ETV Bharat / business

అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ పార్టీ 2.0- షిప్​లో గ్రాండ్ ఈవెంట్స్- 800మంది VVIP అతిథులు! - Anant Ambani 2nd Pre Wedding Party - ANANT AMBANI 2ND PRE WEDDING PARTY

Radhika Anant Ambani 2nd Pre Wedding Events : రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత, ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రెండో ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమాలు ప్రత్యేక క్రూయిజ్ షిప్‌లో ఈనెల 29న ఇటలీలో మొదలై జూన్ 1న ఫ్రాన్స్‌లో ముగుస్తాయి. నాలుగు రోజుల ఈ మెగా పార్టీలో జరగబోయే ఈవెంట్స్ వివరాలు తెలియాలంటే మొత్తం కథనం చదవాల్సిందే.

Radhika Merchant Anant Ambani
Radhika Merchant Anant Ambani (GettyImages)
author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 7:43 PM IST

Radhika Anant Ambani 2nd Pre Wedding Events : అపర కుబేరుడు, వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ​ రెండో ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఈనెల 29న ఇటలీలో మొదలుకానున్న నాలుగు రోజుల క్రూయిజ్ షిప్ మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఎంతోమంది వీఐపీ అతిథులు ఇప్పటికే భారత్ నుంచి బయలుదేరి వెళ్లారు.

జూన్ 1న క్రూయిజ్ షిప్ ఫ్రాన్స్‌కు చేరుకునే వరకు కొనసాగే ఈ గ్రాండ్ పార్టీలో రణబీర్ కపూర్, ఆలియా భట్, సల్మాన్ ఖాన్, ఎంఎస్ ధోనీ, షారూఖ్ ఖాన్ వంటి దాదాపు 800 మంది దేశవిదేశీ ప్రముఖులు పాల్గొననున్నారు. అతిథులకు సేవ చేయడానికి షిప్‌లో దాదాపు 600 మంది స్టాఫ్ అందుబాటులో ఉంటారు. దీన్నిబట్టి అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ రెండో ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ ఎంత గ్రాండ్‌గా జరగబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఈవెంటుకు సంబంధించిన ఆహ్వాన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఈ కాలంలో స్నేహితులు ఏకమైతే జీవితకాలపు అడ్వెంచరే. ఆవిష్కరణ, అన్వేషణల ప్రయాణం ఇటలీ, ఫ్రాన్స్‌లలో జరుగుతుంది" అని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, అనంత్ అంబానీ మొదటి ప్రీ-వెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వేదికగా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే.

Radhika Merchant, Anant Ambani
Radhika Merchant, Anant Ambani (GettyImages)

క్రూయిజ్ షిప్‌లో ఈవెంట్స్ ఇవే!

  • మే 29న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ రెండో ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ ఇటలీలో ఓ క్రూయిజ్ షిప్‌లో మొదలవుతుంది. ఇందులో అతిథులకు లంచ్ పార్టీతో స్వాగతం పలుకుతారు. దీనికి అతిథులంతా క్లాసిక్ డ్రెస్సులో వస్తారు. రాత్రి జరిగే ఈవెంట్స్‌కు వెస్ట్రన్ ఫార్మల్స్ ధరించి వస్తారు.
  • మే 30న రోమన్ హాలిడే అనే ఈవెంట్ ఉంది. దీనికి హాజరయ్యే వారు చిక్ దుస్తులను ధరిస్తారు. ఇక రాత్రి టైంలో టోగా పార్టీ ఉంటుంది. దీనికి హాజరయ్యే వారంతా ప్రాచీన గ్రీకో-రోమన్ తరహా దుస్తులు, చెప్పులను ధరిస్తారు. పూర్తిగా ఆనాటి ప్రాచీన కాస్ట్యూమ్స్ వేసుకొని ఈవెంట్‌కు వస్తారు.
  • మే 31న 'V టర్న్స్ వన్ అండర్ ది సన్' అనే ఈవెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా కుమార్తె వేదా అక్ష అంబానీ మొదటి పుట్టినరోజు వేడుకను నిర్వహిస్తారు.
  • అదే రోజు సాయంత్రం లే మాస్క్వెరేడ్, పార్డన్ మై ఫ్రెంచ్ అనే ఆఫ్టర్ పార్టీ అనే ఈవెంట్స్ జరుగుతాయి. ఇవి వినోదాత్మకంగా ఉంటాయి. లే మాస్క్వెరేడ్ ఈవెంట్‌కు హాజరయ్యే వారంతా మొహం మొత్తాన్ని కవర్ చేసే మాస్క్‌లను ధరిస్తారు. పార్డన్ మై ఫ్రెంచ్ అనే ఆఫ్టర్ పార్టీలో క్షమాపణలను వినోదాత్మకంగా చెప్పుకోవడం ఉంటుంది.
  • ఈవెంట్స్‌లో చివరి రోజైన జూన్ 1న లా డోల్స్ వీటా అనే ఈవెంట్ జరుగుతుంది. దీని అర్థం 'మంచి జీవితం'.

అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వెడ్డింగ్ - గెస్టులకు గిఫ్ట్​గా కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు - AMBANI ORDERS KARIMNAGAR FILIGREE

అంబానీ ప్రీ వెడ్డింగ్​లో 'నాటు నాటు' ఫీవర్​ - చెర్రీతో స్టెప్పులేసిన బాలీవుడ్ తారలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.