Retail inflation 2024 : జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠ స్థాయి 5.1 శాతానికి దిగివచ్చింది. ప్రధాన ఆహార పదార్థాల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.
కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ప్రకారం, 2023 డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.69 శాతంగా ఉంది. అయితే 2024 జనవరి నాటికి ఇది 6.52 శాతానికి పెరిగింది. 2023 ఆగస్టులో ద్రవ్యోల్బణం గరిష్ఠంగా 6.83 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం, 2024 జనవరిలో ఆహార రిటైల్ ద్రవ్యోల్బణం 8.3 శాతంగా ఉంది. ఇది అంతకు ముందు నెలలో 9.53 శాతంగా ఉండేది.
కేంద్ర ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం మార్జిన్‌తో 4 శాతం వద్ద ఉండేలా చూడమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐని) నిర్దేశించింది.
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ ఆధారిత (WPI) ద్రవ్యోల్బణం 2023 డిసెంబరులో 0.73 శాతం వద్ద ఉంది. నవంబరులో ఇది 0.26 శాతంగా ఉండేది. ఆహార పదార్థాలు, యంత్రాలు, రవాణా పరికరాలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఉత్పత్తులు, ఇతర తయారీ వస్తువుల ధరలు పెరగడం వల్లే టోకు ద్రవ్యోల్బణం పెరిగింది. డిసెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.69 శాతంగా ఉన్న విషయం తెలిసిందే.
- 2023 నవంబరుతో పోలిస్తే డిసెంబర్‌లో ఖనిజాలు (-1.91%); ఖనిజ చమురు (-1.54%), ఆహార పదార్థాలు (-2.30%); పెట్రోలియం, సహజ వాయువు (-4.28%); ఆహారేతర వస్తువుల (-0.18%) ధరలు తగ్గాయి.
- నెలవారీ ప్రాతిపదికన డిసెంబర్‌లో విద్యుత్ ధర 1.34% పెరిగింది.
- తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం -0.71 శాతానికి తగ్గింది.
- కూరగాయల ద్రవ్యోల్బణం 10.44 శాతం నుంచి 26.30 శాతానికి పెరిగింది.
- ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 4.76 శాతం నుంచి 5.78 శాతానికి ఎగబాకింది.
- ఉల్లి ధరల పెరుగుదల రేటు 101.24 శాతం నుంచి 91.77 శాతానికి తగ్గింది.
- గుడ్లు, మాంసం, చేపల ద్రవ్యోల్బణం 1.44 శాతం నుంచి -0.84 శాతానికి తగ్గింది. పప్పు ధాన్యాల ధరల పెరుగుదల రేటు సైతం 7.12 శాతం నుంచి 5.92 శాతానికి దిగొచ్చింది.
ఆరు నెలల్లో 42 లక్షల పెళ్లిళ్లు - రూ.5.5లక్షల కోట్ల వ్యాపారం - భారత్‌లో అట్లుంటది మరి!
గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్ షురూ - వారికి స్పెషల్ డిస్కౌంట్ - అప్లై చేయండిలా!