ETV Bharat / business

మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే ఈ 8 లాభాలు గురించి తెలుసుకోండి! - Advantages Of Savings Account

Savings Account Benefits : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్​ ఉంటోంది. కొందరికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉంటున్నాయి. మరి ఈ సేవింగ్స్​ అకౌంట్స్​ వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుసా?

Savings Account Benefits
Savings Account Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 3:40 PM IST

Savings Account Benefits : సాధారణ ప్రజలు తమ డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులో పొదుపు ఖాతా (సేవింగ్స్ అకౌంట్)ను తెరుస్తారు. దీని వల్ల ఖాతాదారుల డబ్బుకు రక్షణ ఉంటుంది. పైగా వడ్డీ రూపంలో రాబడి వస్తుంది. అంతేకాదు ఈ పొదుపు పథకం ద్వారా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. లిక్విడిటీ : సేవింగ్స్​ అకౌంట్​లో చాలా కీలకమైన సదుపాయం లిక్విడిటీ. దీని ద్వారా ఖాతాదారుడు బ్యాంకులో డిపాజిట్​ చేసిన తన డబ్బును ఏ సమయంలోనైనా నిర్దిష్ట పరిమితి వరకు విత్​డ్రా చేసుకోవచ్చు. సీనియర్‌ సిటిజన్లకు, ఉద్యోగులకు ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఎమర్జెన్సీ ఫండ్​ను కూడా ఈ పొదుపు ఖాతా ద్వారా నిర్వహించుకోవచ్చు. బ్యాంకు పొదుపు ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బును ఉపసంహరించుకునేటప్పుడు చెక్కులను వాడవచ్చు. అంతేకాకుండా అకౌంట్ ఓపెనింగ్​ సమయంలోనే బ్యాంకు మీకు ఏటీఎం కార్డును అందజేస్తుంది. ఈ ఖాతాలో ఉన్న నగదును బ్యాంకు పని వేళల్లోనే కాకుండా, మీకు నచ్చినప్పుడు ఏటీఎం కేంద్రాలకు వెళ్లి కావాల్సినంత ఉపసంహరించుకోవచ్చు. మీ సేవింగ్స్ అకౌంట్​కు నామినీని కూడా ఎంచుకోవచ్చు. బ్యాంకులు కొన్ని ఎంపికచేసిన పొదుపు ఖాతాలకు అంతర్జాతీయ డెబిట్‌ కార్డులను కూడా అందిస్తున్నాయి. వీటిని ఉపయోగించి విదేశాల్లోని ఏటీఎంల నుంచి ఉచితంగా నగదును విత్​డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
  2. అటు భద్రత- ఇటు రాబడి : బ్యాంకు లావాదేవీలు చాలా పారదర్శకంగా ఉంటాయి. పొదుపు ఖాతాలోని మీ నగదు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బ్యాంకు కార్యకలాపాలను ఆర్​బీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. పొదుపు ఖాతా ఉన్నవారికి అనేక బ్యాంకులు తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా సౌకర్యాన్నీ కూడా అందిస్తాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు సంబంధించిన పొదుపు ఖాతాలపై రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది. చాలా వరకు బ్యాంకులు తమ సేవంగ్స్​ ఖాతాలపై 2.50 నుంచి 3 శాతం వడ్డీని ఇస్తుంటాయి. అయితే, కొన్ని డిజిటల్‌ సేవింగ్స్‌ ఖాతాలు ప్రజలను ఆకర్షించడానికి 7% వరకు కూడా వడ్డీని ఇస్తున్నాయి.
  3. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్​ : ప్రస్తుతం బ్యాంకులు పొదుపు ఖాతాతో పాటు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సౌలభ్యాన్ని తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఇది బ్యాంకు ఖాతా నిర్వహణను చాలా సులువు చేసింది. ఫలితంగా ఖాతాదారులు బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లకుండానే, తాము ఉంటున్న చోటు నుంచే ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే ఫిక్స్‌డ్‌, రికరింగ్‌ డిపాజిట్లను కూడా ఓపెన్ చేసుకోవచ్చు. చెక్‌ బుక్‌ కోసం కూడా ఆన్‌లైన్‌లోనే అప్లై చేయవచ్చు.
  4. మొబైల్​ బ్యాంకింగ్​ : ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు మొబైల్‌ యాప్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. సంబంధిత బ్యాంకు మొబైల్‌ అప్లికేషన్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లోనే మీ ఖర్చులను ట్రాక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ మీ డెబిట్‌ కార్డు అపహరణకు గురయినా, పోగొట్టుకున్నా లేదా అనధికారికంగా ఎవరైనా వాడినా, కార్డును తాత్కాలికంగా యాప్​ ద్వారానే బ్లాక్‌ లేదా అన్‌బ్లాక్‌ చేయవచ్చు.
  5. యూపీఐ పేమెంట్స్​ : ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం లాంటి ప్రముఖ డిజిటల్‌ వాలెట్లను కూడా మీ బ్యాంకు సేవింగ్స్​ అకౌంట్​కు లింక్‌ చేసుకోవచ్చు. దీని సాయంతో మీ ఆన్​లైన్​ చెల్లింపులను సులభంగా నిర్వహించవచ్చు. చాలా బ్యాంకులు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవలను అందిస్తున్నాయి. వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ (వీపీఏ)ను ఉపయోగించి తక్షణమే డబ్బు పంపడానికి లేదా స్వీకరించడానికి అవకాశం కల్పిస్తున్నాయి.
  6. రుణ సౌకర్యం : ఏదైనా బ్యాంకులో మీరు సేవింగ్స్​ అకౌంట్​ను తెరిచి, దానిని మెరుగైన నగదు నిల్వలతో నిర్వహిస్తూ ఉంటే,​ అత్యవసర సందర్భాల్లో మీకు కావాల్సిన వ్యక్తిగత రుణం పొందడానికి వీలవుతుంది. వ్యక్తిగత రుణమే కాకుండా వెహికల్‌ లోన్స్‌, గోల్డ్​ లోన్స్​, ఎడ్యుకేషన్​ లోన్స్​ను కూడా పొందేందుకు పొదుపు ఖాతా ఎంతగానో దోహదం చేస్తుంది. రుణాల మంజూరు విషయంలో సేవింగ్స్ అకౌంట్​ ఉన్న ఖాతాదారులకు బ్యాంకులు అత్యంత ప్రాధాన్యతను ఇస్తాయి.
  7. రివార్డ్‌ పాయింట్లు : అనేక బ్యాంకులు పొదుపు ఖాతాతో వ్యాల్యూ బేస్డ్​ సర్వీసెస్​ సహా ఇతర బెనిఫిట్స్​ను అందిస్తాయి. ఈ ఖాతాతో వచ్చే డెబిట్‌ కార్డులు షాపింగ్‌ చేసే సమయంలో బాగా ఉపయోగపడతాయి. ఈ డెబిట్‌ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్స్​, రివార్డు పాయింట్స్​ పొందవచ్చు. భారతీయ బ్యాంకులు జారీ చేసే నిర్దిష్ట డెబిట్‌ కార్డులపై ప్రయాణ బీమా, సహా పలు బెనిఫిట్స్ లభిస్తాయి.​ కొన్ని బ్యాంకుల డెబిట్‌ కార్డులు కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌, లైఫ్‌స్టైల్‌ ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందిస్తుంటాయి.
  8. పిల్లలకు ఖాతా : 10-18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం ప్రత్యేకమైన పొదుపు ఖాతాలు ఉంటాయి. ఈ ఖాతాలను పిల్లల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు పర్యవేక్షించవచ్చు. ఈ అకౌంట్​లో ఇ-మెయిల్‌ స్టేట్‌మెంట్‌, బ్యాలెన్స్‌ ఎంక్వైరీలు, పాస్‌బుక్‌, ఏటీఎం కార్డు, డెయిలీ విత్​డ్రా లిమిట్స్సహా పలు సదుపాయాలు ఉంటాయి. పిల్లల పేరు మీద ఈ పొదుపు ఖాతాలను తెరవడం ద్వారా, వారికి బ్యాంకు అకౌంట్​ను ఎలా నిర్వహించాలో తెలుస్తుంది. దీని ద్వారా ఆర్థిక నిర్వహణతో పాటు డబ్బు విలువను, దాని ప్రాధాన్యతను తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా చిన్న వయస్సులోనే పొదుపు చేయాలనే అభిలాష ఏర్పడుతుంది. ఇది వారి భవిష్యత్​కు ఆర్థిక భద్రతను అందిస్తుంది.

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే?

రిటైర్మెంట్​ తర్వాత మనిషికి ఎంత డబ్బు అవసరం? సెబీ క్యాలుకులేటర్​తో సింపుల్​గా అంచనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.