబడిదారుల కోసం 'ఫ్రీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది. ఇందులో వ్యక్తిగత పెట్టుబడిదారులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం స్టడీ మెటీరియల్ కూడా పూర్తి ఉచితంగా అందిస్తారు. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ అందిస్తారు.
ఈ సర్టిఫికేషన్ వల్ల కలిగే లాభాలు ఇవే!
SEBI Investor-Certificate Benefits : ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ వల్ల సాధారణ పెట్టుబడిదారులు స్వచ్చందంగా మార్కెట్లు, పెట్టుబడుల విషయంలో తమ విజ్ఞానాన్ని పరీక్షించుకునేందుకు వీలవుతుంది. ఇండియన్ సెక్యూరిటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం గురించి సమగ్ర జ్ఞానాన్ని పొందడానికి వీలవుతుంది. కనుక ఆసక్తి ఉన్నవాళ్లు investor.sebi.gov.in లేదా https://www.nism.ac.in/sebi-investor-certification-examination వెబ్సైట్లోకి వెళ్లి, దీని కోసం అప్లై చేసుకోవచ్చు.
'డిజిటల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌లో ఇదొక ముందడుగు'
'సెక్యూరిటీస్ మార్కెట్లో డిజిటల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌ను పెంపొందించేందుకు ఈ కొత్త సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించాం. ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ ఆన్లైన్ పరీక్ష వల్ల మార్కెట్ లాభ, నష్టాల గురించి మదుపరుల్లో ఒక అవగాహన ఏర్పడుతుంది. భవిష్యత్‌లో తమ పెట్టుబడులను సరైన మార్గంలో పెట్టుకోవడానికి వీలవుతుంది' అని సెబీ అధికారి అనంత్ నారాయణ్ తెలిపారు.
పరీక్షలో అడిగే అంశాలు ఇవే!
- ఆర్థిక రంగం ప్రాథమిక భావనలు. అంటే పొదుపు, పెట్టుబడి, బడ్జెట్, ద్రవ్యోల్బణం మొదలైన వాటిపై అవగాహన ఉండాలి.
- వివిధ ప్రభుత్వ పథకాల గురించి తెలిసి ఉండాలి.
- ప్రైమరీ, సెకండరీ మార్కెట్లతో సహా సెక్యూరిటీస్ మార్కెట్‌పై అవగాహన కలిగి ఉండాలి.
- స్టాక్ ఎక్స్ఛేంజ్లు, డిపాజిటరీలు, నియంత్రణ సంస్థల గురించి అవగాహన ఉండాలి.
- క్రెడిట్ రిస్క్, మార్కెట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్ వంటి పెట్టుబడికి సంబంధించిన రిస్క్‌ల గురించి తెలుసుకోండి.
- రిస్క్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్‌పై అవగాహన కలిగి ఉండాలి.
- పెట్టుబడి పద్ధతుల్లో తగిన శ్రద్ధ, నైతిక ప్రవర్తన, పారదర్శకత ప్రాధాన్యతల గురించి తెలుసుకోవాలి.
- పెట్టుబడిదారుల హక్కులు, బాధ్యతలు, వివాద పరిష్కారాలు గురించి అవగాహన కలిగి ఉండాలి.
స్మాల్/ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? జర జాగ్రత్త - ఎందుకంటే?
జంషెడ్జీ నుంచి మాయ వరకు - టాటా ఫ్యామిలీ చేసిన వ్యాపారాలివే! - TATAs Business Journey