ETV Bharat / business

కార్లలో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణాలివే! - Causes of Fires in car Summer

Cars Catching Fire Reasons : కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైన ఘటనలు తరచూ వింటుంటాం. ఈ పరిస్థితి ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. అసలు కార్లలో మంటలు ఎందుకు చెలరేగుతాయి? దానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

Causes of Car Fires
Cars Catching Fire Reasons
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 1:57 PM IST

Reasons for Cars Catching Fire : ప్రస్తుత రోజుల్లో కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే పెరిగిన కార్ల వినియోగంతో పాటు.. కారు లోపల మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. కొన్నిసార్లు కార్లు రన్నింగ్‌లో ఉండగానే నిప్పంటుకుంటే.. ఇంకొన్నిసార్లు నిలిపి ఉన్న కార్లలోనూ మంటలు అంటుకున్న సందర్భాలు ఉన్నాయి. చూస్తుండగానే మంటలు కారు నిండా వ్యాపించి కళ్ల ముందే కాలిబూడిదైన కార్లు మరెన్నో. దీంతో లక్షలు పోసి కొన్న కారులో హాయిగా ఫ్యామిలీతో ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక ఎండాకాలం వస్తే ఈ పరిస్థితి మరింత అధికం. అసలు, కార్లలో ఆకస్మాత్తుగా మంటలు ఎందుకు వస్తాయి? అందుకు గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇంజిన్ ఓవర్‌హీట్ : కార్లలో మంటలు చేలరేగడానికి ప్రధాన కారణం.. ఇంజిన్ ఓవర్​హీట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఎక్కువసేపు ఆపకుండా కారును డ్రైవ్ చేస్తుంటారు. దాంతో ఇంజిన్ ఒక్కోసారి అధికంగా వేడెక్కి మంటలు చెలరేగే అవకాశం ఉంటుందంటున్నారు ఆటో మొబైల్ నిపుణులు. కాబట్టి లాంగ్ జర్నీలు చేసేటప్పుడు మధ్యమధ్యలో విరామాలు తీసుకుంటూ ఇంజిన్ కాస్త చల్లగా అయ్యే వరకూ వెయిట్​ చేసి ఆ తర్వాత డ్రైవింగ్ చేయడం మంచిదంటున్నారు.

ఫ్యూయల్ లీకేజీ : ఇది కూడా కారులో మంటలు తలెత్తడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే వెహికల్లో ఉపయోగించే పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్స్ అతి త్వరగా మంటలను వ్యాపించే లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి కారులో వీటి లీకేజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇందుకోసం తరచుగా వెహికల్​ను చెక్ చేస్తుండాలి. ఒకవేళ ఎక్కడైనా చిన్న లీకేజీ కనిపించినా వెంటనే ఆ ప్రాబ్లమ్​ను సాల్వ్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ : కారులో ఆకస్మాత్తుగా మంటలు రావడానికి ఇది కూడా ఒక సహజమైన కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు. ఎందుకంటే వెహికల్​లోని ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్​లో ఏదైనా చిన్నపాటి లోపం తలెత్తితే ఆ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుందంటున్నారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరమంటున్నారు.

ఈ సంకేతాలు కనిపిస్తే - మీ కారు బ్రేక్స్ ఫెయిల్ కాబోతున్నట్టే!

మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం : చాలా మంది చేసే పొరపాటు కారును టైమ్​ టూ టైమ్ సర్వీసింగ్ చేయించరు. అలాగే మెయింటెనెన్స్ విషయంలో కూడా అశ్రద్ధ వహిస్తుంటారు. కానీ, వెహికల్​ను సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోయినా కారులో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు షెడ్యూల్ ప్రకారం కారును సర్వీస్ చేసుకుంటూ ఉండడం మంచిది అంటున్నారు.

యాక్సిడెంట్స్ : ఏదైనా తీవ్రమైన రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కారులోని ఫ్యూయల్ లీక్ అవ్వటం, రెండు వాహనాల మధ్య చోటుచేసుకున్న రాపిడికి అగ్ని పుట్టి మంటలు చెలరేగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి వెహికల్​ను డ్రైవ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా నడపడం చాలా అవసరం.

ధూమపానం చేయటం : పొగతాగడం ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీ కారుకు కూడా ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీరు కారులో సిగరెట్ తాగేటప్పుడు అది అనుకోకుండా కింద పడినట్లయితే వెహికల్​లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ లేదా అందులో కూర్చునప్పుడు కానీ ధూమపానం చేయకుండా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవేకాకుండా చాలా మంది వినియోగదారులు కార్లలో నాసిరకం ఎలక్ట్రిల్ యాక్ససరీలను అమర్చుకుంటుంటారు. అది కూడా కొన్ని సార్లు కారులో మంటలు తలెత్తడానికి కారణం కావొచ్చంటున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో కారు తయారీలో డిజైన్ లోపం కారణంగా కూడా వెహికల్ మంటలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు కారు యూజ్ చేస్తున్నట్లయితే ఈ పొరపాట్లు చేయకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీ కారు ఇచ్చే ఈ సిగ్నల్స్‌ చూస్తున్నారా? - లేకపోతే ఇంజిన్‌ ఖతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.