ETV Bharat / business

ఏ పనీ చేయకపోయినా రూ.3 కోట్లు సాలరీ - అమెజాన్‌ ఉద్యోగి పోస్ట్​ వైరల్‌! - AMAZON EMPLOYEE 3 CRORE SALARY

Rs 3 Crore Salary 'Doing Nothing' Amazon Employee's Trick Is Viral : తాను ఏ పనీచేయకపోయినా అమెజాన్​ కంపెనీ నుంచి తాను రూ.3 కోట్లు సంపాదించినట్లు ఓ వ్యక్తి చేసిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దాని పూర్తి వివరాలు మీ కోసం.

Amazon
Amazon (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 3:46 PM IST

Rs 3 Crore Salary 'Doing Nothing' Amazon Employee's Trick Is Viral : కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను పిండి, పిప్పిచేసి, భారీగా డబ్బులు సంపాదిస్తుంటాయి. కానీ ఓ ఉద్యోగి మాత్రం ఏ పని చేయకుండా రూ.3 కోట్లు సంపాదించాడు. అది కూడా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి ఈ సాలరీ పొందినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఇది వైరల్​గా మారింది.

నిలబడి దంచినా, ఎగిరెగిరి దంచినా ఒకటే కూలి!
సాధారణంగా ఉద్యోగులు రెండు రకాలుగా ఉంటారు. కొందరు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మరికొందరు వచ్చామా, పోయామా అనే విధంగా ఉంటారు. కొందరు అనుకున్నదానికంటే ఎక్కువ పని గంటలు పనిచేస్తారు. మరికొందరు బాతాకానీ కొడుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. అందుకే నిలబడి దంచినా అదే కూలి. ఎగిరెగిరి దంచినా అదే కూలీ అనే నానుడి వచ్చింది.

కొంత మంది ఉద్యోగులు చాలా తెలివిగా ఉంటారు. వాళ్లు పనిచేయరు కానీ, పనిచేస్తున్నట్లు నటించి, ఉన్నతాధికారుల మెప్పుపొంది, తమ పొజిషన్​ను, జీతాన్ని పెంచుకుంటూ ఉంటారు. మరికొందరు ఎంత పనిచేసినా గుర్తింపు రావడం లేదని బాధపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో, తనకు పనీపాటా లేకపోయినా రూ.3 కోట్లకు పైనే ఆర్జించానంటూ చెప్పుకొచ్చాడో ఉద్యోగి. తన ఘనకార్యం గురించి తానే స్వయంగా ఓ పోస్టులో రాసుకొచ్చాడు. ఇది వైరల్​ అయ్యి నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.

వైరల్ పోస్ట్ ఇదే!
అమెజాన్‌లోని సీనియర్‌ ఉద్యోగి ఒకరు బ్లైండ్‌ అనే ప్లాట్‌ఫామ్‌లో ఇటీవల ఓ పోస్ట్‌ పెట్టారు. గూగుల్‌ తనను ఉద్యోగం నుంచి తొలగించాక, అమెజాన్​లో చేరానని అందులో పేర్కొన్నాడు. సీనియర్‌ టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా గడిచిన ఏడాదిన్నర కాలంలో సుమారు 3.70 లక్షల డాలర్లు సంపాదించానని చెప్పారు. ఇది మన ఇండియన్​ కరెన్సీలో సుమారుగా రూ.3.10 కోట్లు ఉంటుంది. కంపెనీలో ఏ పనీ చేయకపోయినా, తనకు ఇంత పెద్ద మొత్తం వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. పైగా 'ఎంత కాలమో ఈ అదృష్టం!' అంటూ రాసుకొచ్చాడు.

వాస్తవానికి గూగుల్‌ తనను ఉద్యోగం నుంచి తొలగించినప్పుడే, ఏ పనీ చేయకూడదన్న ఉద్దేశంతోనే అమెజాన్‌ కంపెనీలో చేరినట్లు అతను చెప్పాడు. అంతేకాదు తను అమెజాన్‌లో కేవలం ఏడంటే ఏడే సపోర్ట్‌ టికెట్లను పరిష్కరించాడట. అయితే తను ఓ సింగిల్‌ ఆటోమేటెడ్‌ డ్యాష్‌బోర్డును రూపొందించినట్లు అతను చెప్పాడు. ఇందుకోసం మూడు నెలల సమయం వెచ్చించినట్లు కంపెనీకి తెలిపాడట. కానీ వాస్తవానికి ఈ పనిని చాట్‌జీపీటీ కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసినట్లు తన పోస్టులో చెప్పుకొచ్చాడు. తను ఒక రోజులో ఎక్కువ సమయం వెచ్చించింది ఏదైనా ఉందీ అంటే అది మీటింగ్‌లకేనని అతను పేర్కొన్నాడు.

మిక్స్​డ్ రెస్పాన్స్​
అమెజాన్ ఉద్యోగి చేసిన పోస్ట్‌ను ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై నెట్టింట చర్చ మొదలైంది. దీంతో చాలా మంది ఆ ఉద్యోగి తీరును తప్పుబడుతున్నారు. కష్టపడి పనిచేసి సంపాదించాలన్న వ్యవస్థలను ఇలాంటి వ్యక్తులే నాశనం చేస్తున్నారంటూ ఓ యూజర్‌ మండిపడ్డారు. కార్పొరేట్‌ వ్యవస్థలోనే ఈ లోపం ఉందంటూ మరో వ్యక్తి అసహనం వ్యక్తం చేశారు. పని ప్రదేశంలో ఎంతో విలువైన సమయాన్ని వృథా చేశాడంటూ మరో యూజర్‌ విమర్శలు గుప్పించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.