ETV Bharat / business

వీసా, మాస్టర్ కార్డు, రూపే- ఇకపై క్రెడిట్ కార్డ్ సెలక్షన్ మీదే గురూ! - Credit Card Selection - CREDIT CARD SELECTION

RBI Guidelines On Credit Card Selection : క్రెడిట్ కార్డు వినియోగదారులకు గుడ్​న్యూస్. ఇక నుంచి కస్టమర్లు తమకు నచ్చిన నెట్​వర్క్‌ నుంచి కార్డును ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ సెప్టెంబరు 6 నుంచి అమల్లోకి రానుంది. దీని వల్ల లాభాలేంటంటే?

Credit Card Selection
Credit Card Selection (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 2:12 PM IST

RBI Guidelines On Credit Card Selection : ఎవరైనా క్రెడిట్‌ కార్డు కోసం అప్లై చేసినప్పుడు, అది మన చేతికి అందేదాకా ఏ కార్డు వస్తుందో చెప్పలేం. రూపే కార్డు ఇవ్వాలా? వీసా, మాస్టర్ కార్డా? అన్నది బ్యాంకులే నిర్ణయిస్తాయి. అయితే క్రెడిట్‌ కార్డు నెట్​వర్క్​లను ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉండేది కాదు. అయితే దీనికి చెక్ పెడుతూ ఆర్​బీఐ కొన్నాళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. నచ్చిన నెట్​వర్క్‌ నుంచి కార్డును ఎంపిక చేసుకునే ఆప్షన్​ను వినియోగదారులకు ఇవ్వాలని పేర్కొంది. ఈ ప్రక్రియ సెప్టెంబరు 6వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీని వల్ల యూజర్లకు ఉపయోగాలేంటి? అమలు సాధ్యాసాధ్యాలపై ఓ లుక్కేద్దాం.

ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయంతో కస్టమర్ల తమకు నచ్చిన క్రెడిట్ కార్డు నెట్​వర్క్​ను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే వారికి అధిక ప్రయోజనాలు, తక్కువ కార్డు ఫీజు, రివార్డులు ఇచ్చే నెట్​వర్క్​ను ఎంచుకోవచ్చు. కస్టమర్ల అవసరాలు, ఖర్చులను బట్టి వారికి సరిపోయే క్రెడిట్ కార్డును తీసుకోవచ్చు. సెప్టెంబరు 6 నుంచి మీరు కొత్త క్రెడిట్ కార్డ్, రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసినప్పుడు మీకు నచ్చిన నెట్‌వర్క్‌ నుంచి కార్డును ఎంపిక చేసుకునే ఆప్షన్‌ అందుబాటులోకి రానుంది. రూపే, వీసాలో ఏదైనా ఎంచుకునే వెసులుబాటు వినియోగదారులకు ఉంటుంది. అంతకుముందు క్రెడిట్ కార్డు జారీ సంస్థలే యూజర్ల కార్డు నెట్​వర్క్​ను నిర్ణయించేవి. ఆర్​బీఐ నిర్ణయంతో కస్టమర్లే వారికి నచ్చిన క్రెడిట్ కార్డు నెట్​వర్క్​ను ఎంపిక చేసుకోవచ్చు. కాగా, ఈ నిర్ణయాన్ని వీసా ప్రతినిధి ఒకరు సమర్థించారు.

క్రెడిట్ కార్డ్ నెట్​వర్క్​పై ఆర్​బీఐ నిర్ణయం ఎందుకు?
క్రెడిట్ కార్డ్ నెట్​వర్క్​లో వీసా, మాస్టర్‌ కార్డు అగ్రగామిగా ఉన్నాయి. ఇప్పుడు రూపే నెట్​వర్క్ కూడా బాగా పెరిగింది. దీంతో మార్కెట్లో పోటీ ఏర్పడింది. అయితే ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది ఆర్థిక నిపుణులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు సమర్థిస్తున్నాయి. నచ్చిన నెట్​వర్క్‌ నుంచి కార్డును ఎంపిక చేసుకునే ఆప్షన్​ను ఆర్​బీఐ తీసుకురావడం వల్ల దేశంలో డిజిటల్ చెల్లింపుల విభాగంలో కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరిచే వ్యూహమేనని యస్ బ్యాంక్, క్రెడిట్ కార్డ్స్ అండ్ మర్చంట్ అక్వైరింగ్ కంట్రీ హెడ్ అనిల్ సింగ్ తెలిపారు.

నచ్చిన క్రెడిట్ కార్డు నెట్​వర్క్​ను ఎంచుకోవడం ఎలా?
బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు ఇప్పటికే కస్టమర్లకు వారికి నచ్చిన క్రెడిట్ కార్డు నెట్​వర్క్​ను ఆప్షన్​ను అందిస్తున్నాయి. ఆర్​బీఐ ఆదేశాలనుసారం కొత్త క్రెడిట్ కార్డ్ కోసం జారీ చేసేటప్పుడు తమ ప్రాధాన్య నెట్​వర్క్‌ను ఎంచుకోవాలని కస్టమర్లను కోరుతున్నాయి. ఈ బ్యాంకులు ఇప్పటికే ఉన్న కస్టమర్లను క్రెడిట్ కార్డు రెన్యూవల్ సమయంలో నచ్చిన నెట్​వర్క్​ను ఎంచుకోవడానికి ఈ-మెయిల్, కస్టమర్ కేర్ లైన్​కు కాల్ చేయమని కోరుతున్నాయి.

ఆర్​బీఐ నిర్ణయం వల్ల ప్రయోజనాలేంటి?
నచ్చిన నెట్​వర్క్‌ నుంచి కార్డును ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను జారీ సంస్థలు వినియోగదారులకు ఇవ్వడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. నిర్దిష్ట నెట్‌వర్క్‌లు పలు ప్రాంతాల్లో విస్తృత ఆమోదాన్ని పొందొచ్చు. కస్టమర్లు తమకు నచ్చిన నెట్​వర్క్​ను ఎంచుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డు ప్రయోజనాలు ప్రధానంగా దాన్ని జారీ చేసే బ్యాంకుపై ఆధారపడి ఉంటాయి.

ఉదాహరణకు- ఇండస్‌ ఇండ్ బ్యాంక్ మాస్టర్, వీసా, పయనీర్ హెరిటేజ్ క్రెడిట్ కార్డ్​ను జారీ చేస్తుంది. అయితే వీసా ఇన్ఫోనిటి కార్డును తీసుకుంటే ఐటీసీ కలెనెయిక్ మెంబర్ షిప్ లభించదు. మాస్టర్ కార్డు వరల్డ్ ఎలైట్ నెట్​వర్క్​ను ఎంచుకుంటే మీరు ఉచితంగా మెంబర్ షిప్ పొందొచ్చు. కస్టమర్లకు తమకు నచ్చిన క్రెడిట్ కార్డు నెట్​వర్క్​ను ఎంచుకునే ఆప్షన్​ ఇవ్వడం వల్ల పలు నెట్​వర్క్​ల మధ్య పోటీ వాతావరణం ఏర్పడుతుందని, ఈ క్రమంలో వినియోగదారులకు మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ పోటీ వల్ల నెట్​వర్క్ నిర్దిష్ట ఆఫర్లు, ప్రత్యేకమైన లాంజ్ యాక్సెస్ వంటి ఆఫర్లను ఇవ్వొచ్చు.

సవాళ్లు?
ఆర్​బీఐ నిర్ణయంతో చిన్న నెట్ వర్క్​లు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నెట్​వర్క్ ఆఫర్లు, రివార్డులు వంటివాటిపై అవగాహన ఉన్న కస్టమర్లు వారికి తగ్గట్టు క్రెడిట్ కార్డు నెట్​వర్క్​లను ఎంపిక చేసుకుంటారు. తెలియనివారు కాస్త ఇబ్బందులు పడతారు. వీసా, మాస్టర్ కార్డు కంటే రూపే కార్డు వార్షిక, రెన్యువల్ రుసుము తక్కువగా ఉండే అవకాశం ఉంది.

మెటల్ క్రెడిట్ కార్డుతో లాభమేనా? ఈ భారీ డిస్కౌంట్స్​, రివార్డ్స్​ గురించి మీకు తెలుసా? - Top Metal Credit Cards In India

మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు! - 5 Common Credit Card Mistakes

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.