ETV Bharat / business

రియల్ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!

Real Estate Portfolio Diversification Tips : మీరు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. నష్టభయం తగ్గి, మంచి రాబడి సంపాదించాలంటే, పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

REITs investment tips
real estate portfolio diversification tips
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 5:00 PM IST

Real Estate Portfolio Diversification Tips : భారతదేశంలో రియల్ ఎస్టేట్​ రంగం ప్రస్తుతానికి మంచి లాభాలతో దూసుకుపోతోంది. వాస్తవానికి స్థిరాస్తి రంగంలో స్వల్పకాలంలో ఒడుదొడుకులు రావడం సహజం. కానీ దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే రియల్ ఎస్టేట్​ రంగంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. దీని వల్ల రిస్క్ తగ్గుతుంది. మంచి రాబడి వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయకూడదు!
రియల్​ ఎస్టేట్​ వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒకే ప్రాంతంలో ఆస్తులు కొనకుండా, వివిధ ప్రాంతాల్లో ఇన్వెస్ట్​ చేయాలి. దీని వల్ల ఒక ప్రాంతంలో రియల్​ ఎస్టేట్ ధరలు తగ్గినా, మరో ఏరియాలో ధరలు బాగుండే అవకాశం ఉంటుంది. దీని వల్ల రిస్క్ తగ్గుతుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి ఒకే నగరంలో అనేక ఆస్తులను కొన్నాడని అనుకుందాం. కొన్ని పరిస్థితుల కారణంగా ఆ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైతే, అతను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అదే అతను వేర్వేరు ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసి ఉంటే, ఒక ప్రాంతంలో భూముల/ఆస్తుల విలువలు తగ్గినా, మరో ఏరియాలో పెరుగుతాయి కనుక, అతనికి భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉండదు. పైగా లాభాలు పెరిగే ఛాన్స్ కూడా పెరుగుతుంది.

వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలి!
చాలా మంది ఒకే రకమైన స్థిరాస్తులను కొంటూ ఉంటారు. కానీ ఇది సరైనది కాదు. వాణిజ్య, నివాస, పారిశ్రామిక ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టాలి. దీని వల్ల రిస్క్ తగ్గుతుంది. మంచి లాభాలు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి వాణిజ్యపరమైన ఆస్తులను మాత్రమే కొనుగోలు చేసి ఉంటే, వాణిజ్యపరమైన మార్కెట్లో తిరోగమనం ఏర్పడినప్పుడు, అతనికి తీవ్రమైన నష్టాలు వస్తాయి. అందుకే నివాస, పారిశ్రామిక, వాణిజ్య ఆస్తులన్నింటీనీ తమ పోర్ట్​ఫోలియోలో చేర్చుకోవాలి. దీని వల్ల నష్టభయం తగ్గుతుంది. భవిష్యత్​లో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది.

అద్దె రూపంలో ఆదాయం
రియల్​ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులపై అద్దె రూపంలో కూడా ఆదాయం సంపాదించవచ్చు. నివాస యోగ్యమైన ఆస్తులపై 3-4 శాతం వరకు వార్షిక అద్దె లభిస్తుంది. వాణిజ్య ఆస్తులపై 7-8 శాతం వరకు రెంట్స్​ రూపంలో ఆదాయం వస్తుంది. కనుక మీ పోర్ట్​ఫోలియోలో వీటిని చేర్చుకోవడం మంచిది.

REITs పెట్టుబడులు
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే, భారీగా డబ్బులు కావాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో డబ్బులు లేనివాళ్లు 'రీట్స్​' (REITs)లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇండియాలో రియల్ ఎస్టేట్​ ఇన్వెస్ట్​మెంట్ ట్రస్ట్​ (REITs) అనేది అపార్ట్​మెంట్స్​, షాపింగ్ మాల్స్​, హోటల్స్​, గిడ్డంగులు, కార్యాలయ భవనాలను కలిగి ఉంటుంది. ఇది ప్రజల నుంచి పెట్టుబడులను సేకరించి, విభిన్న రియల్ ఎస్టేట్ ఆస్తులను కొనుగోలు చేసి, ఆదాయాన్ని సంపాదిస్తుంది. తరువాత పెట్టుబడిదారులకు డివిడెంట్ల రూపంలో ఆదాయాన్ని పంపిణీ చేస్తుంది.

సెక్యూరిటీస్​ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 2014లో 'రీట్స్​'ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి పారదర్శకమైన పెట్టుబడి మార్గాన్ని తెరవడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల రీట్స్​ ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఈక్విటీ రీట్స్​ : ఈ ఈక్విటీ రీట్స్​ ప్రధానంగా అపార్ట్‌మెంట్లు, ఆఫీసులు, షాపింగ్‌ సెంటర్లు, హోటల్​లు లాంటి ఆస్తులలో పెట్టుబడి పెడతాయి. తరువాత వీటిని అద్దెకు ఇచ్చి, ఆదాయాన్ని సంపాదిస్తాయి. అంతేకాకుండా కాలక్రమేణా వీటి ఆస్తుల విలువ కూడా పెరుగుతుంది. కనుక, పెట్టుబడిదారులకు మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
  • హైబ్రీడ్​ రీట్స్​ : ఇది డెట్​, ఈక్విటీ సాధనాల కలయిక. ఈ హైబ్రీడ్ రీట్స్​ ఆదాయం వచ్చే ఆస్తులను, తనఖా ఆధారిత సెక్యూరిటీలను కలిగి ఉంటాయి.
  • రిటైల్‌ రీట్స్​ : షాపింగ్‌ మాల్స్‌, రిటైల్‌ ప్రాపర్టీల్లో రిటైల్ రీట్స్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. వీటి ద్వారా అద్దె రూపంలో ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా ఆస్తుల విక్రయం ద్వారా కూడా లాభాలను సంపాదించవచ్చు.
  • రెసిడెన్షియల్ రీట్స్ ​: నివాస భవనాలు, అపార్ట్​మెంట్లు, ఇళ్లు లాంటివి దీనిలో ఉంటాయి. వీటి ద్వారా అద్దె రూపంలో ఆదాయం సంపాదించవచ్చు.
  • ఆఫీస్ రీట్స్ : ఈ రీట్స్​ కార్యాలయాలపై పెట్టుబడులు పెడతాయి. అద్దెల రూపంలో ఆదాయాన్ని సంపాదిస్తాయి. ఉదాహరణకు భారత్‌లో బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా రీట్ ఉంది. ఇది ముంబయి, గురుగ్రామ్‌, నోయిడా, కోల్‌కతాల్లోని వాణిజ్యపరమైన ఆస్తుల్లో, కార్యాలయాలలో పెట్టుబడులను పెట్టింది. వీటి ద్వారా మంచి రాబడి సంపాదించి, పెట్టుబడిదారులకు లాభాలు పంచిపెడుతోంది.
  • ఇండస్ట్రియల్ రీట్స్​ : ఈ రకం రీట్స్​ గిడ్డంగులు, పంపిణీ కేంద్రాలు లాంటి పారిశ్రామిక ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి, వాటిని నిర్వహిస్తూ ఉంటుంది. ఇవి అద్దె రూపంలో ఆదాయాన్ని సంపాదిస్తాయి. లీజు ఒప్పందాలు, ఆస్తుల విక్రయం నుంచి కూడా లాభాలను ఆర్జిస్తుంది.

REITs ఎలా కొనాలి?
ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు తమ స్టాక్ బ్రోకర్ల ద్వారా రీట్​ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు, వాటిని విక్రయించవచ్చు. కొన్ని మ్యూచువల్ ఫండ్లు కూడా రీట్స్​లో పెట్టుబడులు పెడతాయి. వాటిని కూడా మనం కొనుగోలు చేయవచ్చు. రీట్​ తన యూనిట్లను అమ్మకానికి పెట్టినప్పుడు, ప్రైమరీ మార్కెట్​లో ఇన్వెస్టర్లు నేరుగా వాటిని కొనుగోలు చేయవచ్చు.

స్టాక్స్​, బాండ్స్​ లాంటి ఆస్తులతో పోలిస్తే, రీట్స్​ మంచి రాబడిని అందిస్తాయి. అయితే ఇవి మార్కెట్ రిస్క్​లకు లోబడి ఉంటాయనే విషయాన్ని గుర్తించుకోవాలి.

కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు!

క్రెడిట్​ కార్డ్​ యూజ్ చేస్తున్నారా? ఇకపై బిల్లింగ్ డేట్​ను మీరే ఫిక్స్​ చేసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.