ETV Bharat / business

రతన్ టాటా గ్రేట్​ లవ్ స్టోరీ - ఆమెపై ప్రేమతో జీవితాంతం బ్రహ్మచారిగా!

స్వదేశం మీద అభిమానం, బామ్మకిచ్చిన మాట - రతన్ టాటా ప్రేమించిన వ్యక్తికి దూరం

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Ratan Tata Love Story
Ratan Tata (Getty Images)

Ratan Tata Love Story : 1937 డిసెంబర్ 28న ముంబయిలోని ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు రతన్ నావల్ టాటా. అయితే పదేళ్ల వయసులోనే ఆయన తల్లి, తండ్రి విడిపోవటం వల్ల చిన్నారి రతన్ టాటా అలాగే తమ్ముడు జిమ్మీని నాయనమ్మ నవాజ్ బాయి టాటా పెంచి పెద్దచేశారు. దీంతో రతన్ బాల్యమంతా తన బామ్మ దగ్గరే గడిపారు. ముంబయి, సిమ్లాలోని పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఆపై విదేశాలకు పయనమయ్యారు. అక్కడ అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయంలో స్ట్రక్చరల్ డిజైనింగ్ ప్రధానాంశంగా 'బీఆర్క్' కోర్స్​ను కంప్లీట్ చేశారు.

రతన్ టాటా ప్రేమ ప్రయాణం
గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక టాటాకు లాస్​ఏంజిలిస్​లోని జోన్స్ అండ్ ఎమ్మోన్స్(Jones and Emmons) ఆర్కిటెక్చర్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆయన సుమారు రెండేళ్ల పాటు పనిచేశారు. అప్పుడే ఆయనకు ఐబీఎంలో (IBM) ఆఫర్​ వచ్చింది. అంతలోనే స్వదేశం నుంచి ఆయనకు హఠాత్తుగా ఓ కబురు వచ్చింది. అది ఆయనను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అన్నీ తానై పెంచిన నాయనమ్మ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో రతన్ టాటాను ఉన్నపళంగా ఇండియా వచ్చేయాలంటూ ఆమె నుంచి పిలుపు వచ్చింది. తమ సొంత వ్యాపారంలో టాటాలకు అండగా ఉండాలంటూ ఆమె రతన్ టాటాను కోరారు.

కానీ తను పనిచేసే సంస్థలోనే సహ ఉద్యోగి అయిన ఓ అమెరికన్ యువతిని ఆయన ప్రేమించారు. వీరిద్దరి పరిచయం కాస్త ప్రణయంగా మారింది. పెళ్లి చేసుకొని ఓ కొత్త లైఫ్​ను స్టార్ట్ చేద్దామని కలలు కంటున్న వేళ కలవరపరిచే ఘటనలు ఆయన్ను చుట్టుముట్టాయి. దీంతో తనతో ఇండియా వచ్చేయాలంటూ ప్రేయసిని రతన్ టాటా కోరారు. కానీ దానికి ఆ యువతి తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోలేదు. అప్పుడు ఇండో చైనా యుద్ధం నడుస్తున్నందున ఇటువంటి పరిస్థితులలో తమ కుమార్తెను ఇండియాకు పంపబోమని వారు తేల్చి చెప్పారు.

ఓ వైపు ఇండియా వచ్చేయాలన్న నాయనమ్మ కోరికను మన్నించాలా? లేకుంటే తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి అమెరికాలోనే ఉండిపోవాలా? అనే ప్రశ్నలు రతన్ టాటాను సందిగ్ధంలో నెట్టేశాయి. కానీ మాతృదేశం మీద ఆయనకున్న మమకారం, నాయనమ్మ అనురాగం ఆయన్ని తిరిగి సొంత దేశానికి వచ్చేలా చేశాయి. అలా 1962లో రతన్ టాటా భారత్​కు తిరిగి వచ్చారు. నాయనమ్మ పిలుపే రతన్ టాటా జీవితానికి మలుపైంది. కానీ ఒక్కరినే ప్రేమించి వారినే పెళ్లాడలన్న తన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్న ఆయన తన ప్రేయసి స్మృతులతో అలాగే జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు.

దయామయుడు - మూగజీవాల కోసం భారీ ఆసుపత్రి నిర్మించిన రతన్​ టాటా

పారిశ్రామిక మేరు నగధీరుడు - సాటిరారు ఆయనకెవ్వరూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.