ETV Bharat / business

మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కారు కొనాలా? 5-స్టార్ రేటింగ్ ఉన్న టాప్​-3 సెడాన్స్​ ఇవే! - Skoda Slavia safety features

Safest Sedan Cars In India 2024 List : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? మంచి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండాలా? అయితే ఇది మీ కోసమే. గ్లోబల్ ఎన్​సీఏపీ 5-స్టార్ రేటింగ్ ఉన్న 3 బెస్ట్ సెడాన్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

sedan car safety features
5 star rating sedan cars
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 5:08 PM IST

Safest Sedan Cars In India 2024 List : సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఎస్​యూవీ కార్లు ముందు ఉంటాయి. కానీ ఓ మూడు సెడాన్ కార్లు ఎస్​యూవీల కంటే మెరుగైన సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉన్నాయి. అవే ఫోక్స్​వ్యాగన్​ వర్టిస్​, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా. వీటికి గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్​ ప్రోగ్రామ్ (GNCAP) 5-స్టార్ రేటింగ్ ఉంది. అందుకే ఈ బెస్ట్​ సేఫ్టీ-రేటెడ్​ కార్లపై ఓ లుక్కేద్దాం రండి.

5 Star Rating Sedan Cars :

1. Volkswagen Virtus Safety Features : ఈ ఫోక్స్​వ్యాగన్​ వర్టిస్​​ కారుకు ఎన్​సీఏపీ 5-స్టార్ రేటింగ్ ఉంది. అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటక్షన్ కేటగిరీలో 34 పాయింట్లకు గాను ఇది 29.71 పాయింట్లను సాధించింది. చిల్డ్రన్ ఆక్యుపెంట్ ప్రొటక్షన్​ కేటగిరీలో ఇది 49 పాయింట్లకు గాను 42 పాయింట్లు సాధించింది. కనుక ఈ ఫోక్స్​వ్యాగన్​ కారులో పెద్దలు, చిన్న పిల్లలు అందరూ సురక్షితంగా ప్రయాణించవచ్చు.

ఈ ఫోక్స్​వ్యాగన్ వర్టిస్​ కారులో స్టాండర్డ్​గా రెండు ఎయిర్​బ్యాగ్స్​, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈసీఎస్​) ఉంటాయి. ఇండియన్ మార్కెట్లో ఈ కారు ధర సుమారుగా రూ.11.56 లక్షల నుంచి రూ.19.41 లక్షల (ఎక్స్​-షోరూం) వరకు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. Skoda Slavia Safety Features : ఈ స్కోడా స్లావియా కారుకు కూడా జీఎన్​సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఉంది. ఫోక్స్​వ్యాగన్​ వర్టిస్​​ లాగానే ఈ స్కోడా సెడాన్ కారు కూడా అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటక్షన్ కేటగిరీలో 34 పాయింట్లకు గాను 29.71 పాయింట్లు; చిల్డ్రన్ ఆక్యుపెంట్ ప్రొటక్షన్​ కేటగిరీలో 49 పాయింట్లకు గాను 42 పాయింట్లు సాధించింది.

వాస్తవానికి ఫోక్స్​వ్యాగన్ వర్టిస్​​, స్కోడా స్లావియా కార్లు రెండూ ఫోక్స్​వ్యాగన్ గ్రూప్​నకు చెందిన ఇండియన్ స్పెసిఫిక్​ MQB-AO-IN ప్లాట్​ఫాంనకు చెందినవి. స్కోడా కుషాక్​, ఫోక్స్​వ్యాగన్ టైగన్​లతో పాటు ఈ రెండు కార్లను కూడా ఇండియా 2.0 ప్రాజెక్ట్​లో భాగంగా రూపొందించారు. ఫోక్స్​వ్యాగన్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 1 బిలియన్ యూరోస్​ (సుమారు రూ.9 వేల కోట్లు) ఇన్వెస్ట్ చేసింది.

భారత మార్కెట్లో ఈ స్కోడా స్లావియా కారు ధర సుమారుగా రూ.11.53 లక్షల నుంచి రూ.19.13 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

3. Hyundai Verna Safety Features : ఈ హ్యుందాయ్ వెర్నా కారుకు కూడా గ్లోబల్​ ఎన్​సీఏపీ 5-స్టార్ రేటింగ్ ఉంది. ఈ సెడాన్ కారు అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటక్షన్ కేటగిరీలో 34 పాయింట్లకు గాను 28.18 పాయింట్లు; చిల్డ్రన్ ఆక్యుపెంట్ ప్రొటక్షన్​ కేటగిరీలో 49 పాయింట్లకు గాను 42 పాయింట్లు సాధించింది. ఈ కారులో స్టాండర్డ్​గా 6-ఎయిర్​బ్యాగ్స్​, ఈఎస్​సీ ఉంటాయి. మార్కెట్లో ఈ హ్యుందాయ్ వెర్నా కారు ధర సుమారుగా రూ.11 లక్షల నుంచి రూ.17.42 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నోట్​ : గ్లోబల్ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ల సమయంలో ఫోక్స్​వ్యాగన్ వర్టిస్​​, స్కోడా స్లావియా కార్ల 'బాడీషెల్స్​ ఇంటిగ్రిటీ' స్థిరంగానే ఉంది. కానీ హ్యుందాయ్ వెర్నా బాడీషెల్స్ ఇంటిగ్రిటీ కాస్త అస్థిరంగా ఉందని తేలింది.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా టూ-వీలర్​ నడపాలా? ఈ టాప్​-7 ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఓ లుక్కేయండి!

హ్యుందాయ్ నుంచి మరో కొత్త మోడల్​​- సూపర్ సేఫ్టీ ఫీచర్స్- ధర ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.