ETV Bharat / business

వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం - EMI భారం యథాతథం - RBI Monetary Policy June 2024 - RBI MONETARY POLICY JUNE 2024

RBI Monetary Policy June 2024 : రిజర్వ్​ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ముఖ్యంగా రెపోరేటును 6.5 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

RBI MPC June 2024
RBI Monetary Policy (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 10:06 AM IST

RBI Monetary Policy June 2024 : కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. అంతా ఊహించినట్లుగానే రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది.

వాస్తవానికి 2023 ఏప్రిల్​ నుంచి రెపో రేటును ఆర్​బీఐ యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, రెపో రేటును ఆర్​బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా ఎనిమిదోసారి. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్​బీఐ ప్రకటించిన రెండో ద్వైమాసిక పరపతి విధానం ఇది.

జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం!
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం ఉండవచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది. ఇది కనుక కార్యరూపం దాల్చితే వరుసగా నాలుగే ఏడాది కూడా 7 శాతానికి పైగా వృద్ధి సాధించినట్లు అవుతుంది. మరోవైపు సీపీఐ ద్రవ్యోల్బణాన్ని ఇరువైపులా 2 శాతం మార్జిన్​తో 4 శాతం వద్ద ఉండేలా చూడాలని ఆర్​బీఐని ప్రభుత్వం ఆదేశించింది.

ఆర్‌బీఐ మోనటరీ పాలసీ నిర్ణయాలు

  • ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య మంచి సమతుల్యత కొనసాగుతోందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద ఉంచడానికి ఆర్​బీఐ కట్టుబడి ఉందని, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండడం కాస్త ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.
  • 'నైరుతి రుతుపవనాల వల్ల ఖరీఫ్ సీజన్​లో పంటల ఉత్పత్తి పెరుగుతుందని ఆశిస్తున్నాం. అలాగే దీని వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరుగుతాయని భావిస్తున్నామని' శక్తికాంత దాస్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు

  • రిటైల్ ద్రవ్యోల్బణం 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాల్గో త్రైమాసికంలో 4.5 శాతం ఉండొచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది.
  • 'అనుకున్నట్లుగా సకాలంలో మంచి వర్షాలు పడితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉండవచ్చు. ఒకవేళ ఇలా జరగకపోతే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని' ఆర్​బీఐ గవర్నర్ పేర్కొన్నారు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణంలో కొంత మేరకు దిద్దుబాటు జరగవచ్చని శక్తికాంత దాస్ అన్నారు.

దృఢమైన ఆర్థిక పునాదులతో భారత్​

  • ఇతర కరెన్సీలతో పోల్చితే ఇండియన్ రూపాయి సాపేక్ష స్థిరత్వంతో కొనసాగుతోంది. ఇది మన దేశ బలమైన ఆర్థిక మూలాలకు నిదర్శనంగా ఉందని శక్తికాంత దాస్​ పేర్కొన్నారు.
  • 2024 ఆర్థిక సంవత్సర వార్షిక ఫలితాలు మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో సూచిస్తున్నాయి.
  • 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యవసర రిస్క్ బఫర్​ (నిల్వలను) 0.5 శాతం పెంచడం వల్ల ఆర్​బీఐ బ్యాలెన్స్ షీట్ మరింత మెరుగుపడుతుందని శక్తికాంత దాస్​ అన్నారు.

కస్టమర్ల రక్షణకే మొదటి ప్రాధాన్యత!

  • 'వినియోగదారుల రక్షణకే ఆర్​బీఐ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. అయితే కొన్ని సంస్థలు ఇప్పటికీ సరైన పారదర్శక విధానాలు పాటించకుండా కొన్ని రకాల రుసుములు వసూలు చేస్తున్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. అలాగే అసురక్షిత రుణాలు, అడ్వాన్స్​లను తగ్గించడానికి చేయడానికి చర్యలు తీసుకుంటాం' అని శక్తికాంత దాస్​ పేర్కొన్నారు.

పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు!

  • 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి కరెంట్​ ఖాతా లోటు మోడరేట్ అవుతుందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
  • ప్రపంచ రెమిటెన్స్​ల్లో భారతదేశం వాటా 15.2 శాతం. తద్వారా విదేశీ ద్రవ్యాన్ని అతిపెద్ద దేశంగా ఇండియా కొనసాగుతోందని శక్తికాంత దాస్ తెలిపారు.
  • 2024 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బలంగా ఉన్నప్పటికీ, నికర విదేశీ పెట్టుబడులు కాస్త మితంగానే ఉన్నాయి.

ఫెమా నిబంధనలు హేతుబద్ధీకరించాల్సిందే!

  • వస్తు, సేవల ఎగుమతి, దిగుముతులకు సంబంధించిన ఫారిన్ ఎక్స్ఛేంజ్​ మేనేజ్​మెంట్ యాక్ట్​ మార్గదర్శకాలను హేతుబద్ధీకరించాల్సి ఉందని శక్తికాంత దాస్​ అన్నారు.

ఇకపై రూ.3 కోట్ల వరకు!
మన దేశంలో ఇప్పటి వరకు బ్యాంకుల్లో గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు మాత్రమే డిపాజిట్ చేయడానికి వీలుండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.3 కోట్లకు పెంచుతూ ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌లో తప్పులు చేశారా? అయితే సరిదిద్దుకోండిలా! చివరి తేది ఇదే! - Revised ITR Filing

EPF అకౌంట్​లోని మీ వివరాలు మార్చుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - EPF KYC Correction

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.