ETV Bharat / business

మీ సోదరికి 'రాఖీ' కానుక ఇవ్వాలా? ఆర్థిక భరోసా ఇచ్చే ఈ గిఫ్ట్‌లు ట్రై చేయండి! - Financial Gifts For Raksha Bandhan - FINANCIAL GIFTS FOR RAKSHA BANDHAN

Financial Gifts For Raksha Bandhan : రాఖీ పండుగ సందర్భంగా మీ అక్కాచెల్లెళ్లకు మంచి కానుక ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఎప్పటిలా కాకుండా, ఆర్థిక భరోసా అందించేలా ఈ కొత్త గిఫ్ట్‌లు ఇచ్చే ప్రయత్నం చేయండి.

Raksha Bandhan 2024
Raksha Bandhan 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 18, 2024, 1:31 PM IST

Financial Gifts For Raksha Bandhan : అన్నా చెల్లెళ్ల అనురాగం, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ రోజున చేతికి రక్షా బంధనం కట్టినందుకు సోదరికి అన్నదమ్ములు కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. అందుకే ఈ ఆగస్టు 19న నిర్వహించే రాఖీ పండుగకు ఎప్పటిలా కాకుండా, దీర్ఘకాలిక ఆర్థిక భరోసా కల్పించే కానుకను మీ సోదరికి ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాగే అనుకోని పరిస్థితుల్లో అండగా ఉండే బీమాతో మీ సోదరికి ధీమా కల్పించండి.

భవిష్యత్​ కోసం
ప్రస్తుతం ఉన్న పెట్టుబడి సాధనాల్లో మ్యూచువల్‌ఫండ్స్​ ఒకటి. దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడిని ఇస్తాయి. అందుకే క్రమానుగత పెట్టుబడి విధానం (SIP)లో మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టడం మంచిది. కనుక ఈ రాఖీ పౌర్ణమి నుంచే మీ సోదరి పేరు మీద మీ ఆర్థిక శక్తిని బట్టి పెట్టుబడిని ప్రారంభించండి. ఇది ఆమెకు భవిష్యత్​లో మంచి ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్​ స్కీమ్
మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ పథకంలో మీ సోదరి పేరున పొదుపు చేయండి. సాధారణ బ్యాంకులు అందించే వడ్డీ కంటే, ఈ పథకంలో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తారు. ఇలా వచ్చే రాబడి భవిష్యత్తులో మీ సోదరికి అండగా ఉంటుంది.

స్టాక్స్‌
ఎప్పటిలా ఏదో ఒక కానుక ఇచ్చే బదులు మంచి స్టాక్స్‌ను మీ అక్కచెల్లెళ్లకు ఇవ్వండి. మంచి కంపెనీల షేర్లపై పెట్టుబడి పెట్టి వారికి అందిస్తే, కాలక్రమేణా సంపదను పెంచుకొనే అవకాశం కల్పించిన వారవుతారు.

బంగారం, వెండి
రాఖీ పండుగ సందర్భంగా చాలా మంది తమ అక్కాచెల్లెళ్లకు బంగారాన్ని కానుకగా ఇస్తుంటారు. అది కూడా మంచి గిఫ్టే. బంగారం, వెండి లాంటివి ఇస్తే అవి శాశ్వతంగా ఉండిపోతాయి. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఈ లోహాలే వారికి అండగా నిలుస్తాయి. భౌతికంగానే కాదు, డిజిటల్‌ బంగారాన్ని కూడా మీరు కొని ఇవ్వవచ్చు. దీని వల్ల ఏటా మీ సోదరికి కొంత రాబడి కూడా వస్తుంది.

ఫిక్స్​డ్​ డిపాజిట్
మీ సోదరికి ఎలాంటి నష్టభయం లేని, మంచి రాబడిని ఇచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను గిఫ్ట్​గా ఇవ్వవచ్చు. ఇవి స్థిరమైన రాబడిని అందిస్తూ అనేక ప్రయోజనాలను కల్పిస్తాయి. అనుకోని పరిస్థితుల కారణంగా అత్యవసరంగా డబ్బు కావాల్సిన సమయంలో, అండగా ఉండేందుకు ఇది అత్యవసర నిధిలా ఉపయోగపడుతుంది.

బీమాతో ధీమా
మీ అక్కాచెల్లెళ్ల ఆరోగ్యానికి, భవిష్యత్‌కు భరోసా కల్పించడానికి, వారి పేరు మీద బీమా పాలసీ తీసుకోండి. ముఖ్యంగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌తో పాటు ఆరోగ్య బీమా పాలసీ కూడా కొనివ్వడం మంచిది. భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు వస్తే, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఇది మీ సోదరికి ధీమాని కల్పిస్తుంది.

ఆర్థిక ప్రణాళిక
ఆర్థిక ప్రణాళిక తయారు చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం. ఒకవేళ మీ అక్కాచెల్లెళ్లకు వీటిపై పెద్దగా అవగాహన లేకపోతే, వారి భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మంచి ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయండి. చదువు, ఉద్యోగం, పొదుపు, వివాహానంతర జీవితం, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, వారికి ఆర్థిక భరోసానిచ్చే చక్కటి ప్రణాళికను వారి చేతిలో పెట్టండి. అవసరమైతే, ఆర్థిక నిపుణుల దగ్గరకు తీసుకెళ్లి వివరించే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీ సోదరికి రాఖీ పండుగ సందర్భంగా మంచి కానుక ఇవ్వండి.

వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగ బాధ్యతలను బ్యాలెన్స్‌ చేయాలా? 8-8-8 రూల్​ను ఫాలో అవ్వండి! - 8 8 8 Rule For Work Life Balance

ప్లాట్‌ లేదా ఫ్లాట్‌ కొనాలా? తప్పనిసరిగా చెక్‌ చేయాల్సిన డాక్యుమెంట్స్‌ ఇవే! - Property Documents Checklist

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.